pizza

Sudhan Master about Paradise
ప్యారడైజ్ 'ఆయా షేర్' సాంగ్ కి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తోంది. ప్యారడైజ్ లో నాని గారి పెర్ఫార్మెన్స్, శ్రీకాంత్ గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది: కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్

You are at idlebrain.com > news today >

3 March 2026
Hyderabad

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా టాప్ లో ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. 'ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయా షేర్ సాంగ్ కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఆయా షేర్ పాట వరల్డ్ వైడ్ వైరల్ అవుతోంది.. అసలు ఈ పాట జర్నీ ఎలా మొదలైంది?
-ఈ సినిమా అవకాశం రావడానికి మొదటి కారణం దర్శకుడు శ్రీకాంత్ గారు. నేను దసరా సినిమాకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేశాను ఆ సినిమా అంతా ట్రావెల్ అయ్యాను. అప్పుడే శ్రీకాంత్ గారు 'నువ్వు ఎప్పుడు కొరియోగ్రాఫర్ అవుతావు' అని అడిగారు. 'కొరియోగ్రాఫర్ అయితే కచ్చితంగా నేను సాంగ్ ఇస్తాను' అన్నారు. నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి అని నిర్ణయించుకున్న తర్వాత మొదటి కలిసిన వ్యక్తి శ్రీకాంత్ గారే. ఇంతలో తమిళ్ నుంచి జననాయకన్ సినిమా అవకాశం కూడా వచ్చింది.

-పారడైజ్ సినిమా మొదలైన తర్వాత డైరెక్షన్ ఫాలో అవుతానని చెప్పి శ్రీకాంత్ గారికి రిక్వెస్ట్ చేశాను. నాకు డైరెక్షన్ అంటే ఆసక్తి వుంది. నా ఖాళీ సమయం అంతా ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సాంగ్ కి ముందు ఒక మాంటేజ్ సాంగ్ కూడా చేశాను.

-ఆయా షేర్ ఇదివరకు ఎన్నడూ కూడా చూడని విధంగా ఉండాలని శ్రీకాంత్ గారు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే నాని గారు ఇప్పటివరకు చేయని ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు ఒక గొప్ప విజన్ తో ఈ సినిమా తీస్తున్నారు. ఇంట్రో సాంగ్ చాలా ఇంపార్టెంట్. నాని గారు మంచి స్టైలిష్ డాన్సర్. కాకపోతే ఇప్పటివరకు చేసిన అన్నిట్లో కంటే ఒక పీక్ లోకి వెళ్లి ఈ సాంగ్ ఉండాలని శ్రీకాంత్ గారు నాకు క్లియర్ గా చెప్పారు.

-ఇది నా తొలి అవకాశం. కచ్చితంగా నేను నిరూపించుకోవాలి. నాని గారిని మరో స్థాయిలో చూపించాలనే ఆలోచనతోనే కొరియోగ్రఫీ మొదలుపెట్టాను. అనిరుద్ గారు, సింగర్స్, లిరిక్ రైటర్ అందరూ కలిసి అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. ఆ పాట చూసిన తర్వాత అంచనాలు ఇంకా పెరిగాయి. ఈ సాంగ్ కి న్యాయం చేయాలని తపనతో నిరంతరం పని చేశా. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరు సలహాలు తీసుకుని ఒక ఎడిట్ వర్షన్ డైరెక్టర్ గారికి చూపించాను. ఆయనకి చాలా నచ్చింది. హుక్ స్టెప్ అద్భుతంగా కుదిరింది. అలాగే ఇందులో మూమెంట్స్ అన్నీ నాని గారి క్యారెక్టర్ లోనే ఉన్నాయి.

డైరెక్టర్ గారు ఈ కథ గురించి మీకు ఏం చెప్పారు?
- నాకు కథ మొత్తం చెప్పలేదు. ఒక రూటేడ్ ఏరియాలో జరుగుతున్న స్టోరీ. ఆ ఏరియాలో ఉన్న ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ని ఎలా చూపించాలనే దాని మీదే డిస్కషన్ జరిగింది. ఈ సాంగ్ మొత్తం లో ఒక ఆటిట్యూడ్ క్యారీ చేయాలని, సిచువేషన్ క్లారిటీగా చెప్పిన తర్వాతనే కొరియోగ్రఫీ మొదలు పెట్టాను.

-పారడైజ్ చాలా కొత్త వరల్డ్. చాలా రూటెడ్ గా వుంటుంది. అది మీరు స్క్రీన్ లో చూసి ఎంజాయ్ చేయాలి.

ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటి?
-ఒక కొత్త కొరియోగ్రాఫర్ గా తొలి పాట ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్టులో చేయడం అనేది కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. డైరెక్టర్ గారు పూర్తిగా నమ్మి అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత నాపై ఉంటుంది. తెలుగులో వచ్చిన మొదటి పెద్ద అవకాశం. దీనికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పని చేశాను. నా టీం కూడా చాలా సపోర్ట్ చేసింది. సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది.

నాని గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
-నాని గారితో జర్నీ దసరా సినిమా నుంచి మొదలైంది. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాను. అప్పుడు నా వర్క్ డైరెక్టర్ గారికి హీరో గారికి నచ్చింది. నాని గారు ప్రతి సినిమా కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో ఆయన అంటే నాకు చాలా గౌరవం. నేను కొరియోగ్రఫర్ అయితే ఆయనతో సాంగ్ చేయాలని ఉండేది ఆ కోరిక నాకు తొలి సినిమాతో తీరడం చాలా ఆనందంగా వుంది.

-ఇందులో హుక్ స్టెప్ కోసం మూడు రోజులు రిహర్సల్స్ చేశాం. నాని గారు దాదాపు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో ఆయనకి భుజానికి చిన్న గాయం కూడా ఉంది. ఒక్క నిమిషం కూడా నాకు ఇది కష్టంగా ఉందని చెప్పలేదు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ కష్టం మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ చూశారా?
-చూశారు. ఫోన్ చేసి మాట్లాడారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇండస్ట్రీలో శిష్యుడుగా నీ పేరు చెప్తా అన్నారు. ఒక శిష్యుడుగా అంతకు మించిన ఆనందం నాకు మరొక ఉండదు.

పారడైజ్ ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది?
-ప్రేక్షకులు ఒక కొత్త నాని గారిని చూడబోతున్నారు. శ్రీకాంత్ గారి మ్యాడ్ నెస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. ఇందులో ఉండే ఎమోషన్స్ కి ఆడియన్స్ చాలా బాగా కరెక్ట్ అవుతారు.

జడ స్టెప్ గురించి?
డైరెక్టర్ గారు నాని గారి క్యారెక్టర్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. ఆ క్యారెక్టర్ కి జడ ఉంది. ఆ జడ పట్టుకుని ఒక మూమెంట్ చేయాలనే ఆలోచనతో చేసిన స్టెప్ అది. చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

కొత్త సినిమాలు గురించి?
-ఈ సాంగ్ చూసి చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ చూసిన తర్వాత మా నిర్మాత గారిని కొరియోగ్రఫీ గురించి అడిగారు. అలాగే నాకు చెన్నై నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved