pizza

Om Harudu - Prabhanjanam song out
హీరో వెంకట్, రాజ్ తాళ్లూరి, విఆర్ ఎంటర్టైన్మెంట్ 'ఓం హరుడు' నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రభంజనం రిలీజ్

You are at idlebrain.com > news today >

08 October 2025
Hyderabad

They call him og,శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘ఓం హరుడు’.రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ప్రభంజనం సాంగ్ రిలీజ్ చేశారు. విశ్వ వేమూరి స్వయంగా స్వరపరిచి రాసి పాడిన ఈ సాంగ్ పవర్ ఫుల్ గా వుంది. ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో హెబ్బపటేల్, సలోని,శ్రీహరి పైల, నాటషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మని జీన్న మరియు విశ్వ వేమూరి సంగీతం అందిస్తుండగా ఆనంద్ మారుకుర్తి డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతీ ఎడిటర్.

తారాగణం: వెంకట్,హెబ్బపటేల్ , సలోని , నాటషా ,శ్రీహరి పైల,అలీ,సుమన్,రవి వర్మ ,సుభాశ్రీ , వేద్విక,చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమేట గాంధీ. దిల్ రమేష్, దొరబాబు

సాంకేతిక సిబ్బంది:

కథ , మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం: రాజ్ తాళ్లూరి
బ్యానర్లు: విఆర్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: విఆర్ ఎంటర్టైన్మెంట్
మ్యూజిక్: మనీ జిన్నా,విశ్వ వేమూరి
డిఓపి: ఆనంద్ మారుకుర్తి
ఎడిటర్: ఉప్పు మారుతీ
ప్రొడక్షన్ డిజైనర్: ప్రశాంత్
యాక్షన్ కొరియోగ్రఫీ: శివ రాజ్
లిరిసిస్ట్: భాను ప్రకాష్,విశ్వ వేమూరి, రంజిత్ కుమార్ రిక్కీ, విరుంచి పుట్ల
Vfx సూపర్‌వైజర్: నాగరాజు
మోషన్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్: నాగరాజు
స్టిల్స్: పంతులు
మేకప్ చీఫ్: నాయుడు





Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved