TDP National Working President and AP Minister Nara Lokesh Praises Vijay Deverakonda’s “Ranabaali” Trailer
విజయ్ దేవరకొండ "రణబాలి" సినిమా ట్రైలర్ ను ప్రశంసించిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రివర్యులు నారా లోకేష్
“Ranabaali” is a grand pan-India film starring Vijay Deverakonda and Rashmika Mandanna in the lead roles. Directed by Rahul Sankrityan, the film is being made on a huge budget by producers Naveen Yerneni and Y. Ravi Shankar under the Mythri Movie Makers banner, with T-Series presenting it.
“Ranabaali” is gearing up for a grand worldwide theatrical release on October 16, coinciding with the Vijayadashami festival. The film’s trailer, released recently, has been receiving an overwhelming response and impressing audiences across the board.
Adding to the film’s growing buzz, TDP National Working President and Andhra Pradesh Minister Nara Lokesh has praised the trailer. In a social media post, he appreciated the authentic portrayal of 18th-century Rayalaseema and Vijay Deverakonda’s compelling performance as Ranabaali.
Responding to the trailer, Nara Lokesh said, “Just saw the trailer of #Ranabaali and wow, what an immersive experience! The detailing in recreating 1800s Rayalaseema and capturing that heart-wrenching era of British-era famine and oppression is phenomenal.
@TheDeverakonda looks effortlessly fierce and completely at home in the soil of Seema, brilliantly anchored by @iamRashmika. Kudos to @Rahul_Sankrityn and the entire team for bringing such a powerful, untold chapter of history to life. Wishing you all huge success on October 16.”
Cast: Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo and others.
Technical Team
Banner: Mythri Movie Makers
Presented by: Gulshan Kumar, Bhushan Kumar, T-Series Films
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar
Story and Direction: Rahul Sankrityan
Co-Producers: Anurag Parvathaneni, Shiv Chanan
CEO: Cherry
Music: Ajay–Atul
Cinematography: Nirav Shah, Jishnu Bhattacharjee
Writer: Pramod Tammineni
Production Designer: Shivam Rao Nagasani
Editor: Karthika Srinivas R.
Chief Executive Producer: R. Chandrasekhar
Executive Producer: Chembolu Sai Aditya
Choreography: Krithi Mahesh
Costume Designer: Archana Rao
Art Director: Vithal Kosanam
VFX Supervisor: Sunil Raju Chinta
Action Choreographers: Yannick Ben, Andy Long Nguyen, Rabin Subbu
Sound Designer: Raghunath Kemisetty
Publicity Designer: Kabilan Chelliah
విజయ్ దేవరకొండ "రణబాలి" సినిమా ట్రైలర్ ను ప్రశంసించిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రివర్యులు నారా లోకేష్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రతి ఒక్కరినీ "రణబాలి" మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రశంసించారు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రివర్యులు నారా లోకేష్. 18వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యాన్ని తెరపై ఎంతో సహజంగా ఆవిష్కరించారని, విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో ఆకట్టుకున్నారని సోషల్ మీడియా పోస్ట్ చేశారు.
నారా లోకేష్ తన పోస్ట్ లో స్పందిస్తూ - రణబాలి సినిమా ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ అద్భుతమైన అనుభూతిని కలిగించింది. 18వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యాన్ని ఎంతో సహజంగా క్రియేట్ చేసి తెరకెక్కించారు. బ్రిటీష్ కాలంలో ఏర్పడిన కరువు ఘటనను హార్ట్ టచింగ్ గా చూపించారు. సీమ కోసం పోరాడే బిడ్డగా విజయ్ దేవరకొండ రౌద్రపూరిత నటన ఆకట్టుకుంది. రశ్మిక బ్రిలియంట్ పర్ ఫార్మెన్స్ చేశారు. చరిత్ర మరుగున పడిన ఈ అధ్యాయాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, అతని టీమ్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ నెల 16న రిలీజ్ కు వస్తున్న రణబాలి సినిమాకు ఘన విజయం దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.