pizza

I will write a review after watching the film Revu: Top Producer Dil Raju at the trailer launch event
‘రేవు’ చిత్రాన్ని చూసి నేను రివ్యూ రాస్తా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు

You are at idlebrain.com > news today >

17 August 2024
Hyderabad

The movie Revu stars Vamsi Ram Pendyal, Ajay, Swathi Bheemireddy, and Epuri Hari in the lead roles. Produced by Dr. Murali Ginjupalli and Naveen Parupalli under the banners of Samhith Entertainments and Parupalli Productions, the film is directed by Harinath Puli. The film is set for its theatrical release on August 23rd. The trailer was launched on Friday, with Dil Raju attending as the chief guest.

While speaking at the event, Dil Raju said, "Newcomers always experiment with new faces. However, 99% of such experiments fail, with only 1% succeeding. Murali has worked with new faces in this film. We have come here for Prabhu and Parvathaneni Rambabu, who are part of the project. It’s not great thing to make a film. But what really important is bringing the audience to the theaters. The concept of Revu seems good. Rambabu and Prabhu are very close to me. They talked about this film, and since they are associated with it, I wanted to take the lead in promoting the movie. Until now, they have watched the film and written reviews. Now, they have made the film, so I will write the review after watching it."

Director Kodanda Ramireddy said, "Murali has been known to me for a long time. He watched Revu and bought it. I hope this movie achieves great success."

Journalist Prabhu shared, "I have seen the film. We were thinking about how to take it forward when NRI producer Murali came into the picture. He also watched the film and came forward to release it. This film stands as an example of how a wonderful movie can be made with a low budget and limited resources. Director Harinath Puli has grabbed the best work from everyone. Even the censor board appreciated the film."

Producer Murali expressed, "I thank Rambabu and Prabhu for showing me such a good film. It was because of them that my film journey started. Every character in Revu connects with the audience. Rama Satya Narayana watched our film and liked it a lot. DS Rao also watched and appreciated our movie. Thanks to Kodanda Ramireddy, who came to support the movie. It’s a pleasure to have the legendary director Relangi Narasimha Rao, who has delivered many hits, bless us at our event. Thanks to everyone who came to our trailer launch event. Our film releases on August 23. Please watch it."

Producer Rama Satya Narayana said, "Currently, small films are turning out to be hits. Last week, Committee Kurrollu did well, and this week, Aay received a super hit talk. Next week, Revu will do well. Parvathaneni Rambabu and Prabhu took part in a very high-quality film. Dil Raju and Asian Cinemas are releasing it grandly. Good films always receive audience support. I am confident this film will be a big success."

Prasanna Kumar commented, "Journalist Prabhu and Parvathaneni Rambabu are the reason so many guests attended. Watching Revu felt like watching Rangasthalam. It seems like a great film."

Damodhara Prasad said, "Prabhu and Rambabu have been in the industry for many years. Their judgment is always accurate. Rama Satya Narayana has watched the film and praised it highly. All the best to the film team."

Bharat Bhushan stated, "The Revu trailer is very good. I hope this film becomes a major hit."

DS Rao said, "Taking on a story like Revu is a challenge. It’s heartening to see so much support for a film about the lives of fishermen. Murali is pushing this film forward with great courage. It’s a very different film. I hope it brings in good profits."

Relangi Narasimha Rao said, "Thanks to Murali, Rambabu, and Prabhu for choosing a story like Revu. Good films are not reaching audiences these days. With Prabhu and Rambabu behind this film, there’s no doubt it will be a hit. The new team has made this film wonderfully. The director has extracted excellent performances from the actors. I hope this movie achieves great success."

Actor Pradeep remarked, "Revu has impressive performances from everyone. The director's approach, the way the songs were composed, and the camera shots are all excellent. I believe this film will achieve great success."

The movie is up for release on the 23rd of this month.

‘రేవు’ చిత్రాన్ని చూసి నేను రివ్యూ రాస్తా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘కొత్త వాళ్లు.. కొత్త వాళ్లతో ప్రయోగం చేస్తూనే ఉంటారు. కానీ 99 శాతం ఫెయిల్యూర్.. వన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది. మురళీ వంటి వారు కొత్త వాళ్లతో సినిమాను చేశారు. కానీ ప్రభు, పర్వతనేని రాంబాబు వంటి వారు ఉండటం వల్లే మేం అంతా ఇక్కడకు వచ్చాం. ఇలాంటి సినిమాను తీయడం గొప్ప కాదు.. ప్రేక్షకుడ్ని థియేటర్ వరకు తీసుకు రావడం గొప్ప విషయం. రేవు కాన్సెప్ట్ బాగుంది. రాంబాబు, ప్రభు నాకు చాలా మంచి సన్నిహితులు. వారు ఈ చిత్రం గురించి చెప్పారు. వీళ్లు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి.. నేను ముందుండి నడిపించాలని అనుకున్నాను. ఇంత వరకు వీళ్ళు సినిమాని చూసి రివ్యూ రాశారు. ఇప్పుడు వీళ్ళు సినిమాను తీశారు. కాబట్టి వీళ్ళ సినిమాని చూసి నేను రివ్యూ రాస్తా’ అని అన్నారు.

దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘మురళీ నాకు ఎంతో కాలం నుంచి పరిచయం. రేవు చిత్రాన్ని చూసి ఆయన కొన్నారు. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ‘సినిమాను నేను చూశాను. దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని అనుకున్నారు. ఆ టైంలోనే ఎన్నారై నిర్మాత మురళీ గారు పరిచయం అయ్యారు. వారు కూడా ఈ సినిమాను చూసి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. తక్కువ బడ్జెట్‌లోనే, ఉన్న పరిమితులతో ఎంత అద్భుతంగా సినిమాను తీయవచ్చు అనే దానికి ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. డైరెక్టర్ హరినాథ్ అందరి వద్ద నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. సెన్సార్ వాళ్లు కూడా సినిమాను చూసి మెచ్చుకున్నారు.

నిర్మాత మురళీ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని నాకు రాంబాబు గారు, ప్రభు గారు చూపించారు. ఇంత మంచి చిత్రాన్ని నాకు చూపించిన వారికి థాంక్స్. వారి వల్లే నా ఈ సినీ జర్నీ మొదలైంది. రేవు సినిమాలోని ప్రతీ పాత్ర ఆడియెన్స్‌తో పాటుగా ఇంట్లోకి వెళ్తుంది. మా సినిమాను రామ సత్యనారాయణ గారు చూశారు. ఆయనకు చాలా నచ్చింది. డీఎస్ రావు గారు కూడా మా మూవీని చూసి మెచ్చుకున్నారు. మేం అడిగిన వెంటనే మాకోసం వచ్చిన కోదండ రామిరెడ్డి గారికి థాంక్స్. రేలంగి నరసింహారావు ఎన్నో హిట్ చిత్రాలను ఇచ్చారు. అలాంటి దర్శకుడు మా ఈవెంట్‌కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. మా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్. ఆగస్ట్ 23న మా చిత్రం రాబోతోంది. అందరూ వీక్షించండి’ అని అన్నారు.

నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం చిన్న చిత్రాలు హిట్ అవుతున్నాయి. గత వారం కమిటీ కుర్రోళ్లు, ఈ వారం ఆయ్ హిట్ అయింది. వచ్చే వారం రేవు ఆడుతుంది. పర్వతనేని రాంబాబు, ప్రభు చాలా క్వాలిటీ ఉన్న చిత్రాన్ని తీసుకున్నారు. దిల్ రాజు, ఏసియన్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతోంది. చాలా గ్రాండ్‌గా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మంచి చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది’ అని అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు వల్లే ఇంత మంది గెస్టులుగా వచ్చారు. రేవు చూస్తుంటే.. రంగస్థలం చూసినట్టుగా అనిపించింది. ఇది చాలా గొప్ప చిత్రం అవుతుందనిపిస్తుంది’ అని అన్నారు.

దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ప్రభు, రాంబాబు గారు ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ల జడ్జ్మెంట్ కరెక్ట్‌గానే ఉంటుంది. మా రామ సత్యనారాయణ సినిమా చూశారు. మూవీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

భరత్ భూషణ్ మాట్లాడుతూ.. ‘రేవు ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డీఎస్ రావు మాట్లాడుతూ.. ‘రేవు కథను తీసుకోవడమే ఒక ఛాలెంజ్. మత్స్యకారుల జీవితం మీద తీసిన ఈ చిత్రానికి ఇంత మంది సపోర్ట్ లభించడం ఆనందంగా ఉంది. మురళీ గారు ఈ సినిమాను ఎంతో ధైర్యంతో ముందుకు తీసుకు వస్తున్నారు. ఇది చాలా డిఫరెంట్ చిత్రం. ఈ సినిమాకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రేలంగి నర్సింహారావు మాట్లాడుతూ.. ‘రేవు లాంటి కథను తీసుకున్న మురళీ గారు, రాంబాబు గారు, ప్రభు గారు థాంక్స్. మంచి చిత్రాలు ఈ మధ్య ఆడియెన్స్ వరకు రీచ్ అవ్వడం లేదు. ఇలాంటి సినిమాను ప్రభు గారు, రాంబాబు గారు తీసుకున్నారంటే కచ్చితంగా హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. కొత్త వాళ్లంతా కలిసి అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నటీనటుల నుంచి దర్శకుడు మంచి నటనను రాబట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.

నటుడు ప్రదీప్ మాట్లాడుతూ.. ‘రేవు సినిమాలో అందరూ అద్భుతంగా నటించారని అనిపిస్తోంది. డైరెక్టర్ గారు తీసిన విధానం, పాటలు రాసిన విధానం, కెమెరా మెన్ పెట్టిన షాట్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని’ అన్నారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved