pizza

Intense & Gripping Trailer Of Virat Karrna, Srikanth Addala, Miryala Ravinder Reddy, Dwaraka Creations Peddha Kapu-1 Unveiled By VV Vinayak, BVSN Prasad
విరాట్ కర్ణ, శ్రీకాంత్ అడ్డాల, మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ పెదకాపు-1 ఇంటెన్స్ & గ్రిప్పింగ్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన వివి వినాయక్, బివిఎస్ఎన్ ప్రసాద్

You are at idlebrain.com > news today >
Follow Us

11 September 2023
Hyderabad

Sensible director Srikanth Addala made a brave and bold decision to cast a newcomer Virat Karrna to play the lead role in his latest flick Peddha Kapu-1. This is not a typical youthful entertainer. It’s challenging for the youngster too because Peddha Kapu-1 is a new-age political thriller. After the massive blockbuster Akhanda, Miryala Ravinder Reddy of Dwaraka Creations is producing it. Today, the theatrical trailer of the movie has been unveiled. Star director VV Vinayak and producer BVSN Prasad launched the trailer, while Mythri Movie Makers Ravi Shankar and Mythri distributor Shashidhar Reddy graced the event as guests.

Revolutions are born because of the social injustice in the society. Peddha Kapu-1 portrays caste oppression within a village where there is the domination of two powerful people belonging to the upper class. There’s a lot happening in the trailer that discloses the storyline of the movie. When there is a crisis, it results in revolution and a commoner raises his voice against the oppressors and he even begins a violent war against them.

The trailer shows Virat Karrna in all his magnificence. The young hero looked fierce and it is clear that he has delivered a solid performance in the film. Srikanth Addala has done a brilliant job and the dialogues are thought-provoking. There is the same intensity in almost every sequence in the trailer. The nearly 2.5-minute-long video is gritty and filled with violence. The action sequences supervised by India's leading action director Peter Hein were crafted with a strong realistic setting.

Curiously, Srikanth Addala played one of the main antagonists and he spellbinds with his intense performance. Pragathi Srivastava played the leading lady opposite Virat.

Chota K Naidu handled the cinematography and a dark theme was chosen to make the narrative authentic and strong. Mickey J Meyer added more force to the visuals with his superb background score. The production design of Dwaraka Creations is top-class for a movie with a newcomer. The trailer sure has set the ball rolling for the film.

Miryala Sathyanarayana Reddy presents the movie, while Marthand K Venkatesh is the editor. Raju Sundaram is the choreographer.

Peddha Kapu-1 is slated for release on September 29th.

Cast: Virat Karrna, Pragathi Srivastava, Rao Ramesh, Naga Babu, Tanikella Bharani, Brigada Saga, Rajeev Kanakala, Anusuya, Eeshwari Rao, Naren, and others.

Technical Crew:
Writer, Director: Srikanth Addala
Producer: Miryala Ravinder Reddy
Banner: Dwaraka Creations
Presents: Miryala Sathyanarayana Reddy
Music - Mickey J Meyer
DOP - Chota K Naidu
Editor - Marthand K Venkatesh
Fights: Peter Hein
Choreographer - Raju Sundaram
Art - GM Sekhar

విరాట్ కర్ణ, శ్రీకాంత్ అడ్డాల, మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ పెదకాపు-1 ఇంటెన్స్ & గ్రిప్పింగ్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన వివి వినాయక్, బివిఎస్ఎన్ ప్రసాద్

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన తాజా చిత్రం ‘పెదకాపు-1’ ప్రధాన పాత్రలో యంగ్ స్టర్ విరాట్ కర్ణను నటింపజేయాలని ధైర్యమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది సాధారణ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కాదు. పెదకాపు-1 న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి.. ఇది యంగ్ స్టర్ కి కూడా సవాల్. ‘అఖండ’ బ్లాక్ బస్టర్ తర్వాత ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ట్రైలర్ లాంచ్ చేయగా, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.

సమాజంలో సామాజిక న్యాయం లేకపోవడం వలన విప్లవాలు పుట్టుకొస్తాయి. పెదకాపు-1 ఉన్నత వర్గానికి చెందిన ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల ఆధిపత్యం ఉన్న గ్రామంలో కుల అణచివేతను ప్రజంట్ చేస్తోంది. ట్రైలర్‌లో సినిమా కథాంశాన్ని వెల్లడించే అంశాలు చాలా ఉన్నాయి. సంక్షోభం ఏర్పడినప్పుడు అది విప్లవానికి దారి తీస్తుంది, అణచివేతదారులకు వ్యతిరేకంగా ఒక సామాన్యుడు తన స్వరాన్ని వినిపించి, వారిపై హింసాత్మక యుద్ధాన్ని కూడా మొదలుపెడతాడు. ట్రైలర్‌లో విరాట్ కర్ణ అద్భుతంగా కనిపించారు. ఫెరోషియస్ గా కనిపించిన విరాట్ సినిమాలో ఎక్స్ టార్డినరీ పెర్ ఫార్మెన్స్ కనబరిచాడని స్పష్టంగా తెలుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల బ్రిలియంట్ వర్క్ చేశారు. ట్రైలర్ లో డైలాగ్స్ ఆలోచింపజేసేలా వున్నాయి. ట్రైలర్‌లో దాదాపు ప్రతి సీక్వెన్స్‌లోనూ అదే ఇంటెన్సిటీ ఉంది. దాదాపు 2.5 నిమిషాల నిడివి గల వీడియో వైలెన్స్ తో నిండి ఉంది. ఇండియన్ లీడింగ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్ గా వున్నాయి. శ్రీకాంత్ అడ్డాల ప్రధాన విలన్స్ లో ఒకరిగా నటించడం ఆసక్తికరంగా వుంది. తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. విరాట్ సరసన ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటించింది.

ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందించారు. కథనాన్ని నేచురల్ గా, స్ట్రాంగ్ గా చేయడానికి డార్క్ థీమ్‌ను ఎంచుకున్నారు. మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌కు మరింత బలం చేకూర్చారు. ద్వారకా క్రియేషన్స్ ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వివి వినాయక్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ నా మనసుకి చాలా దగ్గరరైన వాడు. తన రైటింగ్ సెన్సిబిలిటీస్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో రావు రమేష్ గారి పాత్ర గురించి ఛోటా చెప్పినప్పుడు అసలు ఇలాంటి పాత్రలని ఎలా రాయగలుగుతున్నాడనిపించింది. ట్రైలర్ చాలా బావుంది. సినిమా అద్భుతంగా వుంటుంది. రవీందర్ రెడ్డి గారు సినిమాపై ఇష్టం వున్న నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఇలాంటి బావ ఒకరు ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే బామ్మర్దిని హీరో చేశారు( నవ్వుతూ). ఒక కొత్త హీరో సినిమాకి ఇన్ని కోట్లు ఖర్చు చేయడం మామూలు విషయం కాదు. నా దర్శకత్వంలో అల్లుడు శీను సినిమాకి బెల్లం కొండ సురేష్ గారు అలా ఖర్చు చేశారు. దీని తర్వాత అంత తెగింపుతో ఎలాంటి లెక్కలు లేకుండా తీసిన సినిమా పెదకాపు1. ఇది కూడా అఖండ అంత హిట్ కావాలని, విరాట్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మణిరత్నం గారి దొంగదొంగ సినిమాలో పీసి శ్రీరామ్ గారి ఫోటోగ్రఫీ నా మనసులో ముద్రించుకుపోయింది. పెదకాపు ట్రైలర్ చూస్తునపుడు అది మళ్ళీ రిపీట్ అయినట్లు అనిపించింది. చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఛోట అన్న.. రియల్లీ గ్రేట్ వర్క్. అలాగే మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి శ్రీకాంత్, యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి. రవీందర్ రెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

రవి శంకర్ మాట్లాడుతూ... పెదకాపు 1 అందరూ నచ్చి మెచ్చి చాలా కష్టపడి చేసిన సినిమా లా అనిపిస్తోంది. ట్రైలర్ ఎక్స్ట్రార్డినరీ గా వుంది. చోటా గారికి రోజురోజుకి ఎనర్జీ పెరిగిపోతుంది. బింబిసారతో పెద్ద విజయం ఇచ్చారు. ఈ సినిమా ఇంకా పేరు వస్తుంది. ఆయనకి తిరుగులేదు. శ్రీకాంత్ గారి సినిమాలు చాలా ఇష్టం. ఇది ఆయనకి కొత్త జోనర్. ట్రైలర్ చాలా బావుంది. విరాట్ కర్ణ స్క్రీన్ ప్రజన్స్ చాలా బావుంది. ఇంటెన్స్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. రవీందర్ రెడ్డి గారు చాలా మంచి మనసున్న వ్యక్తి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునన్నాను’’

బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ కొత్త ఏమో కానీ అందరూ పేరున్న పెద్ద టెక్నిషియన్స్ వున్నారు. ఒక పెద్ద సినిమాకి ఉండాల్సిన అన్ని హంగులు వున్నాయి.ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’అని కోరుకున్నారు.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఓ మంచి ఉద్దేశంతో సామాన్యుడి సంతకం అని పెట్టాను. ఒక సామాన్యుడ్ని తెరమీద కొన్ని కోట్లమంది చూసుకొని, ఆ సామన్యుల తరపున నిలబడే ఒక పాత్రని మలిచినదే ఈ పెదకాపు1. ఈ సినిమా అంతా సమిష్టి కృషి. అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఛోటా కె నాయుడు గారు కథని అద్భుతంగా చూపించారు. ‘’మీరు కొత్త వాళ్ళతో సినిమా బాగా చేస్తారు. మా బామ్మర్ది వున్నాడు. ఏదైనా మంచి కథ వుంటే చేయండి’’ అని నిర్మాత రవీందర్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే నాకు కొంచెం రిస్క్ అనిపించింది. కానీ కథ మీద పట్టు, ధైర్యం వుంది. విరాట్ కర్ణ కొత్తకుర్రాడని మనం అనుకుంటాం కానీ సినిమా మాత్రం చాలా పెద్దది. అందులో ఒక ముఖ్యమైన పాత్రగానే విరాట్ కర్ణ ని ట్రీట్ చేశాను. విరాట్ చాలా కష్టపడ్డాడు, రిస్కీ షాట్స్ చేశాడు. పాపం ..యాక్షన్ సీక్వెన్స్ లో చాలా దెబ్బలు కూడా తిన్నాడు ( నవ్వుతూ) చాలా అద్భుతంగా నటించాడు. అనసూయ, ఈశ్వరి, రావు రమేష్. రాజీవ్ కనకాల గారు.. ఇలా నటీనటులందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే కొత్త బంగారు లోకం నుంచి నాతో పాటు వున్న నా అసోషియేట్ కిషోర్ చాలా ఎఫర్ట్ పెట్టాడు. టీం అందరికీ కూడా ఈ సినిమా ఒక మరపురాని చిత్రంగా నిలిచి పెదకాపు 2 కి ప్రస్థానం కావాలని, అందరూ ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు

విరాట్ కర్ణ మాట్లాడుతూ.. ఇంతమంచి కథ ఇచ్చిన మా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారికి, ఈ సినిమా నిర్మించిన మా బావగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఛోటా గారు నన్ను చాలా బాగా చూపించారు. హీరోయిన్ గా చేసిన ప్రగతి చక్కగా నటించారు. ఇందులో పని చేసిన అందరికీ థాంక్స్’’ చెప్పారు.

మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన వినాయక్ గారికి, రవిగారికి ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు. నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడతానని మా ఇంట్లో చెబుతుంటారు. ఈ సినిమా విషయంలో ఒకటి నిర్ణయించుకున్నాను. సినిమా మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతాను’’ అన్నారు

ఛోటా కె నాయుడు మాట్లాడుతూ.. కొత్త బంగారు లోకం చేసిన శ్రీకాంత్ ఈ కథ చెప్పినపుడు షాక్ అయ్యాను. నారప్ప చేసిన ప్రభావం అనుకున్నాను. కానీ ఇంత ఎక్స్ టార్డినరిగా డీల్ చేస్తాడని నేను అనుకోలేదు. రవీందర్ రెడ్డి గారు ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని తీశారు. తెలుగు సినిమాల్లో ఇదొక కొత్త సినిమా అవుతుంది’’ అన్నారు.

ప్రగతి మాట్లాడుతూ.. ఈ సినిమా నా మనసుకి చాలా దగ్గరైయింది. ఇంతమంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. విరాట్ చాలా సపోర్టివ్ యాక్టర్. టీజర్ ట్రైలర్ వచ్చిన రెస్పాన్స్ తో చాలా అనందంగా వున్నాను. సెప్టెంబర్ 29 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. రాజు సుందరం కొరియోగ్రాఫర్. పెదకాపు-1 సెప్టెంబర్ 29న విడుదల కానుంది.

నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి
సంగీతం - మిక్కీ జె మేయర్
డీవోపీ - చోటా కె నాయుడు
ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
కొరియోగ్రాఫర్ - రాజు సుందరం
ఆర్ట్- జిఎం శేఖర్

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved