pizza

"Who’s this guy… came here and just nailed it — that’s what I want people to feel!" – Suhas
"ఎవడ్రా వీడు.. ఇక్కడకొచ్చి ఇరగదీశాడని వాళ్ళనుకోవాలి" - సుహాస్

You are at idlebrain.com > news today >

30 June 2025
Hyderabad

As part of promotions for his film Oh Bhama Ayyo Rama, actor Suhas gave an interview to Idlebrain Jeevi, where he not only spoke about the film but also shared interesting anecdotes from his other projects. He revealed that this is the first time he’s playing a romantic comedy lead and even lent his voice to a song. Both he and the film’s director are fans of Chiranjeevi, and subtle tributes to the star can be spotted in the film. He also mentioned that his film Colour Photo was well received in Sri Lanka.

Reflecting on his earlier roles, Suhas said he mostly portrayed characters who get duped, but this time he’s showing a different shade. He admitted that doing “mesmerizing looks” toward female characters was a bit awkward for him. Since childhood, he’s had a passion for dance and even choreographed in college. He shared how, in the past, whenever he showed interest in dance, people would dismiss him by saying “What’s the story? Why are you even asking?” But luckily, this film gave him a chance to dance.

Suhas also spoke about his upcoming role in Mandadi, where he plays a negative character. He requested the director to include people fluent in both Tamil and Telugu so he could prepare more accurately. He’s giving it his all, aiming to avoid criticism and hoping everyone on set claps and says, “Who is this guy? He came in and killed it!”

In Oh Bhama Ayyo Rama, veteran actor Ali plays his uncle, while Nuvvu Nenu fame Anita portrays his mother. He shared that many of their scenes together are emotionally powerful. Directors Harish Shankar and Maruthi will also appear in cameos in the film.

"ఎవడ్రా వీడు.. ఇక్కడకొచ్చి ఇరగదీశాడని వాళ్ళనుకోవాలి" - సుహాస్.

'ఓ భామా అయ్యో రామా' సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో సుహాస్ ఐడిల్ బ్రెయిన్ జీవికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్యూలో 'ఓ భామా అయ్యో రామా' సినిమా గురించే కాకుండా, తన ఇతర సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా జీవితో పంచుకున్నారు. ఈ సినిమాలో మొదటి సారిగా రొమాంటిక్ కామెడీ పాత్రను చేశారన్నారు. ఈ సినిమాలో మొదటిసారిగా ఒక పాట కూడా పాడానన్నారు. తనతో పాటూ దర్శకుడు కూడా చిరంజీవి గారి అభిమాని కావడంలో కొన్ని రిఫరెన్సులు కనిపిస్తాయన్నారు. అదొక ట్రిబ్యూట్ అన్నారు. తన కలర్ ఫోటో సినిమాను శ్రీలంకలో కూడా బాగా చూశారన్నారు.

గతంలో ఎక్కువగా మోసపోయే పాత్రల్లోనే ఎక్కువగా కనిపించానని, ఈ సినిమాలో మాత్రం కొత్తగా కనిపిస్తానని, అమ్మాయిలను చూసి మెస్మరైజింగ్ గా లుక్ ఇవ్వడం లాంటివి ఇబ్బందిగా అనిపించిందన్నారు. చిన్నప్పటి నుండీ తనకు డాన్స్ బాగా తెలుసని, కాలేజీలో కొరియోగ్రఫీ కూడా చేసేవాడినన్నారు. గతంలో ఎవరినైనా డాన్స్ గురించి అడిగితే "స్టోరీ ఏంటి, నువ్వడుగుతున్నదేంటి" అని తిట్టేసి తనను పంపించేసేవారన్నారు. లక్కీగా ఈ సినిమాలో డాన్స్ చేసే అవకాశం దొరికిందన్నారు.

మందాడి సినిమాలో నెగటివ్ పాత్ర చేస్తున్నానన్నారు. ఆ సినిమా కోసం తమిళం మరియు తెలుగు రెండు భాషలనూ తెలిసిన వాళ్ళను పెట్టమని డైరెక్టర్ ను రిక్వెస్ట్ చేసానని, వాళ్ళు నాతో ట్రావెల్ అవ్వడంతో, విమర్శలకు దొరికే అవకాశాలు ఎవరికీ ఇవ్వకూడదనే భయంతోనే చేస్తున్నానన్నారు. సెట్ లో కూడా అందరూ క్లాప్స్ కొట్టాలి, ఇక్కడకు వచ్చి ఎవడ్రా వీడు ఇరగదీసేసాడు అని వాళ్లంతా అనుకోవాలనే కష్టపడుతున్నాన్నారు. 'ఓ భామా అయ్యో రామా' సినిమాలో అలీ గారు తనకు మామయ్యగా నటిస్తున్నారని, 'నువ్వు నేను' సినిమా హీరోయిన్ అనిత గారు తనకు తల్లి పాత్రలో కనిపించబోతున్నారన్నారు. వాళ్ళతో నటించే చాలా సన్నివేశాలు ఎమోషనల్ గా వచ్చాయన్నారు. ఈ సినిమాలో దర్శకులు హరీష్ శంకర్ గారు, మారుతి గారు కూడా చిన్న క్యామియోలో కనిపిస్తారన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved