pizza

RGV Apologizes to the Child Actress from Shiva
'శివ' లో బాలనటికి సారీ చెప్పిన ఆర్జీవీ..

You are at idlebrain.com > news today >

12 November 2025
Hyderabad

It’s well known that Akkineni Nagarjuna’s Shiva created a storm at the box office 36 years ago. The film revolutionized Telugu cinema with its realistic action, sound design, and visual style, inspiring an entire generation of young audiences. It also marked Ram Gopal Varma’s directorial debut, introducing cinematic techniques that were far ahead of their time.

As Shiva 4K is set for re-release on November 14, RGV shared an emotional post on social media recalling an incident from the original shoot. He posted a photo of Sushma Anand, who played Nagarjuna’s sister as a child actress in Shiva, and issued a heartfelt apology to her.

In the post, RGV explained that during a high-speed chase sequence—where Nagarjuna rides a bicycle with a little girl seated in front while being chased by goons. Sushma, who was just a small child then, was terrified during the shoot. RGV admitted - "please accept my sincere apologies after 36 years for subjecting you to such a traumatic experience which I dint realise at that time ..The directorial greed in me took over in being blinded to subjecting a little girl like you to such risky shots ..I apologise once again".

Tagging her current profile, he wrote that he now realizes how selfish and insensitive he had been at that time, and sincerely apologized to her.

Interestingly, Sushma Anand, the same child actress from Shiva, is now based in the United States, pursuing research in Artificial Intelligence and Cognitive Science.

'శివ' లో బాలనటికి సారీ చెప్పిన ఆర్జీవీ..

అక్కినేని నాగార్జున నటించిన 'శివ' సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించిన సంగతి చాలామందికి తెలిసిందే. 36 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ పెను దుమారమే లేపింది. ఒకరకంగా చెప్పాలంటే యూత్ ఊగిపోయింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఇది మొదటి సినిమా అయినా అప్పటివరకూ తెరపై చూడని ఎన్నో విన్యాసాలను ఈ సినిమా ప్రేక్షకులకు పరిచయం చేసిందనే చెప్పుకోవచ్చు. సంగీతం, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అన్నింటిలోనూ ఓ కొత్త ఒరవడిని సృష్టించింది ఈ సినిమా.

'శివ4K' పేరిట 'శివ' సినిమా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు మళ్లీ రాబోతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ పోస్టులో 'శివ' లో బాలనటిగా నటించిన సుష్మ ఆనంద్ ఫోటోను జోడిస్తూ ఆమెకు క్షమాపణ చెప్పారు. వివరాల్లోకి వెళ్తే ముప్పై ఆరేళ్ల క్రితం వచ్చిన 'శివ' లో నాగార్జున అన్నయ్య కూతురి పాత్రలో సుష్మ ఆనంద్ నటించడం జరిగింది. ఆ సినిమాలో నాగార్జునను విలన్లు వెంటపడే ఓ సన్నివేశంలో సైకిల్ ముందు ఓ పాపను కూర్చోబెట్టుకొని నాగార్జున వేగంగా దూసుకుపోతూ ఉంటారు. అప్పుడు ఓ చిట్టి పాపగా ఆ రిస్కీ సన్నివేశంలో నటించిన సుష్మ ఎంతో భయపడి ఉంటుందని, కాకపోతే స్వార్ధంగా, ఓ మంచి దర్శకుడవ్వాలన్న అత్యాశతో ఆరోజు అవన్నీ తెలుసులేకపోయానంటూ ఆమె ట్విట్టర్ ఖాతాను జోడిస్తూ ఆమెకు క్షమాపణలు చెప్పారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ముప్పై ఆరేళ్ల క్రితం బాలనటిగా నటించిన సుష్మ ఇప్పుడు యూఎస్ లో AI మరియు కాగ్నిటివ్ సైన్స్ లో రీసెర్చ్ చేస్తున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved