వరుస బ్లాక్‌బస్టర్స్‌తో అలరిస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘రియాలిటీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక మంచి ఎంటర్‌టైనర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. గ్లింప్స్‌కు ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మంచి స్పందన రాగా, ఫస్ట్ సింగిల్ భజ గోవిందం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. జీవితంలో చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలనే అందమైన భావనతో రూపొందిన ఈ పాట శ్రోతలకు వెంటనే కనెక్ట్ అయి వైరల్‌గా మారింది.
ఇప్పుడు మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను మరోస్థాయికి తీసుకెళ్తూ మేకర్స్ రెండో సింగిల్ ‘రుత్తూ’ను విడుదల చేశారు. ఈ పాట ‘రియాలిటీ’లోని రొమాంటిక్ కోణాన్ని అందంగా ఆవిష్కరిస్తుంది. వినసొంపైన మెలోడీగా, మనసుకు హాయినిచ్చేలా ఈ పాట సాగుతుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం కొత్త అనుభూతిని ఇస్తుంది. అద్భుతమైన ఇన్‌స్ట్రుమెంటేషన్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. పూర్ణాచారి రాసిన సాహిత్యం కవితాత్మకంగా సాగుతూ, తన ప్రేయసిపై హీరోకు ఉన్న ప్రేమను, ఆమెతో ఉన్నప్పుడు కలిగే ఆనందాన్ని, ప్రతి క్షణం ఆమెతోనే గడపాలనే ఆరాటాన్ని అందంగా ఆవిష్కరించింది. ప్రేమలోని భావాలను వ్యక్తపరిచిన తీరు మరింత అందంగా చూపిస్తుంది.
కపిల్ కపిలన్ బ్యూటీఫుల్ వోకల్స్ పాటకు మరింత ప్రాణం పోశారు. ఎం. షరీఫ్ చేసిన గ్రేస్‌ఫుల్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంది. చాలా సింపుల్ మూవ్‌మెంట్స్ కూడా ఎంతో అందంగా కనిపించాయి. ముఖ్యంగా పాటలోని క్యాచీ హుక్ స్టెప్ సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్‌లో ట్రెండ్ అయ్యేలా ఉంది.
కిరణ్ అబ్బవరం తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. పక్కింటి కుర్రాడిలా కనిపించే పాత్రలో తనదైన చార్మ్‌తో ఆకట్టుకున్నారు. దేవిక భట్ అందంగా కనిపిస్తూ, తన స్క్రీన్ ప్రెజెన్స్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటకు మరింత మ్యాజిక్ తీసుకొచ్చారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కిరణ్ తన ఆనందాన్ని వ్యక్తపరచడం, దేవికకు పానీపూరీ తినిపించడం వంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఎంతో ముచ్చటగా అనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేమకథలోని మ్యాజిక్ ప్రేక్షకులకు ఒక అందమైన అనుభూతిని అందిస్తుంది.
మొత్తంగా ‘రుత్తూ’ విజువల్స్ పరంగా కూడా ఒక మంచి మ్యాజికల్ ట్రీట్. వెంటనే ఆకట్టుకునే మెలోడీ, క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్‌తో ఈ పాట ఫస్ట్ సింగిల్‌లాగే మరోసారి వైరల్ కానుంది. ‘రియాలిటీ’ మ్యూజికల్ ప్రమోషన్స్ వరుసగా ఆకట్టుకుంటుండటం చూస్తుంటే, ఈ సినిమా ప్రతి విషయంలోనూ కిరణ్ అబ్బవరం ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థమవుతోంది.
ఈ సినిమాలో శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, రాజేష్ కామార్సు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ‘రియాలిటీ’ చిత్రం డిసెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో, డైరెక్టర్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. . ‘ఎస్‌ఆర్ కళ్యాణ మండపం’ తర్వాత మరో మంచి కథ చెప్పాలని ఎప్పుడూ ఉండేది. కంటిన్యూగా నేను హీరోగా చేస్తున్న సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. మీరందరూ నన్ను అభిమానిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా సరే, నేను కోరుకున్న దానికంటే ఎక్కువ అభిమానం, ప్రేమ దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చాలా ప్రేమ, ఆదరణ లభించింది. అందుకే ఒక మంచి ఫ్యామిలీ కథ చేయాలనిపించింది. కుటుంబం అంతా కలిసి ఇలాంటి ఒక సినిమా చూస్తే బాగుంటుందనిపించి ఈ కథ రాశాను. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్‌ను ఆడియన్స్ చాలా అద్భుతంగా ఆదరించారు.. అలాగే ‘భజగోవిందం’ పాట కూడా అందరికీ నచ్చింది. ‘రుత్తు’ పాట కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను.‘భజగోవిందం’ పాటను సనారే అద్భుతంగా రాశారు. ఆ పాట నచ్చితే ‘రియాలిటీ’ సినిమా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే పూర్ణాచారి ఈ రెండో పాటకు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. భీమ్స్ అన్న ప్రతి పాటను అద్భుతంగా చేశారు. మేము అడిగిన దానికంటే ఇంకా బాగా ఇచ్చారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఔట్‌పుట్ పరంగా, బిజినెస్ పరంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. డిసెంబర్ 25న సినిమాను రిలీజ్ చేస్తున్నాము. మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. ‘భజగోవిందం’ పాటను ఇంత అద్భుతంగా ఆదరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీరంతా హ్యాపీగా థియేటర్లకు వెళ్లండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు.
ప్రొడ్యూసర్ సుధాకర్ చాగంటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇరవై ఏళ్ళుగా పరిశ్రమలో ఉన్నాము. సినిమా చేయాలని అనుకున్నప్పుడు మంచి కుటుంబ విలువలతో కూడిన కథ చేయాలని భావించాము. కిరణ్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. 53 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాము. చాలా అద్భుతమైన క్వాలిటీతో సినిమా వచ్చింది. ప్రతి డైలాగ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలా అద్భుతంగా రాశారు. నా తొలి సినిమాను కిరణ్ అబ్బవరం హీరో, ఆయన దర్శకత్వంలో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘భజగోవిందం’ పాట ప్రతి ఇంటికీ చేరువైంది. చాలామంది తమ స్టేటస్‌లో కూడా పెట్టుకుని అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా విలువ ఉన్న కథ ఇది. ఆ కథకు తగ్గట్టుగానే ఆ పాటను చేశాము. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా మంచి పాటలు ఉన్నాయి. మంచి మంచి కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయి. ఆల్బమ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. బిజినెస్ కూడా క్లోజ్ అయింది. డిసెంబర్ 25వ తేదీన సినిమాను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాము.
హీరోయిన్ దేవికా మాట్లాడుతూ.. ఇది నా తొలి సినిమా. నాకు చాలా ప్రత్యేకమైనది. బిగ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ‘భజగోవిందం’ పాట చాలా పెద్ద హిట్ అయింది. రెండో పాటకు కూడా మీ నుంచి అలాంటి ఆదరణ లభిస్తుందని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సినిమాలో పని చేసే అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. అందరూ మా సినిమాను థియేటర్లలో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
డీవోపీ విశ్వాస్ డానియల్ మాట్లాడుత.. ఇప్పటికే మీరు ‘భజగోవిందం’ పాట చూశారు. సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఉంటుంది. కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది మనందరం రిలేట్ చేసుకునే కథ. ఈ సినిమాలో ఆయనలోని రచయిత నాకు ఎంతగానో నచ్చారు. ఇలాంటి కథను అందరూ రాయలేరు. ఇలాంటి అద్భుతమైన కథను తీసుకొస్తున్న కిరణ్ గారికి ధన్యవాదాలు.
లిరిక్ రైట పూర్ణాచారి మాట్లాడుతూ.. సనారే రాసిన ‘భజగోవిందం’ పాట చాలా పెద్ద హిట్ అయింది. రెండో పాట రాసే బాధ్యతను నాకు కిరణ్ అబ్బవరం గారు ఇచ్చారు. ప్రేమలో ఒక మ్యాజిక్‌ను క్రియేట్ చేసేలా ఈ పాటను రాయడం జరిగింది. ‘రియాలిటీ’ మన ఇంటి కథ, మనందరి కథ. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
లిరిక్ రైటర్ సనారే మాట్లాడుతూ.. ఇందులో ‘భజగోవిందం’ పాట రాశాను. ఆ పాట అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇదొక హై మూమెంట్. ‘భజగోవిందం’ పాట నాకు ఒక విజిటింగ్ కార్డులా మారింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన హీరో కిరణ్ అన్నకి చాలా రుణపడి ఉంటాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
The #Rutthuu song from #Reality is another potential chartbuster!
Beautifully sung by Kapil Kapilan, with pleasing music by Bheems, simple yet effective lyrics by Purnachary (Premalo (Court) fame) the song beautifully captures the male lead’s feelings for the female lead. The visuals are equally appealing.
Kiran Abbavaram has a knack for picking the right music for his films, and this song is yet another example. 👌
Devika Bhatt looks like a promising new addition to the list of talented and beautiful actresses making their Telugu debut. 👍
https://t.co/2QlallVnxB