pizza

Megastar Chiranjeevi Appreciates the Peddi Team
‘పెద్ది’ చిత్ర బృందాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

You are at idlebrain.com > news today >

12 June 2026
Hyderabad

రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ‘పెద్ది’ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి, దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు, చిత్ర బృంద సభ్యులను ప్రత్యేకంగా అభినందించి, వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం 350 కోట్ల క్లబ్‌లోకి చేరింది.

రెండో వారంలో కూడా కలెక్షన్లు చాలా బలంగా ఉన్నాయి. రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతోంది.

‘పెద్ది’లో రామ్ చరణ్ నటనపై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్, భావోద్వేగాలతో కూడిన నటన అందరినీ కట్టిపడేస్తోంది.

ప్రస్తుతం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ‘పెద్ది’ రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved