pizza

“Ranabaali Gave Meaning to My Life as an Actor; I Have Repaid My Debt to Rayalaseema Through This Film” – Vijay Deverakonda at Anantapur Ranabheri Event
"రణబాలి" సినిమా నటుడిగా నా జీవితానికి అర్థాన్నిచ్చింది, ఈ సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా - అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

You are at idlebrain.com > news today >

23 October 2026
Hyderabad

Anantapur: Vijay Deverakonda’s ambitious pan-India film Ranabaali, directed by Rahul Sankrityan and featuring Rashmika Mandanna as the female lead, has been produced on a grand scale by Naveen Yerneni and Y. Ravi Shankar under the Mythri Movie Makers banner, with T-Series presenting the film.

Following its grand worldwide theatrical release, Ranabaali has been receiving an encouraging response from audiences across centres. Celebrating the film’s success, the team organised a grand Ranabheri event in Anantapur, where the cast and producers expressed their gratitude to audiences, particularly those from Rayalaseema.

Co-Producer Anurag Parvathneni

“Thank you to everyone who turned up in such huge numbers for our Ranabheri event today. We are grateful to every audience member who has made Ranabaali such a big success. It makes us extremely happy to hear our distributor Shashi garu and producer Ravi garu say that the film has truly connected with the people.”

Actress Easwari Rao

“This success is the result of the hard work of hundreds of people. Regardless of the negative campaigns, it is the audience that has given us the real victory. The entire team of Ranabaali will always be indebted to all of you.”

Producer Naveen Yerneni

“We are extremely happy with the success of Ranabaali. When a film receives appreciation and delivers good box-office numbers, it gives us immense satisfaction. That is what we all work towards. Thank you to the audiences who have made Ranabaali a blockbuster.

“Director Rahul had a strong vision to tell this story, and Vijay Deverakonda has done complete justice to the character of Ranabaali. Rashmika lived the role of Jayamma. This is not a regular commercial film; in many ways, it is an experimental attempt.

“Although the film received somewhat mixed talk initially on its opening day, it picked up momentum from the evening onwards. It is set to continue its successful theatrical run for many more days. Ranabaali has emerged as the biggest blockbuster of Vijay’s career, performing better than our earlier films with him, Dear Comrade and Kushi. Along with collections, the film is also receiving appreciation from audiences.”

Producer Y. Ravi Shankar

“It was Vijay’s wish to organise an event for our film in Anantapur, and he was determined to make it happen here. Thank you to the huge number of audience members who attended this event and to our entire cast and crew.

“The dedication of our actors and technicians has helped us deliver this film. Ranabaali is receiving a super-hit response across locations, but Rayalaseema is witnessing extraordinary demand, including overflow crowds. Thank you for showering so much love on our film.”

Actress Rashmika Mandanna

“I miss all of you at this event. I could not travel to Anantapur because I am occupied with a shoot in Mumbai. Thank you for all the love you are showing Ranabaali. The reels and posts you are sharing on social media make me very happy. I am delighted that you are loving the character of Jayamma so much.”

Director Rahul Sankrityan

“I was born, raised and educated in Rayalaseema. I watched many superhit films here, and it is a proud and emotional moment to see my directorial film playing to house-full theatres where I once enjoyed watching movies. The audiences of Seema truly love cinema.

“Bringing lesser-known historical events to the screen is rare. Making a grand commercial film against a historical backdrop, with such big stars, is not easy. With the support of my entire team, I was able to bring this vision to life.

“Many people tried to spread negativity about our film without even a basic understanding of it. But once again, it has been proved that nobody can stop a good film from reaching its audience. We are receiving encouraging reports from all regions, and I thank every Telugu audience member.

“This is a script into which I poured all my memories. That is why our culture is portrayed so beautifully in the film. Through Ranabaali, I feel that I have repaid, at least in part, the debt I owe to the land where I was born.

“Everyone has seen how brilliantly Vijay Deverakonda has performed as Ranabaali. Just as Chiranjeevi garu and Balakrishna garu effortlessly delivered the Seema dialect, Vijay garu has done the same. His dialogues are drawing whistles in theatres.”

Hero Vijay Deverakonda

“Telugu land is extraordinary, beautiful and rich in history. Our land is home to different festivals, traditions, dialects and people. Telangana, where I was born, has its own intensity, fighting spirit and the infectious energy of folk songs. Andhra Pradesh has beautiful surroundings, warm-hearted people, affection, wonderful festivals and lovely folk music.

“When it comes to Seema, there is a song in Ranabaali that says, ‘This is the land ruled by Rayalu.’ I love that song. Those four lines beautifully capture the essence of Rayalaseema.

“Rayalaseema has given me so much. I studied here. There was a theatre in a place called Kothacheruvu where I used to watch films. Today, seeing our Ranabaali playing to house-full audiences in that very theatre makes me happier than I can express.

“We shot our film in Anantapur, Kurnool and Kadapa, places I had travelled through earlier. During filming, memories of my student days came rushing back.

“I did not make Ranabaali merely as an actor. I made it with the responsibility of telling the story of this land. I made

"రణబాలి" సినిమా నటుడిగా నా జీవితానికి అర్థాన్నిచ్చింది, ఈ సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా - అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "రణబాలి" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో "రణబాలి" రణభేరి ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - ఈ రోజు మా రణభేరి ఈవెంట్ కు భారీ సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మా రణబాలి సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మన సినిమా జనాల్లో ఉంది అని మా డిస్ట్రిబ్యూటర్ శశి గారు, మా ప్రొడ్యూసర్ రవి గారు చెప్పడం సంతోషంగా ఉంది. అన్నారు.

నటి ఈశ్వరీరావు మాట్లాడుతూ - వందలమంది కష్టపడితే దక్కిన విజయం ఇది. ఎవరెన్ని నెగిటివ్ ప్రచారాలు చేసినా అసలైన విజయాన్ని ప్రేక్షకులే మాకు అందించారు. మీ అందరికీ మా సినిమా టీమ్ అంతా రుణపడి ఉంటాం. అన్నారు.

ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ - రణబాలి విజయం పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. మనం చేసిన సినిమా హిట్ అయి, ప్రశంసలు తీసుకొచ్చి, మంచి వసూళ్లు అందిస్తే అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆ విజయం కోసమే మేమంతా పనిచేసేది. రణబాలిని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. ఇలాంటి కథ చెప్పాలనేది మా డైరెక్టర్ రాహుల్ విజన్. రణబాలి పాత్రకు పూర్తి న్యాయం చేశారు మా హీరో విజయ్ దేవరకొండ. జయమ్మగా రశ్మిక జీవించారు. ఇది రెగ్యులర్ మూవీ కాదు. ఒకరకంగా ప్రయోగాత్మక చిత్రం. మా మూవీ మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా సాయంత్రం నుంచి పుంజుకుంది. ఇంకా చాలా రోజుల థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ కాబోతోంది. విజయ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రణబాలి నిలిచింది. మేము విజయ్ గారితో చేసిన డియర్ కామ్రేడ్, ఖుషి కంటే రణబాలి పెద్ద విజయాన్ని సాధిస్తోంది. కలెక్షన్స్ తో పాటు అప్రిషియేషన్స్ రావడం రణబాలి విషయంలో జరుగుతోంది. అన్నారు.

ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ - అనంతపురంలో మన సినిమా ఈవెంట్ పెట్టాలనేది విజయ్ గారి కోరిక. ఆయనే పట్టుదలగా ఇక్కడ వేడుక జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులకు, మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడం వల్లే ఈ రోజు రణబాలి ఇంత బాగా వచ్చింది. రణబాలి సినిమాకు అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే రాయలసీమ నుంచి ఓవర్ ఫ్లోస్ వస్తున్నాయి. మీరు అంతగా మా సినిమాపై ప్రేమ చూపిస్తున్నారు. అన్నారు.

హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ - మీ అందరినీ ఈవెంట్ లో మిస్ అవుతున్నా. బాంబేలో ఒక షూటింగ్ లో ఉండిపోయి అనంతపురం రాలేకపోయాను. రణబాలి సినిమాపై మీరంతా చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. మీరు సోషల్ మీడియాలో చేస్తున్న రీల్స్, పోస్టులు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. జయమ్మ పాత్రను మీరు ఎంతో ఇష్టపడుతుండటం సంతోషంగా ఉంది. అన్నారు.

డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ - నేను పుట్టి పెరిగింది చదువుకుంది రాయలసీమలో. ఇక్కడే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చూశాను. నేను సినిమాలను ఎంజాయ్ చేసిన థియేటర్స్ లో నా దర్శకత్వంలో వచ్చిన సినిమా హౌస్ ఫుల్స్ తో ప్రదర్శింపబడటం చాలా సంతోషంగా గర్వంగా ఉంది. సీమ ఆడియెన్స్ సినిమాను ఎంతో ప్రేమిస్తారు. చరిత్రలో మరుగున పడిన ఘటనలను సినిమాగా తెరకెక్కించడం అరుదు. హిస్టరీని నేపథ్యంగా తీసుకుని ఇలాంటి పెద్ద స్టార్స్ ను పెట్టుకుని కమర్షియల్ భారీ సినిమా రూపొందించడం సులువైన పని కాదు. మా టీమ్ అందరి సపోర్ట్ తో నేను చేయగలిగాను. ఎంతోమంది మినిమమ్ సెన్స్ లేకుండా మా సినిమాను నెగిటివ్ చేయాలని చూశారు. అయినా మంచి సినిమాను ఎవరూ ఆపలేరని మరోసారి ప్రూవ్ అయ్యింది. అన్ని ప్రాంతాల నుంచి మా సినిమాకు మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్. నా జ్ఞాపకాలు అన్నింటినీ పెట్టి రాసిన స్క్రిప్ట్ ఇది. అందుకే మా సినిమాలో మన కల్చర్ అంత అందంగా కనిపిస్తోంది. నేను పుట్టిన నేల రుణం రణబాలి ద్వారా కొంత తీర్చుకున్నానని భావిస్తున్నా. రణబాలిగా విజయ్ దేవరకొండ ఎంత గొప్పగా పర్ ఫార్మ్ చేశాడో మీరంతా చూశారు. చిరంజీవి, బాలకృష్ణ గారు సీమ యాసను ఎంత అవలీలగా చెప్పారో విజయ్ గారు కూడా అలాగే చెప్పారు. ఆయన డైలాగ్స్ కు విజిల్స్ పడుతున్నాయి. అన్నారు

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - తెలుగు గడ్డ ఎంతో గొప్పది, అందమైనది, ఎంతో చరిత్ర ఉన్నది. రకరకాల పండుగలు, పద్దతులు, యాసలు, మనుషులు ఉన్న నేల మనది. నేను పుట్టిన తెలంగాణలో ఒక ఆవేశం ఉంటుంది, తిరగబడే పోరాటం ఉంటుంది, ఫోక్ సాంగ్స్ లో మజా ఉంటుంది. ఆంధ్ర వెళ్తే చక్కటి వాతావరణం, మంచి మనుషులు, ఆప్యాయత, వాళ్లు జరుపుకునే అందమైన పండుగలు, మంచి ఫోక్ సాంగ్స్ ఉంటాయి. సీమకు వస్తే రణబాలిలో రాయలు ఏలిన సీమ గడ్డ అంటూ ఒక పాట ఉంది. అది నాకు చాలా ఇష్టం. ఈ నాలుగు లైన్ల పాట మన సీమ ఎలాంటిదో చూపిస్తాయి. ఈ రాయలసీమ నాకు ఎంతో ఇచ్చింది. నేను చదువుకుంది ఇక్కడే. ఇక్కడ కొత్త చెరువు అనే ఊరిలో ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్ లో సినిమాలు చూశాను. ఇప్పుడు మా రణబాలి సినిమా అదే కొత్త చెరువు థియేటర్ లో హౌస్ ఫుల్స్ అవుతుంటే ఎంత అనందంగా ఉందో చెప్పలేను. నేను ప్రయాణం చేసిన అనంతపురం, కర్నూలు, కడప లోనే మా సినిమా షూటింగ్ చేశాం. చిత్రీకరణ సమయంలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేవి. రణబాలి సినిమాను ఒక నటుడిగా చేయలేదు. ఈ నేల కథను చెప్పాలనే బాధ్యతతో చేశాను. నాకు ఎంతో ప్రేమను పంచిన రాయలసీమ రుణం తీర్చుకోవాలనే కృతజ్ఞతతో రణబాలి సినిమా చేశాను. ఒక పెద్దాయన మా వీరుల కథ చెప్పావు బిడ్డా అని చేయి పట్టుకుని మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. మమ్మల్ని మేము తెరపై చూసుకున్నట్లు ఉందని మీరంతా చెబుతున్నారు. మీ ఆదరణతో వచ్చే తృప్తి ఏ డబ్బూ, ఏ అవార్డు ఇవ్వదు. రణబాలి సినిమాను మీరు ఇంతగా అక్కున చేర్చుకోవడం నటుడిగా నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది. తెలుగు సినిమా గర్వపడేలా రణబాలి ఉంటుందని చెప్పాను. ఆ మాటను మీరు నిజం చేశారు. రాహుల్ ఎంత గొప్ప సినిమా చేశాడో భవిష్యత్ లో అందరికీ అర్థమవుతుంది. జయమ్మపై మీరు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు నాపై పదేళ్లుగా ప్రేమ చూపిస్తున్నారు. ఇటీవల ఆ ప్రేమను మరింతగా చూస్తున్నా. అన్నారు

నటీనటులు - విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

టెక్నికల్ టీమ్
బ్యానర్ - మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ - గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ - నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో - చెర్రి
మ్యూజిక్ - అజయ్ - అతుల్
డీవోపీ - నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ - ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ - శివం రావు నాగసాని
ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ - కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ - అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ - విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ - యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ - రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ - కబిలన్ చెల్లయ్య


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved