pizza

Rao Bahadur Press Meet
రావు బహదూర్ సైకాలజికల్ డ్రామా. మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా. ప్రేక్షుకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుంది: ప్రెస్ మీట్ లో హీరో సత్యదేవ్

You are at idlebrain.com > news today >

02 July 2026
Hyderabad

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ డ్రామా 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

రావు బహదూర్ గురించి ఒక్క లైన్‌లో చెప్పాలంటే?
వెంకటేష్ మహా:
స్పెక్టాక్యులర్. గ్రాండ్ లోకేషన్స్, భారీ సన్నివేశాలు... ఇవన్నీ ఒక గదిలోకి తీసుకొస్తే అదే 'రావు బహదూర్'.

సత్యదేవ్:
మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా. మహేష్ బాబు గారు కూడా ఇదే మాట చెప్పారు.

అనురాగ్:
ఇది సైకాలజికల్ డ్రామా. ఈ జానర్‌లో తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు.

ఈ సినిమా నుంచి ఆడియన్స్ ఏం ఆశించవచ్చు?
వెంకటేష్ మహా:
వైవిధ్యమైన సినిమాల్లో 'రావు బహదూర్' ప్రేక్షకులకు మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇది పూర్తిగా ఒరిజినల్ ఫిల్మ్. ఈ సినిమాకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. అందరూ ఓపెన్ మైండ్‌తో చూడాలని కోరుకుంటున్నాను.

-ఈ సినిమా నవ్విస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఆర్ట్ వర్క్ చూడొచ్చు.

-ఈ సినిమాలో నేను కూడా ఒక పాత్ర చేశాను. అది ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలి.

అనురాగ్:
ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా, ఓపెన్ మైండ్‌తో రావాలని కోరుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా కొత్త జానర్. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది.

శరత్ చంద్ర:
ఈ చిత్రంతో ప్రేక్షకులకు ఒక కొత్త డిష్‌ను పరిచయం చేస్తున్నాం. అది వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక కొత్త ప్రపంచాన్ని ఎక్స్ పీరియన్స్ చేస్తారు. ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది.

సత్యదేవ్ గారు... సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. విజయం సాధిస్తామనే నమ్మకమా?
-వంద శాతం విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సైకాలజికల్ డ్రామా. ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది.

-బుకింగ్స్ చాలా బాగా ఉన్నాయి. యూఎస్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే 100కే దాటాయి. ఇప్పటివరకు నా సినిమాలు ఓవర్సీస్‌లో సాధించిన కలెక్షన్లను ఈ సినిమా ప్రీ-సేల్స్‌తోనే దాటేసింది. అన్ని విధాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా నా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది.

మహా గారు... ఈ సినిమాను సినాప్సిస్‌లా చెప్పాలంటే?
టీజర్‌లో చూపించినట్టుగా... రావు బహదూర్ తన జీవితంలోని చివరి దశలో ఉంటాడు. అతనికి అనారోగ్యం ఉంటుంది. మరికొద్ది రోజులే జీవితం అని డాక్టర్లు చెబుతారు. కానీ అతనికి ఒక కోరిక ఉంటుంది. తన చుట్టూ ఉన్న వారి సైకాలజీతో ఆడుకుంటూ తన కోరికను ఎలా నెరవేర్చుకుంటాడనేదే కథ.

-ఇది కాంప్లికేటెడ్ కథ కాదు. అందరికీ సులభంగా అర్థమయ్యే కథ. ఊహాశక్తి పరంగా చాలా రిచ్‌గా ఉంటుంది. ఇది అచ్చ తెలుగు సినిమా. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. 'రావు బహదూర్' అందరికీ గుర్తుండిపోతుంది.

శరత్ గారు... జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా చేయడం ఎలా అనిపించింది?
మహేష్ బాబు గారితో మాకు 13 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన ఎప్పుడూ మా మంచి కోరుకుంటారు. 'రావు బహదూర్'ను ఆయనతో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఆయన కిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది. హీరోగా ఆయన నుంచి ఈ ఏడాది సినిమా విడుదల కావడం లేదు. అందుకే దీన్ని ఆయన సినిమాలాగే భావిస్తున్నాం. ఇది మాకు గర్వకారణం. అదే సమయంలో పెద్ద బాధ్యత కూడా.

గోపాలకృష్ణ గారు... మీరు ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడానికి కారణం?
అద్భుతమైన కథ. మహా చాలా గొప్పగా తీశారు. సత్యదేవ్, మహా ఇద్దరూ ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేసే వారు. మహేష్ బాబు గారి సమర్పణలో సినిమా చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.

మహా గారు... మహేష్ గారు ఈ కథను ఎప్పుడు విన్నారు?
-నా కథ విని మొదటి చెక్ ఇచ్చింది మహేష్ గారే. ఆయన వచ్చిన తర్వాతే ఈ సినిమా మొదలైంది. మహేష్ గారు ఒక ప్రజెంటర్‌గా చేయాల్సిన దానికంటే రెండువందల రెట్లు ఎక్కువ చేశారు.

కమల్ హాసన్ గారికి ఈ సినిమా చూపిస్తున్నారా?
శరత్:
కమల్ హాసన్ గారిని సంప్రదించాం. ప్రస్తుతం ఆయన ప్రయాణంలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా చూపిస్తాం. ఈ సినిమా చూసి ఆయన చాలా గర్వపడతారని నమ్ముతున్నాం.

శరత్ చంద్ర:
సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి. దయచేసి స్పాయిలర్స్ ఇవ్వొద్దు. కథను రివీల్ చేయకండి. సినిమా చూసొచ్చిన ప్రేక్షకులతోనే మీ అనుభూతులను మాత్రమే పంచుకోండి.

వెంకటేష్ మహా:
ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడండి. మీరు కనీవినీ ఎరుగని విన్యాసాలు ఇందులో ఉన్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
Energetic Star Ram Pothineni’s Most Ambitious Project #RAPO23, Produced By Krishna Pothineni On Rapo Cinematics, Grand Launch TomorrowEnergetic Star Ram Pothineni’s Most Ambitious Project #RAPO23, Produced By Krishna Pothineni On Rapo Cinematics, Grand Launch Tomorrow