pizza

Paradise team visits Sammkka Sarakka temple in Medaram
మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న నేచురల్ స్టార్ నాని, ‘ది ప్యారడైజ్’ టీం

You are at idlebrain.com > news today >

29 September 2026
Hyderabad

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకొని చిత్ర బృందం తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు.

నాని, చిత్ర బృందానికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అమ్మవార్ల సన్నిధికి చేరుకున్న నాని వనదేవతలకు తమ బరువుకు తూగేలా నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. పూజారులు చిత్ర బృందానికి అమ్మవారి ప్రసాదం అందజేశారు.

నానిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీటికి సంబంధించిన విజువల్స్, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అద్భుతమైన కలెక్షన్లతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved