pizza

Bandi Saroj Kumar's new movie 'Parakramam' lands a super-interesting Pre-Teaser
బండి సరోజ్ కుమార్ నూతన చిత్రం 'పరాక్రమం' ప్రీ టీజర్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

21 August 2023
Hyderabad

Bandi Saroj Kumar, who is known for the digital release 'Mangalyam', is going to direct a new movie titled 'Parakramam' on his banner, BSK Mainstream. The film is currently in pre-production, completing casting and location hunt work. Saroj, who is not only directing the movie but is also its music director, writer and editor, is planning to complete the film in 30 days spread over two schedules over a period of two months. The shoot will begin in September and will be wrapped up by the end of October.

Today, landing a superb pre-teaser video, Saroj also announced the film's release date. 'Parakramam' will be released in theatres on February 14, 2024.

Releasing the pre-teaser in Telugu and Tamil, director Bandi Saroj Kumar said that his previous two movies, 'Nirbandham' and 'Mangalyam', were released on digital platforms and received the love of lakhs of audience members. Those who wanted to pay for his movies did so using digital means on a voluntary basis. "With the strength given by those who loved my previous movies, I am now making a film for the big screen on my banner BSK MAINSTREAM. 'Parakramam' will be made for the family audience, including children. 'I, Me, Myself' is its tagline," Saroj said.

The plot involves the various stages in the life of the male protagonist, named Lovaraju. Gully cricket, love, theater life and politics in a village named Lampakalova in the Godavari district will keep the audience hooked. "I am going to come up with a solid commercial story that will entertain the youth in every way and motivate them. Along with me, I am going to introduce a set of promising artists, both male and female, through the movie," Saroj says, urging the media to support his sincere endeavour.

Crew:

Cast: Bandi Saroj Kumar, Anamika, Kireeti, Mohan Senapaty, and others.
Banner: BSK Mainstream
Story, Editor, Music, Producer, Director: Bandi Saroj Kumar
VFX: AYK ERA Studios
Sound Design and Mixing: Kali SR Ashok
Art: Kireeti Musi
Publicity Design : Sagar Mudiraaz and Uday Jala
Lyricist: Shashank Vennelakanti

బండి సరోజ్ కుమార్ నూతన చిత్రం 'పరాక్రమం' ప్రీ టీజర్ విడుదల

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకం పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున చిత్రం "పరాక్రమం". ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ లో ముప్పై రోజులో షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి 14, 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క ప్రీ టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా

దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ  "మీడియా మిత్రులకు, పెద్దలకు నమస్కారాలు. బండి సరోజ్ కుమార్ అనే నేను ఒక నటుడిగా , దర్శకుడిగా మీలో కొంత మందికి తెలిసే ఉండొచ్చు. "కళ నాది. వెల మీద" అనే కాన్సెప్ట్ తో, డిజిటల్ platforms లో రిలీజ్ చేసిన "నిర్బంధం, మాంగల్యం" లాంటి క ల్ట్ సినిమాలో నాకు లక్షలాది ప్రేక్షకుల అభిమానం లభించింది. వాళ్ళు ఇచ్చిన బలంతో ఇప్పుడు నేను "BSK MAINSTREAM" అనే నా సొంత నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు రాబోతున్నాను. పిల్లా , పాపలతో కుటుంబాలు సినిమా హాల్ కు తరలి వచ్చే కథాంశం తో "పరాక్రమం" అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. " I,ME,MYSELF " దీని టాగ్ లైన్ .

"పరాక్రమం" అనే ఈ చిత్రం యొక్క "Pre-Teaser" ను ఈ లేఖతో జత చేశాను . ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14 2024 న  విడుదల లక్ష్యంగా, ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ తో ముప్పై రోజుల
షూటింగ్ తో ఈ చిత్రం  పూర్తవుతుంది.

ఈ చిత్ర కథాంశం  గురించి చెప్పాలంటే - గోదావరి జిల్లా లో "లంపకలోవ" గ్రామంలో పుట్టిన "లోవరాజు" అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్, ప్రేమ, నాటక రంగ జీవితం , రాజకీయం లాంటి ఘట్టాల ఆవిష్కరణ ఈ చిత్ర ముఖ్య కథాంశం. యువతను అన్ని విధాలుగా ఎంటర్టైన్  చేస్తూనే, వారిని మేల్కొలిపే ఒక మంచి కమర్షియల్ కథతో రాబోతున్నాను. నాతోపాటు ప్రతిభ ఉన్న నూతన నటీ, నటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయబోతున్నాను.

దీనికి రచన, కూర్పు, సంగీతం, దర్శకత్వం నేనే వహిస్తుండగా మిగిలిన విభాగాల్లో ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం నిర్మించబడుతుంది. ఒక గొప్ప సంకల్పంతో నేను నిర్మించబోయే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లి నాకు, నా నిర్మాణ సంస్థ కి మరింత బలాన్ని చేకూర్చాలి అన్నది పాత్రికేయులకు నా విజ్ఞప్తి.

ఇట్లు
నటుడు - దర్శకుడు
బండి సరోజ్ కుమార్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved