pizza

Om Bheem Bush teaser launched
'ఓం భీమ్ బుష్' లాంటి సినిమా ఇప్పటివరకూ ఎవరూ తీయలేదు. మా ముగ్గురు పాత్రలకు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతారు. రెండుగంటల పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు

You are at idlebrain.com > news today >

26 February 2024
Hyderabad

Bang Bros Sree Vishnu, Priyadarshi, and Rahul Ramakrishna generated laughs with a pre-look glimpse and first-look poster of the out-and-out-entertainer Om Bheem Bush directed by Sree Harsha Konuganti of Husharu fame. V Celluloid and Sunil Balusu together bankroll the project, while UV Creations presents it. Are you willing to get rid of Monday blues? The Bang Bros show a glimpse of their entertaining world, as the teaser of the movie which is a new mantra for entertainment is out now.

The teaser begins on a humorous note with three scientists skipping an ad and waiting to watch a video on YouTube ignoring a patient in critical condition. They shift their base from the city to a rural village where they start A to Z Solutions. However, they have another agenda of discovering a treasure in the village. In the process, they notice that black magic is being done in the village.

The director showed his mark in every aspect. Firstly, presenting the lead trio as scientists who are on a mission to find a treasure, coupled with horror elements is a good thought. The A To Z Solutions and the conversations with villagers offer unlimited fun. Quoting reviewers' views to criticize himself and calling it the most illogical and ridiculous movie of the year shows his brilliance. The last episode of the trio discussing mindlessly in the bed is the most entertaining part. Get ready for a laughing riot in theatres, as the teaser is exceedingly amusing.

Sree Vishnu is at his usual best with his superb comic timing and he must be appreciated for giving equal space to Priyadarshi and Rahul Ramakrishna. It’s good to see The Bang Bros together on screen in hilarious roles.

Preethi Mukundhan and Ayesha Khan are the heroines in the movie where Srikanth Iyengar, Aditya Menon, and Racha Ravi will be seen in important roles.

Cinematographer Raj Thota and music director Sunny MR worked in tandem to create a perfect mood. Srikanth Ramisetty is the art director, while Vijay Vardhan is the editor.

The real fun begins in less than a month, as Om Bheem Bush will be hitting the screens on March 22nd.

Cast: Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Preethi Mukundhan, Ayesha Khan, Srikanth Iyengar, Aditya Menon, Racha Ravi and others.

Technical Crew:
Writer, Director: Sree Harsha Konuganti
Presents: V Celluloid
Producers: V Celluloid, Sunil Balusu
DOP: Raj Thota
Music Director: Sunny MR
Art Director: Srikanth Ramisetty
Editor: Vijay Vardhan

'ఓం భీమ్ బుష్' లాంటి సినిమా ఇప్పటివరకూ ఎవరూ తీయలేదు. మా ముగ్గురు పాత్రలకు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతారు. రెండుగంటల పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ 'ఓం భీమ్ బుష్' టీజర్ గ్రాండ్ గా లాంచ్

బ్యాంగ్ బ్రదర్స్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన 'ఓం భీమ్ బుష్' అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ప్రీ-లుక్ గ్లింప్స్ , ఫస్ట్-లుక్ పోస్టర్‌తో నవ్వులు పూయించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పుడు బ్యాంగ్ బ్రదర్స్ ఎంటర్ టైమెంట్ వరల్డ్ ని ప్రజెంట్ చేస్తూ టీజర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఆస్ట్రోనాట్స్ స్పేస్ సూట్ లో పాల్గోవడం అందరినీ విశేషంగా అలరించింది.

ముగ్గురు శాస్త్రవేత్తలు ఒక యాడ్ స్కిప్ చేసి, క్లిష్టమైన స్థితిలో ఉన్న రోగిని పట్టించుకోకుండా యూట్యూబ్‌లో వీడియో చూడటానికి వేచి ఉండటంతో టీజర్ హిలేరియస్ గా ప్రారంభమవుతుంది. వారు తమ స్థావరాన్ని నగరం నుండి ఓ గ్రామానికి మార్చారు, అక్కడ వారు A నుండి Z సొల్యూషన్‌లను ప్రారంభిస్తారు. అయితే, వారికి గ్రామంలోని నిధిని కనుగొనే మరో ఎజెండా ఉంది. ఈ క్రమంలో గ్రామంలో బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్నట్లు గమనిస్తారు.

దర్శకుడు ప్రతి విషయంలోనూ తనదైన మార్క్ చూపించాడు. ముందుగా, హారర్ అంశాలతో పాటు నిధిని కనుగొనే లక్ష్యంలో ఉన్న శాస్త్రవేత్తలుగా ప్రధాన ముగ్గురిని ప్రజంట్ చేయడం మంచి ఆలోచన. A To Z సొల్యూషన్స్, గ్రామస్థులతో సంభాషణలు అద్భుతమైన వినోదాన్ని అందించాయి. ముగ్గురూ బెడ్‌ పై మైండ్ లెస్ గా చర్చించుకునే చివరి ఎపిసోడ్ హిలేరియస్ గా వుంది. గొప్ప వినోదాన్ని అందించిన టీజర్ థియేటర్లలో నవ్వుల హంగామా కోసం ప్రేక్షకులని సిద్ధం చేసింది.

శ్రీవిష్ణు తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు ఈక్వేల్ స్పేస్ ఇచ్చినందుకు అతన్ని తప్పక అభినందించాలి. ది బ్యాంగ్ బ్రదర్స్ కలిసి తెరపై హిలేరియస్ పాత్రల్లో కనిపించడం విశేషం. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చరవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, సంగీత దర్శకుడు సన్నీ ఎంఆర్ కలిసి పర్ఫెక్ట్ మూడ్ క్రియేట్ చేశారు. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ కాగా, విజయ్ వర్ధన్ ఎడిటర్. ఓం భీమ్ బుష్ మార్చి 22న తెరపైకి రానుండడంతో నిజమైన వినోదం ఒక నెలలోపే ప్రారంభమవుతుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ...ఈ సినిమాని పూర్తిగా ఇంగ్లీష్ లో తీసి హాలీవుడ్ లో విడుదల చేయాలని అనుకున్నాం. ఇది పాన్ వరల్డ్ సినిమాలా ఎక్కడ రిలీజ్ చేసి ఆడుతుంది. ఇలాంటి పాయింట్ తో సినిమా ఇప్పటివరకూ ఎవరూ తీయలేదు. మా ముగ్గురు పాత్రలకు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతారు. రెండుగంటల పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. అందులో డౌట్ లేదు. ఈ సినిమా గుప్తా నిధులు గురించి. దాని కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారనేది చాలా ఆసక్తిగా వుంటుంది. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. సునీల్ గారికి యువీ క్రియేషన్స్ ధన్యవాదాలు. దర్శకుడు హర్ష గురించి చాలా చెప్పాలి. తనతో వర్క్ ని చాలా ఎంజాయ్ చేశాం. ఈ డ్రెస్ తో షూటింగ్ చేయడం కష్టం అనిపించినప్పటికీ ఎంజాయ్ చేశాం. చాలా కొత్త లోకేషన్స్ లో ఈ సినిమా చేశాం. శ్రీకాంత్ గొప్పగా ఆర్ట్ డైరెక్షన్ చేశారు. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మార్చ్ 22న థియేటర్స్ లో కలుద్దాం'' అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ.. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. ట్రైలర్, సినిమా ఇంకా అద్భుతంగా వుంటాయి. మార్చ్ 22న సినిమా వస్తుంది. తప్పకుండా అందరూ చూడాలి' అని కోరారు.

రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. దర్శకుడు ఏడాదిన్నర పాటు మమ్మల్ని టార్చర్ పెట్టాడు( నవ్వుతూ) స్పేస్ షూట్ లో షూటింగ్ చేయడం మామూలు విషయం కాదు. మేము ఏడాదిన్నర కష్టపడి ఫలితం దక్కాలంటే మీరు మార్చి 22న సినిమా తప్పకుండా చూడాలి. సినిమా చాలా హిలేరియస్ గా వుంటుంది' అన్నారు.

దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ.. టీజర్ ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ట్రైలర్ కూడా బావుటుంది. మార్చి 22న తప్పకుండా అందరూ సినిమా చూడాలి'' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాలగొన్న టీజర్ లాంచ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

తారాగణం: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
ప్రెజెంట్స్: వి సెల్యులాయిడ్
నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు
డీవోపీ: రాజ్ తోట
సంగీతం: సన్నీ MR
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్: విజయ్ వర్ధన్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved