pizza

Peddi glimpse on 27 March
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' మాస్ ర్యాంపేజ్ 'గేమ్' గ్లింప్స్ మార్చి 27న రిలీజ్- రామ్ చరణ్ గారు క్షేమంగా ఉన్నారు- రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు- పెద్ది టీం

You are at idlebrain.com > news today >

24 March 2026
Hyderabad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

పెద్ది ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం క్రియేట్ చేస్తోంది. పెద్ది ఫస్ట్ షాట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఎఆర్ రెహమాన్ అందించిన సౌండ్‌ట్రాక్స్ మెగా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చికిరి చికిరి, రైరై రా రా పాటలు వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాయి.

తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. 'పెద్ది' గేమ్ గ్లింప్స్ మార్చి 27 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ గ్లింప్స్ మాస్ ర్యాంపేజ్ గా ఉండబోతుంది.

అలాగే ‘పెద్ది’ సినిమా సెట్స్‌లో రామ్‌చరణ్‌ గాయపడ్డారన్న వార్తలపై టీమ్‌ స్పందించింది.

'పెద్ది సినిమా సెట్స్‌లో నిన్న జరిగిన చిన్న ఘటన గురించి వచ్చిన వార్తలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. రామ్ చరణ్ గారు పూర్తిగా క్షేమంగా ఉన్నారు. షూటింగ్ సమయంలో ఎడమ కంటికి చిన్న గాయం కావడంతో ఒక చిన్న ప్రొసీజర్ చేశారు.
ఆయన రేపటినుంచి తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారు. షూటింగ్ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం లేదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్నీ కంట్రోల్ వున్నాయి ఉన్నాయి. సినిమా పనులు సజావుగా కొనసాగుతున్నాయి. – టీమ్ పెద్ది'

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ఇతర ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.

“పెద్ది” సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలువడానికి సిద్ధమౌతోంది.

తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved