మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా 'పెద్ది' సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు.
“‘రైరై రా రా’ స్క్రీన్‌పై ఫైర్ లా ఉంది. ఇది ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ కలిసిన అద్భుతం. రామ్ చరణ్ స్క్రీన్‌ను ఎఫర్ట్‌లెస్ గ్రేస్, ఎలక్ట్రిఫైయింగ్ స్పీడ్‌తో లైట్ అప్ చేస్తూ కనిపించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. చరణ్ మూవ్ అయ్యే విధానం చూడటం ఒక జాయ్!
దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అందించిన కంపోజిషన్, వోకల్స్, అలాగే జానీ మాస్టర్ అందించిన పవర్ ప్యాక్డ్ కొరియోగ్రఫీ అద్భుతంగా వున్నాయి.
సినిమాటోగ్రాఫర్ ఆర్, రత్నవేలు అందించిన మ్యాగ్నిఫిసెంట్ విజువల్స్, గేయరచయిత అనంత శ్రీరామ్ రాసిన మీనింగ్‌ఫుల్ లిరిక్స్ ఎంతగానో అలరించాయి. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ స్పెక్టాక్యులర్ విజన్‌ను నిర్మాణం చేసినందుకు అభినందనలు' తెలియజేశారు మెగాస్టార్.
సినిమా నుంచి వస్తున్న ప్రతి కంటెంట్ వరల్డ్ వైడ్ వైరల్ కావడంతో 'పెద్ది' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతుతున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.