The much-awaited first single from OG (They Call Him OG), titled “Firestorm,” has finally been unleashed, and it is nothing short of a musical inferno.
Directed by Sujeeth and produced by DVV Danayya under DVV Entertainment, OG stars Power Star Pawan Kalyan in a fierce gangster avatar alongside Emraan Hashmi, Priyanka Mohan, Arjun Das, and Prakash Raj in key roles.
Composed by the musical dynamite Thaman S, Firestorm is a high-octane anthem that blends hard-hitting electronic beats, cinematic grandeur, and raw intensity. The lyrics, packed with swagger and grit, celebrate the unrelenting power of the OG, making it a perfect tribute to Pawan Kalyan’s larger-than-life persona.
Adding to the hype is Silambarasan TR (Simbu), who has lent his powerful vocals to the track. His voice, packed with fire and emotion, elevates the song to a whole new level.
A Perfect Kickoff to #OG Fever
The launch of Firestorm marks a key milestone in OG’s promotions. The track has been described by fans as a “banger” and “musical storm” that captures the rebellious spirit of the film. The hook line and pulsating beats are tailor-made for fans to whistle, cheer, and chant along in theatres.
From the moment of release, social media has been flooded with reels, fan edits, and mass celebrations, proving that Firestorm is already a cultural phenomenon.
Fans Go Berserk: The OG Fever Takes Over
Pawan Kalyan fans have hailed the song as a battle cry, perfectly complementing the gangster vibe of the movie. The track has drawn comparisons to global anthems of rebellion, with many calling it one of Thaman’s finest works.
With Firestorm, the film’s musical campaign has officially kicked off in style, and expectations have skyrocketed for what’s to come next.
With the film set to hit theatres worldwide on September 25, 2025, Firestorm serves as the perfect appetizer to the high-voltage cinematic spectacle that OG promises to be.
Cast: Pawan Kalyan, Emraan Hashmi, Priyanka Mohan, Arjun Das, Prakash Raj, Sriya Reddy
Director: Sujeeth
Music Composer: Thaman S
Cinematography: Ravi K. Chandran
Editor: Navin Nooli
Production House: DVV Entertainment
Producer: DVV Danayya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' మొదటి గీతం 'ఫైర్ స్టార్మ్' విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర ఓజాస్ గంభీరగా అలరించనున్న చిత్రం 'ఓజీ' (They Call Him OG). పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఓజీ' చిత్రం నుంచి మొదటి గీతం 'ఫైర్ స్టార్మ్' విడుదలైంది. ఈ గీతం నిజంగానే ఓ అగ్ని తుఫానులా ఉంది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఓజీ' చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాకుడిగా రవి కె చంద్రన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
తమన్ స్వరపరిచిన 'ఫైర్ స్టార్మ్' గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. ఓజాస్ గంభీర పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందో తెలిపేలా తమన్ సంగీతం ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. అదిరిపోయే ఎలక్ట్రానిక్ బీట్స్, భారీతనం, రా ఇంటెన్సిటీని మిళితం చేస్తూ సాగిన ఈ గీతం అగ్ని తుఫానుని తలపిస్తోంది.
పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వానికి నివాళి అన్నట్టుగా ధైర్యంతో నిండిన ఈ పాట సాహిత్యం కూడా అద్భుతంగా ఉంది. ప్రముఖ నటుడు శింబు ఈ పాటకు తన శక్తివంతమైన గాత్రాన్ని అందించారు. ఉద్వేగం, ఉత్సాహంతో నిండిన ఆయన స్వరం.. ఈ పాటను మరోస్థాయికి తీసుకొనివెళ్ళింది.
'ఓజీ' ఫీవర్ కి ఒక అద్భుతమైన ఆరంభం
'ఫైర్ స్టార్మ్' గీతం 'ఓజీ' సినిమా ప్రమోషన్ కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ ట్రాక్‌ను అభిమానులు 'బ్యాంగర్' మరియు 'సంగీత తుఫాను'గా అభివర్ణిస్తున్నారు. థియేటర్లలో అభిమానులు ఉత్సాహంతో ఈలలు వేసేలా ఫైర్ స్టార్మ్ గీతం యొక్క సంగీతం, సాహిత్యం ఉన్నాయి.
విడుదలైన క్షణం నుండే సామజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది 'ఫైర్ స్టార్మ్' గీతం. రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్, మాస్ సెలబ్రేషన్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది.
'ఓజీ' ఫీవర్ లో పవర్ స్టార్ అభిమానులు
సినిమాలోని గ్యాంగ్‌స్టర్ వైబ్ కి అద్దంపట్టేలా ఉన్న 'ఫైర్ స్టార్మ్' గీతంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో సంగీతం ఉందని ప్రశంసిస్తున్నారు. తమన్ ఇప్పటివరకు స్వరపరిచిన అత్యుత్తమ గీతాలలో ఒకటిగా దీనిని అభివర్ణిస్తున్నారు.
'ఫైర్ స్టార్మ్' గీతం విడుదలతో 'ఓజీ' సంగీత ప్రచారం అధికారికంగా ఘనంగా ప్రారంభమైంది. దీంతో సినిమా నుంచి తదుపరి రాబోయే కంటెంట్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఓజీ' చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో తెలిపేలా 'ఫైర్ స్టార్మ్' గీతం ఉంది. వెండితెరపై అద్భుతమైన ఓ భారీ యాక్షన్ సినిమాని చూడబోతున్నామనే హామీని ఈ పాట ఇచ్చింది.