పవన్ అభిమానులను అదిరిపోయే వార్త చెప్పారు పవన్ కళ్యాణ్. 'OG' భారీ విజయంలో అందరి పాత్ర ఉందంటూ ఆ చిత్రానికి పని చేసిన బృందంలో అందరినీ పేరుపేరునా ప్రస్తావించి వాళ్లకు ధన్యవాదాలు పలికారు పవన్.
నిన్న చిరంజీవితో పాటుగా మెగా కుటుంబం మొత్తం 'OG' సినిమాను వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు. థమన్ బ్రిల్లియంట్ వర్క్ చేశారు. ఇది గ్రేట్ మూమెంట్. సక్సెస్, కలక్షన్ల సంగతి నాకు తెలియదు. రవిచంద్రన్ సెల్యులాయిడ్ పోయెట్. 'OG' యూనివర్స్ కొనసాగింపు కోసం నేను కూడా ఆసక్తిగా చూస్తున్నాను. 'OG' అంతా కేవలం సుజీత్ సృష్టించిన మాయే" అన్నారు. 'OG2' అప్డేట్ పవన్ కళ్యాణ్ నోటి నుండే రావడంతో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.