pizza

Ranabaali Couple Vijay Deverakonda and Rashmika Mandanna Meet Tamil Nadu CM Thalapathy Vijay
“రణబాలి” జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను కలిసిన తమిళనాడు సీఎం, థళపతి విజయ్

You are at idlebrain.com > news today >

12 October 2026
Hyderabad

Ahead of their film #Ranabaali release Star couple Vijay Deverakonda and Rashmika Mandanna met Tamil Nadu Chief Minister Thalapathy Vijay. Despite his busy schedule, CM Vijay warmly welcomed the couple and spent some special time with them.

During the meeting, they shared interesting thoughts about cinema, life, and the world. Pictures of CM Vijay’s meeting with Vijay Deverakonda and Rashmika Mandanna are now drawing attention on social media.

Sharing his happiness about the memorable meeting, actor Vijay Deverakonda expressed his feelings on social media.

Vijay Deverakonda said:

“Had the most beautiful time with Thalapathy, CM Vijay sir. Even amidst his busy schedule, he welcomed us with so much warmth and showered us with love. This one meeting with someone we admire so much will always remain a very special memory. Thank you, Vijay sir!”

Ranabaali is releasing worldwide on October 16.

“రణబాలి” జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను కలిసిన తమిళనాడు సీఎం, థళపతి విజయ్

తమ చిత్రం #Ranabaali విడుదలకు ముందు స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమిళనాడు ముఖ్యమంత్రి, థళపతి విజయ్‌ను కలిశారు. ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ సీఎం విజయ్ ఈ జంటకు ఆత్మీయ స్వాగతం పలికి, వారితో కొంత సమయం గడిపారు.

ఈ సమావేశంలో సినిమా, జీవితం, ప్రపంచానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ముగ్గురూ పంచుకున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలతో సీఎం విజయ్ సమావేశమైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ ప్రత్యేకమైన భేటీపై హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

విజయ్ దేవరకొండ స్పందిస్తూ..

“థళపతి, సీఎం విజయ్ గారితో ఎంతో అందమైన సమయాన్ని గడిపాను. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి, తన ప్రేమను పంచుకున్నారు. జీవితం, పని, ప్రపంచం గురించి ఎన్నో వ్యక్తిగత విషయాలను మాతో పంచుకున్నారు. ఆయనను ఒక్కసారి కలిసినప్పుడే మరింత అభిమానించే వ్యక్తిగా మారిపోయారు. ❤️

థ్యాంక్యూ విజయ్ సార్!” అని విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని పంచుకున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన #Ranabaali అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved