pizza

Experience The Emotion Of Sahaa- A Timeless Melody Kaalanne Thiragesi From Nishanth Doti, Sumaira Studios' Emotional Drama Sahaa (Life of Sanju) Unveiled
'సహ' సినిమా చాలా నచ్చింది. ఇది అందరికీ గుర్తుండిపోయే మంచి ఎమోషనల్ డ్రామా. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని, పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం

You are at idlebrain.com > news today >

16 July 2026
Hyderabad

Sahaa (Life of Sanju) is an upcoming film that promises to present an emotionally stirring tale exploring love, memories, loss, and the resilience of the human spirit. Blending heartfelt emotions with a nostalgic narrative, the film offers a journey that is sure to leave a lasting impression. Helmed by Nishanth Doti, the film stars Shiva Kumar Kasaram in the lead role, alongside Swetha Lakshman and Vrajana Pandya in pivotal roles. Produced by Tejeswar Velpucharla under the Sumaira Studios banner, the makers made a strong impression with The Soul of Sahaa, a captivating glimpse that offered a touching introduction to the film's emotional world.

Now, the makers began musical journey with the release of its first single- Kaalane Thiragesi, which serves as ‘Emotion Of Sahaa’. Music director Shekar Chandra has composed a timeless melody. It begins as a slow, soul-stirring melody and gradually builds into an electrifying musical experience. The composition is deeply moving, while the rich orchestration adds tremendous emotional depth and leaves a lasting impact.

The song captures the pain of a heartbroken protagonist who continues to dream of reuniting with the love of his life. Through the heartfelt refrain "Malli Raava," he pours out his longing, sorrow, and hope. Lyricist Purna Chary beautifully transforms these emotions into poetic verses, while Anurag Kulkarni's mesmerizing vocals elevate the song to another level.

Shiva Kumar Kasaram delivers a compelling performance as a shattered lover, living every emotion with remarkable sincerity. Swetha Lakshman complements him perfectly, matching the emotional intensity with a graceful and heartfelt portrayal. Their on-screen chemistry and captivating pairing emerge as one of the biggest highlights.

Vrajana Pandyais the other female lead in the movie. The supporting cast includes Mahipal, Appaji, Bharathi, Meghana Sunil, Bombay Padma, Konda Reddy, and Harshavardhan.

The film features cinematography by Karunakar K and editing by Dinesh Peddi.

The makers are set to announce the film's release date soon. While the first glimpse generated tremendous excitement, the first song underscored the pivotal role music plays in the narrative, raising expectations for the film to an even greater level.

Cast: Shiva Kumar Kasaram, Swetha Lakshman, Vrajana Pandya, Mahipal, Appaji, Bharathi, Meghana Sunil, Bombay Padma, Konda Reddy, Harshavardhan, and others

Technical Crew:
Written & Directed By - Nishanth Doti
Produced By - Tejeswar Velpucharla
Production Banner - Sumaira Studios
Music Director - Shekar Chandra
Cinematography - Karunakar K
Editor - Dinesh Peddi

'సహ' సినిమా చాలా నచ్చింది. ఇది అందరికీ గుర్తుండిపోయే మంచి ఎమోషనల్ డ్రామా. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని, పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం

నిశాంత్ దోటి, సుమైరా స్టూడియో ఎమోషనల్ డ్రామా 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు) నుంచి 'కాలాన్నే తిరగేసి' సాంగ్ లాంచ్

ప్రేమ, జ్ఞాపకాలు, జీవిత పోరాటం వంటి భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కథగా తెరకెక్కుతున్న చిత్రం 'సాహ (లైఫ్ ఆఫ్ సంజు)'. నాస్టాల్జిక్ ఎమోషన్స్‌తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతిని అందించబోతోంది. నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివ కుమార్ కాసారం హీరోగా నటిస్తుండగా, శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ది సోల్ ఆఫ్ సాహ' గ్లింప్స్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది.

తాజాగా చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ తొలి పాట 'కాలాన్నే తిరగేసి'ను విడుదల చేసింది. ఈ పాటని 'ఎమోషన్ ఆఫ్ సాహ'గా పరిచయం చేశారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మరోసారి తన మెలోడీ మ్యాజిక్‌ను చూపించారు. నెమ్మదిగా మొదలై క్రమంగా భావోద్వేగాలను పెంచుకుంటూ సాగే ఈ గీతం అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో అందరినీ కదిలిస్తుంది.

తన జీవితంలోని ప్రేమను కోల్పోయిన కథానాయకుడు, మళ్లీ ఆమెను కలుసుకోవాలని కలలు కంటూ అనుభవించే ఆవేదన, ఆశలను ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. 'మళ్లీ రావా' అనే పల్లవి అతని మనసులోని తపనను హృదయానికి హత్తుకునేలా చేతుంది. పూర్ణాచారి రాసిన సాహిత్యం భావోద్వేగాలకు కవిత్వ రూపం ఇవ్వగా, అనురాగ్ కులకర్ణి తన మధురమైన వోకల్స్ తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.

ప్రేమని కోల్పోయిన యువకుడి పాత్రలో శివ కుమార్ కాసారం ఎంతో సహజంగా నటించారు. శ్వేత లక్ష్మణ్ కూడా తన పాత్రలో భావోద్వేగాలను అద్భుతంగా పలికిస్తూ ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ చిత్రంలో వ్రజనా పాండ్యా మరో కథానాయికగా నటిస్తుండగా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘనా సునీల్, బాంబే పద్మ, కొండా రెడ్డి, హర్షవర్ధన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

కరుణాకర్ కె సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దినేష్ పెద్ది ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు విడుదలైన తొలి పాట కథలో సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఉందో తెలియజేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. అందరికీ థ్యాంక్యూ. నిర్మాత తేజ్ నా స్నేహితుడు. ఈ సినిమా నిర్మించిన ప్రతి ఒక్కరి జీవితాలు ఈ సినిమాతో సెటిల్ అయితే చాలని ఆయన చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. శేఖర్ చంద్ర గారు అద్భుతమైన సంగీతం అందించారు. పూర్ణాచారి గారి సాహిత్యం చాలా బాగుంది. అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకు మరో పెద్ద ప్లస్ అయింది. శ్వేత చాలా చక్కగా నటించింది. తన పాత్ర చాలా సవాళ్లతో కూడుకున్నది. ఆమె పెర్ఫార్మెన్స్ అందరికీ గుర్తుండిపోతుంది. నిశాంత్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. ప్రతి ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడు. శివ కుమార్‌తో నాకు షార్ట్ ఫిల్మ్స్ రోజుల నుంచే పరిచయం ఉంది. ఈ సినిమా కోసం అతను ఎంత కసితో పనిచేశాడో నాకు తెలుసు. పదేళ్ల నిరీక్షణ అతని కళ్లలో కనిపించింది. ఒక సందర్భంలో అతనితో మాట్లాడుతుంటే నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. తన జీవితం నిలబడాలనే ఆశతో ఈ సినిమా చేశాడు. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి అతనికి ఆ నమ్మకాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ చిత్రానికి మంచి జరగాలి. అందరికీ థ్యాంక్యూ సో మచ్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
ohsukumari-prereleaseevent s