pizza

Natural Star Nani’s Aaya Sher From The Paradise Tops Music Charts Worldwide In 9 Countries
ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల టాప్ మ్యూజిక్ చార్టులలో అదరగొడుతున్న నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' ఆయా షేర్ సాంగ్

You are at idlebrain.com > news today >

26 February 2026
Hyderabad

Natural Star Nani’s highly anticipated project The Paradise has found its defining moment early on with the release of its first single, Aaya Sher. Directed by Srikanth Odela and produced by Sudhakar Cherukuri under SLV Cinemas, the film has music scored by Rockstar Anirudh Ravichander. Within no time, the song Aaya Sher grown into a worldwide phenomenon.

Aaya Sher has stormed the YouTube Global Charts, trending in 9 countries. It clinched the top position in India and the UAE, while secured impressive ranks across markets like the UK, Australia, Singapore, Canada, Saudi Arabia, the USA, and New Zealand. For a Telugu track, this kind of global spread is nothing short of exceptional.

Beyond charts and numbers, the song’s real power lies in its raw impact. Nani’s intense screen presence, paired with his now-iconic hook step, has struck a chord with audiences worldwide. The grounded, no-frills floor move has exploded on Instagram Reels and YouTube Shorts, with fans and creators across continents jumping on the trend.

The Paradise has clearly set the tone for what lies ahead. With Aaya Sher already echoing across borders, the film’s promotional journey has begun with a roar- one that’s being heard far beyond Indian cinema circles.

ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల టాప్ మ్యూజిక్ చార్టులలో అదరగొడుతున్న నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' ఆయా షేర్ సాంగ్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ది పారడైస్ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విడుదలైన కొద్దిసేపటికే ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంది.

ఈ పాట యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో 9 దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. భారత్, యూఏఈలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, సౌదీ అరేబియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించింది. ఒక తెలుగు పాటకు ఈ స్థాయి అంతర్జాతీయ ఆదరణ రావడం విశేషం.

ఈ సాంగ్ లో రా ఎనర్జీ, నాని స్క్రీన్ ప్రెజెన్స్‌ అదిరిపోయింది. ఆయన చేసిన ఐకానిక్ హుక్ స్టెప్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఫ్లోర్ మూవ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లలో ట్రెండ్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తోంది.

ఆయా షేర్ విజయంతో ది పారడైస్ సినిమా ప్రమోషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సాంగ్ ఇప్పటికే దేశాల్ని దాటి అలరించడంతో ది ప్యారడైజ్ పై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved