pizza

Priyadarshi about Premante
'ప్రేమంటే' అందరూ రిలేట్ అయ్యే సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది. ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: హీరో ప్రియదర్శి

You are at idlebrain.com > news today >

20 November 2025
Hyderabad

ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యూట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ సినిమా టీజర్ ట్రైలర్ సాంగ్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

21న సినిమా రిలీజ్ అవుతుంది.. ఎలా అనిపిస్తుంది?
-ప్రతి సినిమాకి రిలీజ్ ముందు ఎక్సయిట్మెంట్, నెర్వస్ నెస్ ఉంటుంది. ఒక రైతు వాన కోసం ఎదురుచూసినట్టు నేను కూడా రిజల్ట్ కోసం ఎదురుచూస్తుంటాను.(నవ్వుతూ)

ప్రేమంటే.. మీరేమనుకుంటారు?
-ప్రేమలో రెండు భాగాలు ఉంటాయి. మన కవులు గొప్ప గొప్ప దర్శకులు ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పారు చూపించారు. అదంతా థియరీ. అయితే మనకి ప్రేమ యొక్క అప్లికేషన్ కూడా అర్థం కావాలి. అది ఎక్కువసార్లు పెళ్లి ద్వారానే అర్థమవుతుంది.

మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత మొదలయ్యే జీవితంలో చాలా డైనమిక్స్ మారుతాయి. ప్రేమంటే ఇంత బాగుంటుంది అని అనుకోవడం దగ్గరనుంచి ఇలా కూడా ఉంటుందని ఇందులో చూపించడం జరుగుతుంది. సినిమా అందరూ రిలేట్ చేసుకునేలా వుంటుంది.

థ్రిల్ ప్రాప్తిరస్తు ట్యాగ్ లైన్ పెట్టడానికి కారణం?
-మ్యారేజ్ అంటే థ్రిల్లింగ్ గా ఉండాలి అని భావించే ఒక అమ్మాయి. మీకు టీజర్ ట్రైలర్ లో కూడా అది కనిపించే ఉంటుంది. ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి థ్రిల్ గా ఉండొచ్చు. ఇందులో అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది.

ఆనంది తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-ఆనంది తమిళ్ లో చేసిన అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఉన్న సినిమాలు చూశాను. తను తెలుగమ్మాయి. వరంగల్ లో పుట్టి పెరిగిన అమ్మాయి. చాలా ప్రొఫెషనల్. అద్భుతమైన పెర్ఫార్మర్.

సుమ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
సుమ అక్క లెజెండ్. ప్రతిరోజు చాలెంజ్ ని ఎదుర్కొంటూ గొప్పస్థాయి వెళుతోంది. తనని కేవలం ఒక యాంకర్ గా కాకుండా వ్యక్తిగా నటిగా చూడడం చాలా బాగా అనిపించింది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తను చాలా స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతుంది. తను ఎప్పుడు కూడా ప్రజెంట్ లోనే ఉంటుంది. ఆ క్వాలిటీ తన నుంచి నేర్చుకున్నాను.

దర్శకుడు నవనీత్ గురించి ?
చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. కథని అద్భుతంగా రాశాడు. తనకి పర్ఫెక్ట్ కన్వెన్షన్ ఉంటుంది. తనకు ఏం కావాలో క్లారిటీ ఉన్న డైరెక్టర్. చాలా మెచ్యూరిటీతో ఈ కథ రాశాడు.

పెళ్లి, విడాకుల గురించి ఈ సినిమాలో ప్రత్యేకమైన సందేశం ఉంటుందా?
-మేము సందేశం ఇవ్వదలుచుకోలేదు. పెళ్లి విడాకులు ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఇద్దరు తమ ప్రాబ్లం ని ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఈ సినిమాలో చూపించాం. అందులో నుంచి ఎవరైనా మెసేజ్ తీసుకుంటే తీసుకోవచ్చు. అంతేగాని ప్రత్యేకంగా మెసేజ్ ఇవ్వడం అంటూ ఉండదు.

మీరు చేసిన క్యారెక్టర్స్ కి మీ పర్సనల్ లైఫ్ కి ఏదైనా పోలికలు ఉన్నాయా?
-నా క్యారెక్టర్స్ కి నాకు సంబంధం ఉండదు. నాకున్న ఐడియాలజీల్ని నా క్యారెక్టర్స్ మీద రుద్ద దలుచుకోలేదు. నేను అనేవాడు లేకుండా నేను క్యారెక్టర్స్ లోకి ఎంటర్ కావాలి .అప్పుడే ఇలాంటి సినిమాలు, ప్రయోగాత్మ చిత్రాలు చేయగలను. నన్ను నేను వెనక్కి పెట్టుకుంటేనే కొత్త తరహా పాత్రలో చేయగలుగుతాను. మల్లేశం బలగం కోర్టు అలా వచ్చిన చిత్రాలే. ఎవరైనా మీ స్టైల్ లో ఒక సినిమా చేద్దామంటే నాకేం స్టైల్ లేదు మీరు ఏదైనా కొత్తగా చెప్తే అదే నా స్టైల్ అవుతుందని చెప్తుంటాను. ఏదైనా కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ అవుతుంది.

ఈ సినిమాలో డాన్స్ లు కూడా ఎక్కువ చేసినట్టుగా ఉన్నారు?
సరిపోయినంత చేసానని అనుకుంటున్నాను(నవ్వుతూ). మా కొరియోగ్రాఫర్స్ జెడి ,విశ్వ చాలా ప్రాక్టీస్ చేయించారు. అలాగే ఆనంది కూడా మంచి డాన్సర్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డాన్సులుపై శ్రద్ధ తీసుకుని ప్రాక్టీస్ చేసి చేయడం జరిగింది.

లియాన్ జేమ్స్ మ్యూజిక్ గురించి
-జేమ్స్ సినిమా కావాల్సిన పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే పాటలు కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. డాన్స్ నెంబర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ బ్యాగ్రౌండ్ స్కోరు బ్రిలియంట్ గా ఉంటాయి.

నిర్మాతల గురించి?
-సునీల్ గారు రామ్మోహన్ గారు జాన్వి అందరూ చాలా సపోర్టివ్. సినిమాని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేశారు .మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. అలాగే స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఎంతో హెల్ప్ అయ్యింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved