Raja The Raja press meet
'రాజా ది రాజా' ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ప్రేమ, ఆదరణ కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశాను. జూలై 17న ప్రేక్షకులందరి నుంచి కూడా అదే స్థాయిలో గొప్ప స్పందన వస్తుందనే నమ్మకం ఉంది: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో రుత్విక్
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రుత్విక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మరికొద్ది గంటల్లో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మనసులో చాలా ఎగ్జైట్‌మెంట్ ఉంది. ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను. నిన్న జరిగిన ప్రీమియర్‌కు వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. ఆ రెస్పాన్స్ చూసి నేను చాలా అదృష్టవంతుడినని అనిపించింది. అలాంటి ప్రేమ, ఆదరణ కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశాను. ఎంతో ప్రేమతో, ఇష్టంతో చేసిన సినిమా ఇది. చిన్నప్పటి నుంచి స్కూల్‌లో, కాలేజీలో ఎక్కడికి వెళ్లినా అందరినీ ఎంటర్‌టైన్ చేయాలని అనుకునేవాడిని. ఇప్పుడు ఆ కల 'రాజా ది రాజా' ద్వారా నెరవేరుతోంది. మీ అందరి ముందుకు హీరోగా రావడం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. మా అక్క, నిర్మాత నిహారికకు ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇలాంటి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. నా ప్రతిభను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యు అక్క. మా దర్శకుడు అనిల్ బోయిడపు గారు చాలా క్రియేటివ్ పర్సన్. ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. మార్క్ కె. రాబిన్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మా డీవోపీ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. విశాఖ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. నరేష్ గారు, సాయికుమార్ గారు సహా ఎంతోమంది గొప్ప నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. మేమంతా ఎంతో ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మంచి విజువల్ స్పెక్టికల్. జూలై 17న మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్యూ సో మచ్.
నిర్మాత కె. నిహారిక దాసరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా ఎమోషనల్‌గా ఉంది. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రీమియర్ చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. అందరూ సినిమాను ఎంతో ఇష్టపడటం చాలా ఆనందంగా ఉంది. రుత్విక్ ఈ సినిమా కోసం చేసిన కష్టం మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుంచే హీరో కావాలనే కలతో ఎంతో శ్రమించి, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. అది నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ఇప్పుడు తన పేరు 'రుత్విక్ రాజా' అని పెట్టాలనిపిస్తోంది. మార్క్ కె. రాబిన్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మా టీమ్‌లో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రేక్షకులు కూడా ఇదే ప్రేమతో సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
హీరోయిన్ విశాఖ ధిమాన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారు. మాది కూడా అలాంటి మంచి సినిమా. చాలా ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని చేశాం. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసే అవకాశం వచ్చింది. అక్కడ వచ్చిన స్పందన అద్భుతంగా అనిపించింది. థియేటర్లలో కూడా ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇది చాలా హార్ట్‌ఫుల్ ఫిల్మ్. ప్రతి ఒక్కరం ఎంతో ప్రాణం పెట్టి పనిచేశాం. నిహారిక గారు నిర్మాతలా కాకుండా టీమ్‌లో ఒక సభ్యురాలిగా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆమె నాకు ఇన్‌స్పిరేషన్. రుత్విక్ నటన చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆయన అద్భుతంగా నటించారు. తప్పకుండా చాలా పెద్ద స్టార్ అవుతారు. ఈ సినిమాను అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు అనిల్ బోయిడపు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఒక కల. ఆ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. కానీ మంచి అవుట్‌పుట్ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు వచ్చిన స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది. నేను ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నానో, 'రాజా ది రాజా' అలాంటి సినిమానే. ఇది అందరికీ నచ్చే, అందరికీ దగ్గరయ్యే సినిమా. విశాఖ చాలా అద్భుతంగా నటించింది. రుత్విక్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఇష్టపడి, కష్టపడి పనిచేశారు. సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.
సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్ మాట్లాడుతూ.. ఈ సినిమా నా జీవితంలో ఒక అందమైన ప్రయాణం. మా నిర్మాతలు, హీరో ఈ ప్రాజెక్ట్ కోసం చాలా బలంగా నిలబడ్డారు. మంచి కథతో ఒక మంచి సినిమా చేయాలనే ప్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు 'రాజా ది రాజా' అనే టైటిల్ ఐడియా ఇచ్చింది నేనే. అది అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. పాటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మేము ఎంతో నిజాయితీతో ఈ సినిమాను చేశాం. ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు
తారాగణం: రుత్విక్, విశాఖ ధీమాన్, సాయి కుమార్, డా. నరేష్ విజయ కృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్ : బృందావన్ క్రియేషన్స్
సమర్పణ: కె శ్రీలత రెడ్డి
నిర్మాత: కె. నిహారిక దాసరి
దర్శకత్వం: అనిల్ బోయిదాపు
డీవోపీ: రవికిరణ్ బోయిడపు
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్: సాయి బాబు తలారి
ఆర్ట్ డైరెక్టర్: విజయ్ కుమార్ పసుపులేటి