pizza

Youthful Entertainer “Romanchakam” Now Streaming on Netflix
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "రోమాంచకం"

You are at idlebrain.com > news today >

02 October 2026
Hyderabad

Presented by blockbuster director Sandeep Reddy Vanga and produced under the Bhadrakali Pictures banner, “Romanchakam” stars Sumanth Prabhas and Ananthika Sanilkumar in the lead roles. Produced by Pranay Reddy Vanga, the film marks the directorial debut of Venugopal Reddy.

“Romanchakam” received a strong response from audiences across all sections during its theatrical run and emerged as a successful entertainer. The film’s blend of romance, humour and suspense struck a chord with both mass and class audiences, who thoroughly enjoyed its entertaining elements. Now, “Romanchakam” has begun its digital journey on Netflix.

“Romanchakam” is streaming on Netflix from today. The film is available in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi. Audiences who missed the film in theatres can now enjoy it on Netflix. With its digital release, the film is set to reach an even wider audience across languages.

Cast: Sumanth Prabhas, Ananthika Sanilkumar, Upendra Limaye, Venkatesh Kakumanu, Narendra Ravi, Mani, Sohan, and others

Technical Team:
DOP: Pawan Pappula
Music: Vasuki Vaibhav
Publicity Designer: Anil Bhanu
Marketing: Walls and Trends
Banner: Bhadrakali Pictures
Presenter: Sandeep Reddy Vanga
Producer: Pranay Reddy Vanga
Written & Directed by: Venugopal Reddy

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "రోమాంచకం"

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందించారు. థియేట్రికల్ గా "రోమాంచకం" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొంది ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలోని ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఎలిమెంట్స్ ను మాస్, క్లాస్ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోనూ "రోమాంచకం" సందడి మొదలైంది.

నేటి నుంచి "రోమాంచకం" మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. థియేట్రికల్ గా "రోమాంచకం" మిస్ అయిన ఆడియెన్స్ నెట్ ఫ్లిక్స్ లో మూవీని ఎంజాయ్ చేయొచ్చు. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా మరింతమంది ప్రేక్షకులకు చేరువకాబోతోంది.

నటీనటులు - సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ - పవన్ పప్పుల
మ్యూజిక్ - వాసుకి వైభవ్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
మార్కెటింగ్- వాల్స్ అండ్ ట్రెండ్స్
బ్యానర్ - భద్రకాళీ పిక్చర్స్
ప్రెజెంటర్ - సందీప్ రెడ్డి వంగా
ప్రొడ్యూసర్ - ప్రణయ్ రెడ్డి వంగా
రచన, దర్శకత్వం - వేణుగోపాల్ రెడ్డి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved