Oh Sukumari Thank You Meet
'ఓ.! సుకుమారి' పై ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు థాంక్ యూ. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది: థాంక్ యూ మీట్ లో హీరో తిరువీర్
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓ.! సుకుమారి'. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. జూలై 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
థాంక్ యూ మీట్ లో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. నిజానికి నా సినిమాలకు ఒక్కో షోకి రెస్పాన్స్ పెరుగుతూ ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ షోల వరకు ప్రేక్షకుల స్పందన మరింత పెరుగుతోంది. అలాగే ఈ సినిమా కూడా పికప్ అవుతోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యామని చెబుతున్నారు. నన్ను ఫ్యామిలీ హీరో అని పిలుస్తున్నారు. ఆ గుర్తింపుకు తగ్గట్టుగానే మహిళా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఈ సినిమా పాజిటివ్ టాక్ మరింతగా స్ప్రెడ్ అయి పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు భరత్ దర్శన్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. మేము విమర్శలన్నింటినీ స్వాగతిస్తాం. కానీ విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి. రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా నుంచి కూడా ఒక షో హౌస్‌ఫుల్ అయ్యిందని మెసేజ్ వచ్చింది. ప్రతి చోటా షోలు పెరుగుతున్నాయి. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సినిమాకు కొంత సమయం ఇవ్వండి. అది మెల్లమెల్లగా పుంజుకుంటుంది. ఇలాంటి ఎన్నో సినిమాలు గతంలో నిరూపించాయి. మౌత్ టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అవుతోంది. తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను. థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు."
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. సినిమా అనేది రెండు గంటలు మాత్రమే కనిపించవచ్చు. కానీ దాని వెనుక రెండేళ్ల కష్టం ఉంటుంది. ఎంతోమంది టెక్నీషియన్లు, నటీనటుల శ్రమ ఉంటుంది. ఆ కలను నిజం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ప్రారంభించాం. మాపై నమ్మకం ఉంచి డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ భాగస్వాములు ముందుకు రావడం మా కష్టానికి దక్కిన గుర్తింపు. సినిమా విడుదలైన వెంటనే కొన్ని రివ్యూలు చూసి బాధ కలిగింది. సినిమా చూసిన తర్వాత అభిప్రాయం చెప్పడం ఒక విషయం. కానీ ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లకముందే నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేయడం బాధాకరం. మేము విమర్శలను గౌరవిస్తాం. మంచి చెప్పినా, చెడు చెప్పినా మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ అది నిర్మాణాత్మకంగా ఉండాలి. సినిమా విజయం, అపజయం అనేది ప్రేక్షకుల నిర్ణయం కావాలి. ప్రతి సినిమా వెనుక ఒక నిర్మాత మాత్రమే కాదు... వందలాది కుటుంబాల జీవితాలు ఉంటాయి. అందుకే మీడియా మిత్రులకు, రివ్యూ రైటర్లకు నా వినమ్ర విజ్ఞప్తి... మీ వాయిస్ చాలా పవర్‌ఫుల్. దాన్ని బాధ్యతగా ఉపయోగించండి. ప్రేక్షకులను ప్రభావితం చేసే ముందు వాళ్లకు సినిమా చూసే అవకాశం ఇవ్వండి. దయచేసి ఈ సినిమాను ఓపెన్ మైండ్‌తో చూడండి. మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. ఎంతో ప్రేమతో, నమ్మకంతో ఈ సినిమా తీశాం. థియేటర్‌కు వచ్చి చూసి మీ తీర్పు చెప్పండి. అదే మా కోరిక."
క్రాంతి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తప్పకుండా మీరు కూడా థియేటర్‌కు వచ్చి ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను."
డీవోపీ కుషేందర్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మేము చాలా మంచి సినిమా తీశాం. ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. మా టీమ్ అందరికీ అభినందనలు. మేము అనుకున్న విధంగానే ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. ఒక్కో షోకి ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. ఇది చాలా మంచి ఎమోషనల్ డ్రామా. ఇలాంటి సినిమాలను అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. తిరువీర్ గారికి 'ఫ్యామిలీ స్టార్' అనే పేరు రావడం చాలా ఆనందంగా ఉంది."
నటుడు అంజి మామ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలకు చాలా ఎమోషనల్ అవుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లో చూడండి. కచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.