pizza

Oh Sukumari Movie Pre Release Event
'ఓ.! సుకుమారి' ప్రేమతో చేసిన మంచి సినిమా. అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. జూలై 17న థియేటర్స్ లో చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో తిరువీర

You are at idlebrain.com > news today >

15 July 2026
Hyderabad

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో తిరువీర్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. 'మసూద' సినిమాకి, ఈ సినిమాకి కొన్ని ఆసక్తికరమైన పోలికలు ఉన్నాయి. 'మసూద' సినిమాను ఎస్‌వీసీ రిలీజ్ చేసింది. ఈ సినిమాను కూడా ఎస్‌వీసీనే విడుదల చేస్తోంది. అందులో నా జోడీగా నటించిన అమ్మాయి పేరు మినీ. ఇందులో నా జోడీగా నటించిన అమ్మాయి పేరు దామిని. (నవ్వుతూ) మహేశ్వర్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ సినిమా ద్వారా నాకు ఒక మంచి కుటుంబం దొరికినట్టుగా అనిపించింది. దర్శకుడు, నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పుడు నాకు సొంత బ్యానర్‌లా అనిపిస్తోంది. నిన్ననే సినిమా చూశాను. ఈ సినిమాకు అసలు హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ భరత్. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. దర్శకుడు భరత్ దర్శన్‌కు, సంగీత దర్శకుడు భరత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు చాలా మంచి సినిమా ఇచ్చారు. మా ఎడిటర్‌తో పాటు టెక్నికల్ టీమ్ అంతా ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు. ఇది ప్రేమతో, కష్టపడి చేసిన సినిమా. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఐశ్వర్య గారికి నేను అభిమానిని. ఆమెతో రెండోసారి కలిసి నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మా నిర్మాత గారికి ఈ సినిమా ద్వారా మంచి లాభాలు రావాలి. ఆయన ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో తీయాలి. మాకందరికీ రెగ్యులర్‌గా పని ఉండాలి. ఇండస్ట్రీ బాగుండాలి. థ్యాంక్యూ.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ... 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత 'ఓ.! సుకుమారి' తో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. జూలై 17న సినిమా విడుదలవుతోంది. ముందుగా మా నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన ఈ కథను ఎంతో నమ్మారు. ఒక చిన్న సినిమాను పెద్ద సినిమాలా తీర్చిదిద్దడానికి ప్రతి ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఆయనకు చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరం కలిసి సక్సెస్ పార్టీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దర్శన్‌కు ఆల్ ది బెస్ట్. తిరువీర్ గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమాటోగ్రాఫర్ ఎంతో అందంగా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ భరత్ అద్భుతమైన సంగీతం అందించారు. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక కారులో ప్రయాణిస్తుండగా ఈ సినిమా పాటలు వరుసగా దాదాపు పది సార్లు వినిపించాయి. ప్రతి పాట అద్భుతంగా ఉంది. భరత్‌కు చాలా మంచి భవిష్యత్తు ఉంది.మా సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు భరత్ దర్శన్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమాపై నాకు డబుల్ కాన్ఫిడెన్స్ ఉంది. జూలై 17న థియేటర్లలో కలుద్దాం. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత తిరువీర్, ఐశ్వర్య రాజేష్‌ల నటనను మీరు చాలా కాలం గుర్తుంచుకుంటారు. వాళ్ల పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా డీవోపీ, ఎడిటర్, టెక్నికల్ టీమ్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరిస్తుంది. వినోదానికి ఎలాంటి లోటు ఉండదు.

నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మేము చాలా మంచి సినిమా తీశాం. ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. జూలై 17న సినిమా విడుదలవుతోంది. అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ... ఇది మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా. దర్శకుడు తొలి సినిమానే అయినా చాలా అద్భుతంగా తీశారు. అందరూ సినిమా చూసి ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.

డీవోపీ కుషేందర్ మాట్లాడుతూ... దర్శన్ గతంలో నేను చేసిన సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆయన చెప్పిన ఈ కథ నాకు ఎంతో నచ్చింది. మహేశ్వర్ రెడ్డి గారికీ కథ బాగా నచ్చింది. ఇది ప్రేక్షకులు పెట్టే ప్రతి రూపాయికి పూర్తి న్యాయం చేసే సినిమా. పైసా వసూల్ ఎంటర్‌టైనర్. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ అద్భుతమైన నటన కనబరిచారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు హై వోల్టేజ్‌లో సాగుతుంది. అందరూ చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.

సంగీత దర్శకుడు భరత్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. పూర్ణాచారి గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఎడిటర్ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. సినిమా మామూలుగా ఉండదు. పూర్తి హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రేక్షకులందరినీ ఈ సినిమా పూర్తిగా అలరిస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం.'అన్నారు. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

తారాగణం: తిరువీర్, ఐశ్వర్య రాజేష్

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి
దర్శకత్వం: భరత్ దర్శన్
డీవోపీ: CH కుషేందర్
సంగీతం: భరత్ మంచిరాజు
ఆర్ట్ డైరెక్టర్: తిరుమల ఎం తిరుపతి
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
కాస్ట్యూమ్ డిజైనర్: అను రెడ్డి అక్కటి
లిరిక్స్: పూర్ణాచారి
ఫైట్స్ : అంజి
కొరియోగ్రఫీ: జెడి మాస్టర్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
ohsukumari-prereleaseevent s