Nishanth Doti, Sumaira Studios' emotional drama Sahaa (Life of Sanju), Soul of Sahaa Glimpse promises a soulful and nostalgic cinematic journey
నిశాంత్ దోటి, సుమైరా స్టూడియోస్ ఎమోషనల్ డ్రామా 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు) నుంచి 'సోల్ ఆఫ్ సహ' గ్లింప్స్ రిలీజ్
Some love stories stay with us forever — not because of grand moments, but because they remind us of the emotions, memories, and dreams we quietly carry within our hearts. SAHAA (Life of Sanju) promises to be one such deeply emotional cinematic experience that blends nostalgia, romance, heartbreak, and hope into a moving journey across time. Directed by Nishanth Doti, the movie features Kumar Kasaram in the lead role, alongside Swetha Lakshman and Vrajana Pandya. Produced by Tejeswar Velpucharla under the banner of Sumaira Studios, the film's glimpse called- the soul of SAHAA has been unveiled.
At the heart of the story is Sanju, a man revisiting the most cherished phases of his life — from innocent childhood memories and school days to youthful college romance, married life, and the emotional moments that followed. As he relives these memories, the narrative takes an intriguing and emotional turn when he unexpectedly encounters another girl named Sahaa, someone who not only shares the same name as his past love but also reflects strikingly similar characteristics.
This unexpected meeting opens the door to questions about fate, destiny, unfinished emotions, emotional closure, and whether certain bonds are truly meant to return in life. Rather than being just a conventional romantic drama, SAHAA (Life of Sanju) explores how memories shape people, how time heals and changes relationships, and how the human heart continues to dream despite pain and loss.
The film’s emotional strength lies in its relatable storytelling and its reflection of real human experiences. Director Nishanth Doti wins brownie points for presenting the story in soul-stirring manner.
Music is one of the major highlights of the film, with melodious composer Shekar Chandra crafting an emotionally rich soundtrack that complements the film’s nostalgic and heartfelt mood. The film boasts cinematography by Karunakar K and editing by Dinesh Peddi.
The supporting cast includes Mahipal, Appaji, Bharathi, Meghana Sunil, Bombay Padma, Konda Reddy, and Harshavardhan.
With its emotionally layered storytelling, nostalgic depth, soulful music, and heartfelt exploration of love and memories, SAHAA (Life of Sanju) aims to offer audiences a warm, touching, and memorable theatrical experience. The glimpse touches hearts, setting strong buzz.
Technical Crew:
Written & Directed By - Nishanth Doti
Produced By - Tejeswar Velpucharla
Production Banner - Sumaira Studios
Music Director - Shekar Chandra
Cinematography - Karunakar K
Editor - Dinesh Peddi
నిశాంత్ దోటి, సుమైరా స్టూడియోస్ ఎమోషనల్ డ్రామా 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు) నుంచి 'సోల్ ఆఫ్ సహ' గ్లింప్స్ రిలీజ్
కొన్ని కథలు మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి.మన జీవితంలో ఎప్పుడో అనుభవించిన భావోద్వేగాలు, జ్ఞాపకాలు, కలలను అవి మళ్లీ గుర్తు చేస్తాయి. అలాంటి హృదయాన్ని తాకే అనుభూతిని అందించేందుకు వస్తోంది ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’. నిషాంత్ దోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కుమార్ కసారం హీరోగా నటిస్తుండగా, శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా కథానాయికలుగా కనిపించనున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘ది సోల్ ఆఫ్ సహ’ పేరుతో ప్రత్యేక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ కథలో సంజు అనే వ్యక్తి తన జీవితంలోని అత్యంత అందమైన దశలను తిరిగి గుర్తు చేసుకుంటాడు. చిన్ననాటి జ్ఞాపకాలు, స్కూల్ రోజులు, కాలేజ్ ప్రేమ, వివాహ జీవితం, ఆ తర్వాత జరిగిన భావోద్వేగ క్షణాలు అన్నీ అతని ప్రయాణంలో భాగమవుతాయి. అయితే కథ అనూహ్య మలుపు తిరిగేది ‘సహ’ అనే యువతిని కలిసినప్పుడు. ఆశ్చర్యకరంగా ఆమె పేరు మాత్రమే కాదు, తన గత ప్రేమను గుర్తు చేసే ఎన్నో లక్షణాలు కూడా ఆమెలో కనిపిస్తాయి.
ఈ పరిచయం విధి, గమ్యం, అసంపూర్తిగా మిగిలిపోయిన భావోద్వేగాలు, మళ్లీ జీవితంలోకి తిరిగి వచ్చే బంధాల గురించి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. కేవలం ఒక ప్రేమకథగా కాకుండా, మనిషిని జ్ఞాపకాలు ఎలా మలుస్తాయి, కాలం బంధాలని ఎలా మార్చుతుంది, బాధలు ఎదురైనా మనసు ఎలా ప్రేమను నమ్ముతూనే ఉంటుంది అనే అంశాలను ఈ చిత్రం హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది.
సహజమైన భావోద్వేగాలు, ప్రతి ఒక్కరూ తమ జీవితంతో అనుసంధానం చేసుకోగలిగే కథనమే ఈ చిత్రానికి ప్రధాన బలం. దర్శకుడు నిషాంత్ దోటి ఈ కథను ఎంతో ఆత్మీయంగా, హృదయాన్ని తాకేలా ఆవిష్కరించిన తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది.
సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. కథలోని నాస్టాల్జియా, ప్రేమ, భావోద్వేగాలను మరింత అందంగా ప్రతిబింబించేలా ఆయన స్వరాలు అలరిస్తున్నాయి. కరుణాకర్ కె సినిమాటోగ్రఫీ, దినేష్ పెద్ది ఎడిటింగ్ చిత్రానికి అదనపు బలంగా నిలిచాయి.
మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘనా సునీల్, బొంబాయి పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భావోద్వేగాలతో నిండిన కథనం, హృదయాన్ని హత్తుకునే ప్రేమ, మధురమైన జ్ఞాపకాలు, ఆత్మీయమైన సంగీతంతో ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ ప్రేక్షకులకు ఒక మరపురాని సినీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను తాకుతూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది.
తారాగణం: కుమార్ కాసారమ్, శ్వేత లక్ష్మణ్, వ్రజన పాండ్య, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బొంబాయి పద్మ, కొండా రెడ్డి, హర్షవర్ధన్
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం - నిశాంత్ దోటి
నిర్మాత - తేజేశ్వర్ వేల్పుచర్ల
ప్రొడక్షన్ బ్యానర్ - సుమైరా స్టూడియోస్
సంగీతం - శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ - కరుణాకర్ కె
ఎడిటర్ - దినేష్ పెద్ది