`
pizza

Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Teaser On March 6th
మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ, అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ “రావణాసుర” టీజర్ మార్చి 6న విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

1st March 2023
Hyderabad

Mass Maharaja Ravi Teja who is in full swing with consecutive blockbusters will next be seen in an action thriller Ravanasura under the direction of creative director Sudheer Varma. Abhishek Nama and Ravi Teja are jointly producing the movie that also stars Sushanth in a vital role.

Sudheer Varma’s perfect planning made sure the shooting part wrapped up in the scheduled time. Currently, post-production works are underway. Interim, the makers announced to release the teaser on March 6th at 10:08 AM. The announcement has been made through this intense poster where Ravi Teja appears in a trendy, yet ferocious look.

Ravanasura is being mounted on a large scale with high production values. Harshavardhan Rameshwar and Bheems Ceciroleo scored the music and the two songs of the movie became superhits.

The cinematography is by Vijay Kartik Kannan, while Naveen Nooli is the editor. Srikanth Vissa penned a first-of-its-kind story, wherein Sudheer Varma with his mark taking is making the movie a stylish action thriller with some unexpected twists and turns in the narrative.

The movie is getting ready for release on April 7th as one of the biggest attractions of the summer.

Cast: Ravi Teja, Sushanth, Sriram, Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar, Poojitha Ponnada, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Nitin Mehta (Akhanda fame), Satya, Jaya Prakash and others.

Technical Crew:
Screenplay, Direction: Sudheer Varma
Producer: Abhishek Nama, Ravi Teja
Banner: Abhishek Pictures, RT Teamworks
Story & Dialogues: Srikanth Vissa
Music: Harshavardhan Rameswar, Bheems Ceciroleo
DOP: Vijay Kartik Kannan
Editor: Naveen Nooli
Production Designer: DRK Kiran

మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ, అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ “రావణాసుర” టీజర్ మార్చి 6న విడుదల

వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “రావణాసుర” లో కనిపించనున్నాడు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డైరెక్టర్ సుధీర్ వర్మ షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టీజర్ ను మార్చి 6వ తేదీన ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ ట్రెండీగా, క్రూయల్ లుక్ లో కనిపిస్తున్న ఇంటెన్స్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ అనౌన్సుమెంట్ చేశారు.

భారీ నిర్మాణ విలువలతో రావణాసుర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుండి వచ్చిన రెండు పాటలు టెర్రిఫిక్ రెస్పాన్స్ తో మిలియన్స్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో ఉన్నాయి.

శ్రీకాంత్ విస్సా యూనిక్ కథని అందించారు, సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్ తో కథనంలో కొన్ని ఊహించని మలుపు లతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు.

సమ్మర్ లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ లో ఒకటైన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: రవితేజ, సుశాంత్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, RT టీమ్వర్క్స్
కథ & సంభాషణలు: శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
DOP: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: DRK కిరణ్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved