Young hero Siddu Jonnalagadda, who created a sensation at the box office with DJ Tillu, is known for his vibrant and witty personality — both on and off screen. He often entertains those around him with his humorous take on things. In the same spirit, he recently expressed his opinion and admiration for a film on social media.
The movie currently trending as a hot topic among both audiences and industry circles is ‘OG’, starring Pawan Kalyan and directed by Sujeeth. The film has already generated massive expectations. The songs composed by Thaman are sending Pawan fans into a frenzy.
Siddu Jonnalagadda posted an interesting tweet about OG, expressing his love for Pawan Kalyan:
“#OG HYPE ki health upset ayye la undi . 25th varaku memu untamo pothamo ardham kaatledu. Ippude Ila unte 25th taravaata ento paristhithi. @PawanKalyan garu , YEH PAWAN NAHI , AANDHI HAI . @Sujeethsign this is UNREAL man!!! @priyankaamohan @emraanhashmi sir @MusicThaman bro , #naveennooli anna and @DVVMovies !”
With that humorous tweet, Siddu added even more excitement among fans eagerly waiting for the film.
నా ఆరోగ్యాన్ని 'OG' హైప్ చెడగొడుతోంది - సిద్ధు జొన్నలగడ్డ
సిద్ధు జొన్నలగడ్డ, 'డీజే టిల్లు' తో బాక్సాఫీస్ దగ్గర ఓ దుమారమే రేపిన యువ హీరో. ఆ సినిమాలో మాదిరే బయట కూడా ఎంతో ఉల్లాసంగా కనిపిస్తూ ఉంటారు సిద్ధు. చుట్టూ ఉన్న వాళ్లను తన మాటలతో నవ్విస్తూ ఉంటారాయన. అదే రీతిలో ఓ సినిమాపై తన అభిప్రాయాన్ని, అభిమానాన్నిసోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రేక్షకుల్లోనూ అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా నడుస్తున్న సినిమా 'OG'. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. థమన్ అందించిన పాటలు ఇప్పటికే పవన్ అభిమానులను ఉర్రూతలు ఊగిస్తూనే ఉన్నాయి.
'OG' గురించి ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆ ట్వీట్ లో హీరో పవన్ కళ్యాణ్ పై తన ప్రేమను వ్యక్తం చేశారాయన. " OG హైప్ కి హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉంది, రిలీజ్ డేట్ 25 వరకూ మేము ఉంటామో పోతామో అర్ధం కావట్లేదు, ఇప్పుడే ఇలా ఉంటే సెప్టెంబర్ 25 తరువాత ఏంటో పరిస్థితి" అంటూ ట్వీట్ పెట్టి సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపారు హీరో సిద్ధు జొన్నలగడ్డ.