ప్రీమియర్ల నుండే 'OG' ప్రభంజనం మొదలైంది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా కనిపించిన ఈ సినిమాలో బాలీవుడు నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్రలో కనిపించగా, ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యదిక వసూళ్ళు చేసిన సినిమాగా 'OG' నిలిచింది. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ను ఓజాస్ గంభీరగా తెరపై చూపించిన తీరుకి పవన్ అభిమానులు ముగ్ధులైపోయారు. సంగీత దర్శకుడు థమన్ అందించిన సంగీతం 'OG' కు అదనపు బలమైందనే చెప్పుకోవచ్చు.
తాజాగా 'OG' నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. విడుదలైన 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 'OG' సినిమా 308 కోట్ల గ్రాస్ సాధించినట్టు ఈ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా 2025 సంవత్సరంలోనే ఇప్పటి వరకూ విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు చేసిన మొదటి సినిమాగా 'OG' నిలిచినట్టు అధికారిక ప్రకటన విడుదలచేసింది 'OG' నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్. దాంతో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.
#OG storms past ₹308 Cr worldwide gross to emerge as the top Telugu grosser of the year! 💥 pic.twitter.com/oQcVfM2fl7