The makers of Rules Ranjann, starring Kiran Abbavaram and Neha Shetty, dropped the film’s trailer on Friday. The project marks the return of Rathnam Krishna to the director’s saddle after Gopichand-starrer damp squib Oxygen, while Divyang Lavania and Murali Krishnaa Vemuri are producing it under Star Light Entertainment, with AM Ratnam presenting it.
The two-minute-44-second long clip opens with Manoranjan (played by Kiran Abbavaram) a stickler for rules who leads an orthodox life in Mumbai as a software employee. The security guard at his office describes Manoranjan as a dangerous guy because of his rules. Ranjann’s mundane life turns upside down when he meets his old school friend Sana (Neha Shetty) in a chance encounter. Their conversation veers towards other things and soon she asks him for a treat. How about one at a chaat stall? Ranjann says. She demands a treat at a pub. Soon, Rules Ranjann transforms into Pub Ranjann much to the shock of his colleagues at his office. He flouts his rules and is addicted to sharing a peg or two with Sana in no time. Sana sweeps him off his feet but he is in a dilemma to proceed forward or not because she behaves as if she knows him for a decade when she boozes and when she doesn’t, she acts as if she just met him. The trailer is also peppered with a hilarious reference to Neha Shetty’s popular Radhika act from DJ Tillu while she sits in a marriage mandap about to exchange wedding vows with Ranjann. Will Ranjann win Sana or not in the end seems to form the gist.
Overall, the trailer promises unlimited fun with whacky scenarios and weird moments thrown into the mix, while the cheeky one-liners by Ranjann’s friends (Vennela Kishore, Hyper Aadi, Harsha Chemudu and Sudharshan) land. Kiran Abbaravarm is spot on with his sense of comic timing while Neha Shetty oozes a lot of oomph and glamour. Together, their chemistry is scintillating.
Also featuring Annu Kapoor, Ajay, Abhimanyu Singh, Goparaju Ramana, Atul Parchure, Vijay Patkar and Makarand Deshpande in supporting roles, Rules Ranjann blazes into cinemas on September 28.
ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం, నేహా శెట్టిల 'రూల్స్ రంజన్' ట్రైలర్.. వంద శాతం వినోదం గ్యారెంటీ
సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం 'రూల్స్ రంజన్'. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలను అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
'రూల్స్ రంజన్' ట్రైలర్ ను ఈరోజు(సెప్టెంబర్ 8) ఉదయం 11:22 గంటలకు విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తండ్రి పాత్రధారి గోపరాజు రమణ "ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?" అని అడగగా.. కథానాయకుడు కిరణ్ అబ్బవరం "బీర్ ఓకే" అని చెప్పే సంభాషణతో ట్రైలర్ సరదాగా ప్రారంభమైంది. "సన్నీ లియోన్ హస్బెండ్ నాకు ఇన్ స్పిరేషన్", "పెళ్ళయితే మీ పెళ్ళాలకు ప్రెగ్నెన్సీ రావాల్సింది, మీకు వచ్చింది ఏంటి?" వంటి వరుస మాటల తూటాలతో 100 శాతం వినోదం గ్యారెంటీ అనే నమ్మకం కలిగిస్తోంది. నాయకానాయికల మధ్య సన్నివేశాలు కూడా హాస్యంతో కూడి మెప్పిస్తున్నాయి. కలిసి కాలేజ్ లో చదువుకున్న వారు చాలాకాలం తరువాత కలవడం, సనా(నేహా)ని మెప్పించడానికి రూల్స్ రంజన్ లా ఉండే మనో రంజన్ కాస్తా పబ్ రంజన్ గా మారడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అసలు రూల్స్ రంజన్, పబ్ రంజన్ గా ఎందుకు మారాడు? మందు వల్ల అతని ప్రేమకి, స్నేహానికి వచ్చిన సమస్య ఏంటి? అతని ప్రేమ ఫలించిందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది ట్రైలర్. అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన ప్రతిభ కనబరుస్తున్నారు. అలాగే ట్రైలర్ లో విజువల్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దులీప్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ గా ఎం. సుధీర్ వ్యవహరిస్తున్నారు.
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్