Promo Of The Biggest Special Song Hellallallo From Mega Power Star Ram Charan, Buchi Babu Sana, Shruti Haasan, Janhvi Kapoor, AR Rahman’s Peddi Unveiled, Full Song Out Tomorrow
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా, శృతి హాసన్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ 'పెద్ది' నుంచి బిగ్గెస్ట్ స్పెషల్ సాంగ్ 'హెల్లల్లో' ప్రోమో రిలీజ్, రేపు పూర్తి పాట రిలీజ్
Mega Power Star Ram Charan is gearing up to create nationwide excitement with his highly awaited action drama Peddi, which has already impressed audiences with its fiery glimpses, two hit songs, and a powerful theatrical trailer. Directed by the talented Buchi Babu Sana, the film is mounted on a grand, raw, and immersive scale. It is prestigiously produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner, in association with Mythri Movie Makers and Sukumar Writings.
Music for the film is composed by AR Rahman, and today, the makers unveiled the promo of the third single, Hellallallo. The promo promises one of the most energetic and colourful special songs in recent times. The track is filled with strong drum beats, catchy rhythm patterns, and a festive, joyful mood that instantly lifts the atmosphere.
Ram Charan appears in a rugged, stylish look, dancing with natural ease and commanding presence. He is joined by Shruti Haasan and Janhvi Kapoor, who bring their own charm and power to the screen- Shruti with her bold, magnetic attitude and Janhvi with her graceful yet high-energy moves. Their combined screen presence feels electric, and even this short promo makes the choreography look impactful.
The full song will be released tomorrow at a grand musical event in Bhopal, where AR Rahman and his team will perform it live, building even stronger excitement for the release.
Shiva Rajkumar, Jagapathi Babu, Divyenndu, and Boman Irani play important roles in the film.
R Rathnavelu handles the cinematography, while AR Rahman composes the music. National Award–winning craftsman Navin Nooli takes care of the editing, and Avinash Kolla serves as the production designer.
Peddi is set for a grand worldwide release on June 4th, with special premieres planned for June 3rd.
Cast: Mega Power Star Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma, Boman Irani
Technical Crew:
Writer, Director: Buchi Babu Sana
Presents: Mythri Movie Makers, Sukumar Writings
Banner: Vriddhi Cinemas
Producer: Venkata Satish Kilaru
Co producer: Ishan Saksena
Music Director: AR Rahman
DOP: R Rathnavelu
Production Design: Avinash Kolla
Editor: Navin Nooli
Executive Producer: V. Y. Praveen Kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా, శృతి హాసన్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ 'పెద్ది' నుంచి బిగ్గెస్ట్ స్పెషల్ సాంగ్ 'హెల్లల్లో' ప్రోమో రిలీజ్, రేపు పూర్తి పాట రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఈరోజు చిత్ర బృందం మూడవ సింగిల్ 'హెల్లాల్లో' ప్రోమోను విడుదల చేసింది. ప్రోమో చూస్తుంటే ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత ఎనర్జిటిక్, కలర్‌ఫుల్ స్పెషల్ సాంగ్స్‌లో ఒకటిగా నిలవనుందని అర్థమవుతోంది. పవర్ ఫుల్ డ్రమ్ బీట్స్, క్యాచీ రిథమ్, జాతర వాతావరణాన్ని తలపించే ట్యూన్‌తో పాట ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంటోంది.
ఈ పాటలో రామ్ చరణ్ తన రగ్గ్డ్, స్టైలిష్ లుక్‌లో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఆయనతో పాటు శ్రుతి హాసన్, జాన్వీ కపూర్ కూడా అలరించారు. శ్రుతి హాసన్ తన బోల్డ్ అటిట్యూడ్‌తో, జాన్వీ కపూర్ తన గ్రేస్‌ఫుల్ ఎనర్జీతో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గురి స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ పాటను మరింత గ్రాండ్‌గా మార్చింది.
పూర్తి పాటను రేపు భోపాల్‌లో జరగనున్న భారీ మ్యూజికల్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్, ఆయన బృందం ఈ పాటను ప్రత్యక్షంగా ప్రదర్శించనుండటంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీని ఆర్. రత్నవేలు అందిస్తుండగా, ఎడిటింగ్ ను జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు.
పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు.
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్