pizza

Raakaasaa Pre Release Event
ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’ ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

You are at idlebrain.com > news today >

30 March 2026
Hyderabad

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ మూవీని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘జీ స్టూడియోతో, దివ్య గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ అని ఓ సిరీస్ చేశాం. ఆ టైంలో మానస గారి డైలాగ్స్ మొదటగా విన్నాను. ఆ తరువాత మానస గారిని చూశాను. ఆమె తక్కువ మాట్లాడుతుంది. కానీ చాలా ఆలోచిస్తుంటుంది. 24 గంటలు సినిమా గురించి, కథ గురించే ఆలోచిస్తుంటుంది. మానస ఇంకా ఇంకా చాలా ఎత్తుకు వెళ్తుంది. మానస గారు, మహేష్ గారు, యదు వంశీ గారి వంటి వారిని ఇంట్రడ్యూస్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ చేస్తున్నప్పుడు 11, 15 మంది కొత్త వాళ్లతో చేయడం ఎందుకు అన్నారు?.. ‘రాకాస’ టైంలో ఇలాంటివి ఎందుకు ‘కమిటీ కుర్రోళ్లు’ లాంటి సినిమాలు చేసుకోవచ్చు కదా అని అన్నారు.. ‘బరి’ చేస్తుంటే.. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎందుకు? అని అంటున్నారు.. ఇలా అనే వాళ్లు అంటూనే ఉంటారు.. నాకు నచ్చింది నేను చేస్తూనే ఉంటాను. నేను నా ప్రతీ సినిమాతో కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉంటాను. నాకు కొణిదెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ రెండూ సమానమే. నా మీద నమ్మకం పెట్టుకుని, నాకు ఫ్రీడం ఇచ్చిన నా తల్లిదండ్రులకు థాంక్స్. రమేష్ గారు మొదటి నుంచి మాకెంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అనుదీప్ గారికి అద్భుతమైన మ్యూజిక్ టాలెంట్ ఉంది. రాజు గారి విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. విజయ్ మాస్టర్ గారిని సెట్లో చూస్తే మా నాన్న గారిని చూసినట్టే అనిపిస్తుంది. అన్వర్ అలీ గారు కేవలం ఎడిటర్‌గా కాకుండా అన్ని బాధ్యతల్ని చూసుకుంటారు. నాన్న గారి వల్ల నాకెంతో మంది పరిచయమయ్యారు. అందులో గెటప్ శ్రీను ఒకరు. ఆయన నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటారు. నయన్‌లో ఓ ప్రత్యేకత ఉంది. ఆమె చాలా మంచి వ్యక్తి. సంగీత్ షైనింగ్ స్టార్. ‘రాకాస’ చిత్ర విజయంలో సంగీత్‌కి సింహభాగం దక్కుతుంది. మేం నిజాయితీతో వంద శాతం కష్టపడి ఓ మంచి సినిమాని చేశాం. మా పింక్ ఎలిఫెంట్‌లో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం. ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’ ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది’ అని అన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. ‘గత ఏప్రిల్‌లో నేను, మానస గారు, నిహారిక గారు కలిసి ఓ ఫోటో దిగి ఇన్ స్టాలో షేర్ చేశాను. ఏప్రిల్ 3న మా సినిమా రాబోతోంది. ఓ మంచి సినిమాతో ఆడియెన్స్ ముందుకు రావాలనే గత ఏడాది ఫిక్స్ అయ్యాం. సినిమా రిలీజ్ తరువాత రాజు గారి విజువల్స్, అనుదీప్ గారి మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. మహేష్ గారి వల్లే నాకు ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వచ్చింది. దర్శకుడిగా మహేష్ ‘ఇట్లు అర్జున’తో బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నారు. చలికాలంలో రాత్రిపూట ఎక్కువగా షూటింగ్ చేశాం. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్‌కి థాంక్స్. నయన్‌కి మంచి టాలెంట్ ఉంది. ఆమెతో పని చేయడం ఆనందంగా ఉంది. గెటప్ శ్రీను గారు చాలా మంచి వ్యక్తి. నిహారిక గారు చాలా సున్నితమైన వ్యక్తి. ఆమెకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ నుంచి మానస గారితో నాకు మంచి బంధం ఉంది. జనాలు సినిమాని చూసి వదిలేయకూడదు, ఇంటికి తీసుకెళ్లాలి, గుర్తు పెట్టుకోవాలి, వాళ్లు పెట్టే డబ్బులకి సరిపడేలా న్యాయం చేయాలని మానస గారు తపన పడుతుంటారు. ఆడియెన్స్‌ని ఆమె ఎంతగానో రెస్పెక్ట్ చేస్తుంటారు. మేం ఓ మంచి సినిమాని తీశామని నమ్ముతున్నాం. ఆడియెన్స్ పెట్టే ప్రతీ పైసాకి వర్త్ అనిపించేలా మా చిత్రం ఉంటుంది. ఏప్రిల్ 3న ‘రాకాస’ రాబోతోంది. అందరూ చూడండి. తప్పకుండా నిరాశ పర్చదు. మంచి సినిమా తీయడానికి మేం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. మా యూవీ క్రియేషన్స్, శర్వా అన్న ‘బైకర్’ కూడా ఏప్రిల్ 3న రాబోతోంది. రెండు సినిమాల్ని ఆడియెన్స్ చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నయన్ సారిక మాట్లాడుతూ .. ‘నిహారిక గారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇది నాకు మూడో ప్రాజెక్ట్. ‘హలో వరల్డ్’తో నా సినీ ప్రయాణం మొదలైంది. నిహారిక గారితో పని చేస్తే లక్ కలిసి వస్తుంది. ‘రాకాస’తో మళ్లీ ఆమెతో పని చేయడం ఆనందంగా ఉంది. మా అందరినీ బాగా చూసుకున్న రమేష్ గారికి థాంక్స్. మానస శర్మ గారికి సినిమా పట్ల చాలా ఫోకస్, క్లారిటీ ఉంది. సెట్‌లో గెటప్ శ్రీను గారు అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. సంగీత్‌తో ఉన్న ర్యాప్‌తో ఇంకా ఏ కో యాక్టర్‌తో నాకు లేదు. ‘రాకాస’ని ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఏప్రిల్ 3న మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ .. ‘నిహారిక గారు మా లక్కీ ఛార్మ్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో సిరీస్‌ను డైరెక్ట్ చేస్తే.. ఆ వెంటనే సినిమా డైరెక్షన్ ఛాన్స్ కూడా వస్తుంది. నా ‘బెంచ్ లైఫ్’ తరువాత నాకు ‘రాకాస’ అవకాశం వచ్చింది. నిహారిక గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. రాజు గారికి పని పట్ల ఎంతో ఉత్సాహం ఉంటుంది. అనుదీప్ గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నా రైటింగ్‌లో భాగస్వామి అయిన మహేష్ గారికి థాంక్స్. అన్వర్ గారు నాకెంతో సపోర్ట్ చేశారు. నయన్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన గెటప్ శ్రీను గారు, బ్రహ్మాజీ గారు, తనికెళ్ల భరణి గారికి థాంక్స్. సంగీత్ శోభన్ నా బలం. ఏప్రిల్ 3న మా చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

యదు వంశీ మాట్లాడుతూ .. ‘నిహారిక గారు నా మీదే ‘కమిటీ కుర్రోళ్లు’ కోసం 9 కోట్లు పెట్టారు. ‘రాకాస’ బడ్జెట్ విని షాక్ అయ్యాను. నిహారిక గారికి నిహారిక గారే ధైర్యం. నిహారిక గారు అమ్మాయిలందరికీ ఇన్‌స్పిరేషన్. కొత్త వారికి, టాలెంట్ ఉన్న వారికి నిహారిక గారు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. నిహారిక గారి వల్లే ‘రాకాస’ ఈ స్థాయికి వచ్చింది. అనుదీప్ మరింత పెద్ద స్థాయికి వెళ్తాడు. అన్వర్ అహర్నిశలు సినిమా కోసం కష్టపడుతుంటారు. ఈ చిత్రానికి విజయ్ మాస్టర్ అతి పెద్ద బలం. రాజు విజువల్స్ గురించి రమేష్ గారు ఎప్పుడూ చెబుతుంటారు. సంగీత్‌కి సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. నయన్ గారు స్క్రీన్ పై అందంగా కనిపిస్తున్నారు. ఏప్రిల్ 3న రాబోతోన్న ఈ చిత్రం అందరినీ నవ్వించబోతోంది’ అని అన్నారు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ .. ‘‘రాకాస’ ఏప్రిల్ 3న రాబోతోంది. ఫ్యామిలీ అంతా కలిసి మా మూవీని చూడండి. ఆడియెన్స్ పెట్టే ప్రతీ పైసాకి వర్త్ వర్మ వర్త్ అని అనుకుంటారు. అవకాశం ఇస్తేనే టాలెంట్ బయటకు వస్తుంది. అలాంటి అవకాశాలు ఇస్తూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. మానస గారు చాలా క్లారిటీ, సెన్సిబిలిటీస్ ఉన్న దర్శకురాలు. అనుదీప్ దేవ్ గారు అద్భుతమైన సంగీత దర్శకుడు. నయన్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’తో సంగీత్‌తో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయన టాలెంట్ చూసి నేను షాక్ అయ్యాను. ప్రతీ ఎమోషన్‌తో, ప్రతీ జానర్‌తో అందరినీ ఆకట్టుకోగల సత్తా ఉన్న నటుడు. ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ మ్యూజిక్ విషయంలో నాకు సపోర్ట్ చేసిన నా టీం మెంబర్లకు థాంక్స్. ఆర్టిస్టులందరూ అద్భుతంగా నటించారు. ఎక్కడా కూడా కామెడీ కోసం నేను సపరేట్‌గా మ్యూజిక్ చేయలేదు. అంత ఆర్గానిక్‌గా కామెడీ వర్కౌట్ అయింది. మమ్మల్ని పరుగులు పెట్టించి, మాతో పని చేయించిన రమేష్ గారికి థాంక్స్. మానస గారితో పని చేయడం ఆనందంగా ఉంది. సంగీత్ చాలా మంచి యాక్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి థాంక్స్. ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’ పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.

జీ స్టూడియోస్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దివ్య విజయ్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ మా అందరికీ చాలా ప్రత్యేకం. నేను జీ స్టూడియోకి వచ్చిన తరువాత ఎంచుకున్న మొదటి చిత్రమిదే. ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని మానస, నిహారికలు ఈ సినిమాని తీశారు. నిహారిక ఈ సినిమాని తన భుజానికి ఎత్తుకుని ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. ‘రాకాస’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మైత్రి శశి మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాని మేమే నైజాంలో రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’ని కూడా మైత్రికే ఇచ్చారు. ఈ చిత్రాన్ని మేం నైజాంలో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. ప్రమోషన్స్ అద్భుతంగా చేస్తున్నారు. మంచి ఓపెనింగ్స్‌ వస్తాయని ఆశిస్తున్నాను. ‘రాకాస’ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ .. ‘‘రాకాస’ ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత నిహారిక గారికి థాంక్స్. ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది’ అని అన్నారు.

డీఓపీ రాజు ఎదురోలు మాట్లాడుతూ .. ‘‘రాకాస’ కోసం ఎక్కువగా మేం రాత్రి పూటే షూటింగ్స్ చేశాం. నిహారిక గారితో ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. రమేష్ గారు నాకెప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు. ఇలాంటి జానర్‌లో కథ రాసిన మానస గారికి హ్యాట్సాఫ్. సంగీత్, నయన్, గెటప్ శ్రీను అందరూ అద్భుతంగా నటించారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ రామాంజనేయులు మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌తో ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. నిహారిక గారు నాకు హెడ్ మిస్‌లా, రమేష్ గారు డీన్‌లా అనిపిస్తుంటారు. ‘రాకాస’కి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’లో అద్భుతమైన సెట్ వర్క్ ఉంటుంది. కోట సెట్‌ని తెరపై చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ‘రాకాస’ అందరినీ కట్టి పడేసేలా ఉంటుంది’ అని అన్నారు.

వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌తో ఇది నాకు తొలి చిత్రం. వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. వీఎఫ్ఎక్స్ దాదాపు మూడున్నర నెలలు పట్టింది. ‘రాకాస’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ ప్రమోషన్స్ ప్రతీ చోటా కనిపిస్తున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ని నిహారిక గారు అద్భుతంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. మానస గారు ‘రాకాస’ని అద్భుతంగా తెరకెక్కించారు. ‘రాకాస’ టీం ఎంతో క్రమశిక్షణతో పని చేసింది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మహేష్ ఉప్పాల మాట్లాడుతూ .. ‘నిహారిక గారి వల్లే నేను, మానస ఈ స్థాయికి వచ్చాం. మానసతో కలిసి ఈ రచనలో భాగమవ్వడం ఆనందంగా ఉంది. ‘రాకాస’ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మాకు సపోర్ట్ చేసిన ‘రాకాస’ టీంకు థాంక్స్’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి మాట్లాడుతూ .. ‘‘రాకాస’లోని జాతర సాంగ్ చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. ఆ పాట కోసం నిహారిక గారు చాలా ఖర్చు పెట్టారు. ‘రాకాస’ కోసం పని చేయడం ఆనందంగా ఉంది. ఈ ‘రాకాస’తో నిహారిక గారు బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

లిరిక్ రైటర్ రఘు రాం మాట్లాడుతూ .. ‘‘రాకాస’లో నేను ‘రపప్పా’, ‘స్నేక్ డ్యాన్స్’ పాటలు రాశాం. అనుదీప్‌తో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved