pizza

GMB Entertainment Presents, Satya Dev, Deepa Thomas, Venkatesh Maha, A+S Movies & SriChakraas Entertainments’ Rao Bahadur First Single O Sundari On April 15
జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రెసెంట్స్, సత్యదేవ్, దీపా థామస్, వెంకటేష్ మహా, ఏ+ఎస్ మూవీస్ & శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'రావు బహదూర్' ఫస్ట్ సింగిల్ 'ఓ సుందరి' ఏప్రిల్ 15న రిలీజ్

You are at idlebrain.com > news today >

09 April 2026
Hyderabad

Superstar Mahesh Babu and Namrata Shirodkar’s GMB Entertainment proudly present acclaimed filmmaker Venkatesh Maha’s upcoming film, Rao Bahadur, starring the versatile Satya Dev in the lead role. The film is jointly produced by A+S Movies and SriChakraas Entertainments, marking another ambitious venture for both banners, known for backing powerful, content-driven Telugu cinema. After the well-received teaser, the team has now shifted focus to the music.

The first single, O Sundari, composed by Smaran Sai, will be released on April 15th. To mark the announcement, the makers released a visually soothing poster featuring Satya Dev and Deepa Thomas in a calm, romantic setup. Satya Dev sports a retro-cool look with long hair and glasses, while Deepa appears elegant and composed. The soft backdrop and flowing curtain hint at a gentle, melodic love track.

Blending psychological intensity with the remnants of a vanishing aristocratic world, Rao Bahadur is envisioned as an immersive drama. Venkatesh Maha, who writes, directs, and edits the film, crafts a world rooted in Telugu culture yet designed to speak universally.

The film brings together a strong technical crew: Kartik Parmar handles the cinematography, Smaran Sai composes the score, and Rohan Singh shapes its intricate visual realm as production designer.

With top-tier producers, a distinct storyteller at the helm, and Satya Dev delivering one of his most transformative performances yet, the buzz around Rao Bahadur is quite positive.

Cast: Satya Dev, Vikas Muppala, Deepa Thomas, Bala Parasar, Anand Bharathi, Pranay Vaka, Master Kiran

Technical Crew:
Writer, Director, Editor: Venkatesh Maha
Presents: Mahesh Babu, Namratha Shirodkar’s GMB Entertainment
Producers: Chinta Gopalakrishna Reddy, Anurag Reddy & Sharath Chandra
Production Banners: A+S Movies and SriChakraas Entertainments
Ex-Producer: Dinesh Yadav B
DoP: Kartik Parmar
Music: Smaran Sai
Production Designer: Rohan Singh

జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రెసెంట్స్, సత్యదేవ్, దీపా థామస్, వెంకటేష్ మహా, ఏ+ఎస్ మూవీస్ & శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'రావు బహదూర్' ఫస్ట్ సింగిల్ 'ఓ సుందరి' ఏప్రిల్ 15న రిలీజ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా అందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బలమైన కథాంశాలతో, కంటెంట్‌ బేస్డ్ తెలుగు సినిమాలకు మద్దతుగా నిలిచే ఈ రెండు నిర్మాణ సంస్థలకు ‘రావు బహదూర్’ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత, టీం ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తున్నారు.

స్మరణ్ సాయి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ 'ఓ సుందరి' ఏప్రిల్ 15న విడుదల కానుంది. సత్యదేవ్, దీపా థామస్‌లను రొమాంటిక్ సెటప్‌లో ప్రజెంట్ చేసిన సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. సత్యదేవ్ పొడవాటి జుట్టు, కళ్ళద్దాలతో రెట్రో-కూల్ లుక్‌లో కనిపిస్తుండగా, దీప ఎంతో హుందాగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ సున్నితమైన లవ్ మెలోడీని సూచిస్తున్నాయి.

సైకలాజికల్ ఇంటన్సిటీ, కనుమరుగవుతున్న ఒక రాజరిక ప్రపంచపు అవశేషాలను కలగలిపిన ఎమోషనల్ డ్రామాగా ‘రావు బహదూర్’ రూపుదిద్దుకుంటోంది. రచయిత, దర్శకుడు, ఎడిటర్‌గా వెంకటేశ్ మహా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథని మలిచారు.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీని కార్తిక్ పరమార్ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని స్మరణ్ సాయి అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌ రోహన్ సింగ్.

అగ్రశ్రేణి నిర్మాతలు, ప్రత్యేకమైన కథన శైలితో కూడిన దర్శకుడు, అలాగే సత్యదేవ్ కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైన నటనను కనబరిచే పాత్రలో కనిపిస్తున్న 'రావు బహదూర్' పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం, ఎడిటర్: వెంకటేష్ మహా
సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర
ప్రొడక్షన్ బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బి
DoP: కార్తీక్ పర్మార్
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved