pizza

Parijatha Parvam song Ningi Nunchi Jaare released
చైతన్య రావు, మాళవిక సతీశన్, సంతోష్ కంభంపాటి, వనమాలి క్రియేషన్స్ 'పారిజాత పర్వం' నుంచి 'నింగి నుంచి జారే' పాట విడుదల

You are at idlebrain.com > news today >

19 February 2024
Hyderabad

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, కాన్సప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ 'నింగి నుంచి జారే' పాటని విడుదల చేసి ‘పారిజాత పర్వం’ మ్యూజిక్ జర్నీని ప్రారంభించారు. కంపోజర్ రీ ఈ పాటని క్యాచి మెలోడీగా అద్భుతంగా స్వరపరిచారు. కిట్టు విస్సాప్రగడ ఆకట్టుకునే సాహిత్యం అందించిన ఈ పాటని హరి చరణ్, లిప్సిక చాలా ప్లజెంట్ గా ఆలపించారు. ఈ పాటలో చైతన్య రావు, మాళవిక సతీశన్ కెమిస్ట్రీ మెస్మరైజింగా వుంది.

బాల సరస్వతి కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. సశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహా నిర్మాత.

తారాగణం: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం - సంతోష్ కంభంపాటి
ప్రొడక్షన్: వనమాలి క్రియేషన్స్
నిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్
సహ నిర్మాత -అనంత సాయి
డీవోపీ-బాల సరస్వతి
సంగీతం-రీ
ఎడిటర్- సశాంక్ వుప్పుటూరి
ఆర్ట్ డైరెక్టర్ - ఉపేందర్ రెడ్డి
డిజైనర్ - చిన్మయి కాకిలేటి
పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచెర్ల
సౌండ్ ఎఫెక్ట్స్- పురుషోత్తం రాజు
సాహిత్యం-రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్, రాంబాబు గోసాల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved