pizza

Buchi Babu Sana about Peddi
'పెద్ది'లో చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ట్రాన్స్‌ఫర్మేషన్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటుంది. 'పెద్ది' అద్భుతంగా వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడండి. పెద్ది మీ గుండెల్లో నిలిచిపోతాడు: దర్శకుడు బుచ్చిబాబు సానా

You are at idlebrain.com > news today >

02 June 2026
Hyderabad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన గ్లింప్స్, చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పెద్ది జర్నీ గురించి చెప్పండి?
-నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు పెద్దితో వస్తున్నాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడికి ఐదేళ్ల సమయం పట్టడం జరగదు. కానీ నా విషయంలో అలా జరిగింది (నవ్వుతూ). మా గురువుగారు సుకుమార్ గారు నన్ను చరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. నేను కథ చెప్పాను. చరణ్ గారికి నచ్చింది. ఉప్పెన తర్వాత చరణ్ గారి దగ్గరకు వెళ్లడానికే నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.

ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే సినిమా కదా. దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-క్రికెట్ మన అందరికీ తెలిసిన ఆటే. కానీ కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌ను తీసుకొచ్చాం. అలాగే తెలంగాణలోని పహల్వాన్లను కూడా టీమ్‌లో భాగం చేశాం. ఆర్టిస్టులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా పహల్వాన్ శిక్షణ తీసుకున్నారు.

మీరు ఎన్టీఆర్ గారితో అనుకున్న కథనే చరణ్ గారితో చేశారనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పస్టత ఇవ్వండి?
-లేదు. ఎన్టీఆర్ గారి కోసం అనుకున్న కథ వేరు. పెద్ది కథ వేరు. ఇది పూర్తిగా చరణ్ గారి కోసం తయారు చేసిన కథ.

చరణ్ గారిని అంత ఈజీగా ఎలా కన్విన్స్ చేశారు?
-అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఆయనకు కథ నచ్చింది కాబట్టే ఒప్పుకున్నారు. కథతోనే ఆయనను కన్విన్స్ చేశాను.

-చరణ్ గారికి ఎప్పటినుంచో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలనే ఆసక్తి ఉంది. ఆయనకు నచ్చేలా పెద్ది కథను సిద్ధం చేశాం.

పెద్ది సక్సెస్ ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం కదా?
-ఏ సినిమా సక్సెస్ అయినా ఇండస్ట్రీకి, డైరెక్టర్లకు, హీరోలకు, సినిమాకు పనిచేసిన అందరికీ అవసరమే. అయితే ఇప్పుడు ఆ అవసరం కాస్త గట్టిగా ఉంది. నా కెరీర్‌ మొత్తం అలానే జరిగింది (నవ్వుతూ). ఉప్పెన సమయంలో కూడా పరిస్థితి అలానే ఉండేది. అప్పట్లో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహం ఉండేది. సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందు మాత్రమే 100% ఆక్యుపెన్సీకి అనుమతి వచ్చింది. జనం థియేటర్స్ కి వచ్చారు. పెద్ద హిట్ ఇచ్చారు.

శివరాజ్ కుమార్ గారు, జగపతిబాబు గారు, దివ్యేందు శర్మ పాత్రల గురించి?
-వీళ్లందరూ ఆ పాత్రలకు పర్ఫెక్ట్‌గా సరిపోతారు. శివన్న గారు ఒక గురువుగా కనిపిస్తారు. ఆటను బ్రతికించేవాడి పాత్ర అది. అలాగే జగపతిబాబు గారి అప్పలసూరి పాత్ర చాలా బరువైనది. హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర అది. దివ్యేందు పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుంది.

జాన్వి కపూర్ పాత్ర గురించి?
-జాన్వి కపూర్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారు. లవ్ ట్రాక్‌లో చాలా బాగుంటారు. జాన్వి చాలా తెలివైన అమ్మాయి. చాలా డెడికేటెడ్ పర్సన్. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. చాలా వినయంగా ఉంటారు.

మీ తొలి సినిమాకు రూ.25 కోట్ల బడ్జెట్, రెండో సినిమాకు రూ.350 కోట్ల బడ్జెట్. ఎలా అనిపిస్తోంది?
-ఇది చరణ్ గారి వల్లే సాధ్యమైంది. హీరోని బట్టి సినిమా తయారయ్యే విధానం మారుతుంది. ఇదే కథను రూ.20 కోట్లలో తీయాలనుకుంటే కథకు కావాల్సినవి జరగకపోవచ్చు.

ఈ సినిమాలో 'అబ్బనీ తీయని దెబ్బ' పాటను రీక్రియేట్ చేశారని విన్నాం?
-లేదు. అది రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. అది వచ్చినప్పుడు ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావించి దాన్ని కూడా మ్యూట్ చేసేశాం.

ఏఆర్ రెహమాన్ గారి గురించి?
నాకు రోజా, బొంబాయి.. రెహమాన్ గారి ఆల్బమ్స్ చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని ఎప్పటినుంచో కల కన్నాను. ఈ సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చింది. ఆయన పాటలను స్వయంగా పాడుతుంటే వింటూ చాలా ఎంజాయ్ చేశాను. లైఫ్ లాంగ్ ఆయనతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను.

-ఈ సినిమాలో ఇంకా రెండు పాటలు ఉన్నాయి. ఆ రెండు కూడా అదిరిపోతాయి.

మస్సా మస్సా పాట రెహమాన్ గారు చేసిన తర్వాత దాదాపు రెండు నెలలు ఎవరికీ వినిపించలేదు. మరో ఆప్షన్ కావాలని అడిగాను. ఒకరోజు చరణ్ గారు కారులో వెళ్తూ ఆ పాట విన్నారు. ఆయనకు చాలా నచ్చింది. "అదిరిపోయింది" అన్నారు. తర్వాత మరో ఆప్షన్ తీసుకోలేదు. అది చరణ్ గారి జడ్జ్‌మెంట్.

-అనంత శ్రీరామ్ గారు చాలా చక్కని పాటలు రాశారు. అన్ని పాటల విషయంలోనూ ఎంతో సహకరించారు.

మీరు పుష్ప గురించి మాట్లాడినప్పుడు "పది కేజీఎఫ్‌లతో సమానం" అన్నారు. మరి పెద్ది గురించి?
-పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు.

రామ్ చరణ్ గారు మీ గురించి మాట్లాడుతూ ఇండియాలో టాప్-5 డైరెక్టర్లలో మీరు ఉంటారని అన్నారు. ఎలా అనిపించింది?
-అది చరణ్ గారి అభిమానం.

రామ్ చరణ్ గారికి ఈ సినిమాలో చాలా గాయాలయ్యాయని విన్నాం?
అవును. ఈ సినిమా షూటింగ్‌లో చరణ్ గారికి చాలా గాయాలయ్యాయి. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయి. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం నాకు చాలా భయమేసింది. చిరంజీవి గారు తిడతారేమో అని భయమేసింది. అది కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఒక ఫైట్ సీన్‌లో పొరపాటున తగిలింది. అయితే చిరంజీవి గారు "బుచ్చి వీడియో పంపించు" అన్నారు (నవ్వుతూ).

చరణ్ గారి ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి?
-పెద్ది జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. నేను డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ మైండ్‌బ్లోయింగ్‌గా అనిపించింది.

క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అది ఎలా ఉంటుంది?
-ఒక కమర్షియల్ హీరోను ఆర్గానిక్‌గా చూపించడం కత్తి మీద సాము లాంటిది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు బిగ్ స్క్రీన్‌పై అనుభవించాలి. ఇప్పటివరకు చూసినవాళ్లంతా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పారు.

రిలీజ్ ట్రైలర్ ఉంటుందా?
-ఇంత బజ్ ఉన్న సినిమాకు రిలీజ్ ట్రైలర్ అవసరం లేదు. నిజానికి ఈ ట్రైలర్ కూడా అవసరం లేదన్నారు. ఒకప్పుడు పాటల క్యాసెట్లు కొనుక్కొని సినిమాలకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు కంటెంట్ అంతా ముందే ఇచ్చేస్తే థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఏముంటుంది?

ఈ సినిమాలో స్పోర్ట్స్ ఎమోషన్‌తో పాటు బ్యాక్‌డ్రాప్‌లో చాలా పెద్ద కథ ఉంటుంది. ఒక 15 నిమిషాల మెయిన్ ఎమోషనల్ బ్లాక్ ఉంది. దాన్ని ట్రైలర్‌లో రివీల్ చేయలేదు.

నిర్మాత సతీష్ గారి గురించి?
-నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే సతీష్ గారు తెలుసు. చరణ్ గారు ఆయనకు సినిమా చేద్దామని చెప్పారు. ఆయన చాలా పాషన్ వున్ ప్రొడ్యూసర్. చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఈరోజుకీ ఫోన్ చేసి "తిన్నావా?" అని అడుగుతుంటారు. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది.

ఫైనల్ కాపీ చూసుకున్నాక ఎలా అనిపించింది?
మంచి సినిమా తీశాననే ఫీలింగ్ కలిగింది.

సుకుమార్ గారి నుంచి ఎక్కువగా ఏం నేర్చుకున్నారు?
ఆయన ఒక సినిమా చేస్తున్నప్పుడు పూర్తిగా అదే సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తారు. మరో కథ వైపు ఆయన మనసు వెళ్లదు. పెద్ది చూసిన తర్వాత సెకండాఫ్ తన ఫేవరెట్ అని చెప్పారు.

ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గురించి?
-ఇది విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఫిక్షనల్ స్టోరీ. 1985 నాటి పరిస్థితులను రీక్రియేట్ చేయడానికి అవినాష్ అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు. ప్రతిదీ చాలా నేచురల్‌గా ఉంటుంది.

పెద్ది గురించి ఒక మాటలో చెప్పాలంటే?
-ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడండి. సూపర్‌గా ఉంటుంది. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కమర్షియల్‌గా ఉంటుంది. ఇందులో చరణ్ గారు కనిపించరు... పెద్ది మాత్రమే కనిపిస్తాడు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.

చిరంజీవి గారు సినిమా చూశారా?
-ఇంకా చూడలేదు. ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సురేఖ మేడమ్ ఒక సీక్వెన్స్ చూశారు. చాలా ఎమోషనల్ అయ్యారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి?
-ఒక మంచి కథ సిద్ధంగా ఉంది. ఎవరితో చేస్తాననేది తర్వాత చూద్దాం.
-ఎన్టీఆర్ గారు పిలిస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్లి కథ చెబుతాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved