“Raju Weds Rambayi” – A Rustic Love Story with Deep Emotions; Trailer Released
భావోద్వేగమైన కథాంశంతో ఒక పల్లెటూరి ప్రేమకథగా 'రాజు వెడ్స్ రాంబాయి' .. ట్రైలర్ విడుదల..
Another realistic and heartfelt love story is soon arriving on screen in the form of “Raju Weds Rambayi.” Directed by Sailu Kompati, the film stars Akhil Raj and Tejaswi Rao in the lead roles. The trailer of the film was released today. As announced earlier by the team, the trailer unfolds with an intense emotional narrative from start to finish.
Opening with the tagline “Love itself is the eternal enemy of love,” the trailer features a striking dialogue from the heroine: “If I don’t marry you, you’ll hit me… if I marry you, my father will hit me… I’m dying between you both.” This line instantly conveys that the story revolves around a village girl caught between her lover and her family.
The tension escalates further with powerful lines: From the heroine’s father — “She is my daughter… let me see how she comes with you.” And from the hero — “She is my wife… let me see how she doesn’t come with me.” These contrasting dialogues heighten the drama and emotional conflict, making the trailer engaging.
The film also features Chaitu Jonnalagadda, brother of actor Siddhu Jonnalagadda, in a key role. The trailer showcases realistic performances from the hero, heroine, and Chaitu, who plays the heroine’s father.
The music is composed by Suresh Bobbili, who has been gaining wide appreciation recently. The songs released so far have already connected with the audience, increasing expectations for the film.
Produced as an ETV Win Originals project, Raju Weds Rambayi is jointly backed by Dolamukhi Subaltern Films and Monsoon Tales, with producers Venu Udugula and Rahul Mopidevi. The film is scheduled for a theatrical release on the 21st of this month by the distributors Bunny Vas and Vamsi Nandipati.
మరో యధార్థ ప్రేమ కథ తెరపై 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాగా త్వరలో కనిపించబోతుంది. సాయిలు కాంపాటి దర్శకత్వంలో అఖిల్ రాజ్ మరియు తేజస్వి రావు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజే విడుదలయింది. చిత్ర బృందం గతంలోనే ప్రకటించిన విధంగా ట్రైలర్ ఆద్యంతం ఇంటెన్స్ కథాంశంతో సాగింది.
"ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు" అనే ట్యాగ్ లైన్ తో మొదలైన ట్రైలర్ లో "చేసుకోనంటేనేమో నువ్వు కొడతవ్.. చేసుకుంటా అంటే మా నాయన కొడతడు.. మీ ఇద్దరు పొత్తులా నేను చస్తున్నా" అంటూ కథానాయిక పలికిన సంభాషణలు వింటుంటే ప్రేమికుడికీ కుటుంబానికీ మధ్య నలిగిపోయే ఓ పల్లెటూరి అమ్మాయి చుట్టూ తిరిగే ప్రేమ కథ అన్న సంగతి అర్థమవుతుంది. "అది నా బిడ్డరా అది నీతో ఎట్లొస్తదో నేను చూస్తా" అంటూ కథానాయిక తండ్రి ఒకవైపు"అది నా పెళ్లాం రా ఎట్ల రాదో నేను కూడా చూస్తా" అంటూ కథానాయకుడు ఒకవైపు చెప్తున్న సంభాషణలతో ట్రైలర్ ఆసక్తిగా కొనసాగింది.
ఈ సినిమాలో మరో కీలకపాత్రలో హీరో సిద్ధూ జొన్నలగడ్డ సోదరుడు చైతూ జొన్నలగడ్డ కూడా కనిపించబోతున్నారు. హీరోహోరోయిన్లతో పాటూ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన చైతూ జొన్నలగడ్డ ముగ్గురూ ఎంతో రియలిస్టిక్ నటించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇటీవల కాలంలో తన సంగీతంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 'ఈటీవీ విన్ ఒరిజినల్స్' రూపొందిస్తున్న ఈ సినిమాను 'Dolamukhi Subaltern Films' మరియు 'Monsoon Tales' బేనర్లో నిర్మాత వేణు ఉడుగుల మరియు రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 21 న పంపిణీదారులు బన్నీ వాసు మరియు వంశీ నందిపాటిలు సంయుక్తంగా విడుదలచేయనున్నారు.