Statistics show that, in today’s fast-paced world, infertility has become one of the major problems faced by married couples. Proof of this can be seen in the mushrooming fertility clinics everywhere you look. For the first time in Telugu, a film addressing such an issue has been made by blending it with comedy, and that is Santhana Prapthirasthu. The trailer is now out. With dialogues like “Didn’t you hear when Prakash Raj said it in Devara’s story?” and “If there was an anchor who could listen, even Venu Swamy would have said this much,” delivered by Abhinav Gomatam, the trailer manages to evoke laughter throughout while simultaneously highlighting the struggles faced by married couples.
The trailer also reveals that Vikranth and Chandini Chowdary play the lead pair, and director Tharun Bhascker appears in a key role. Along with them, Vennela Kishore, Jeevan Kumar, Muralidhar Goud, and Harsha Vardhan will be seen in other characters. The film is jointly produced by Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy, with Sanjeev Reddy directing. Santhana Prapthirasthu is slated for release on November 14.
ఓ వైపు నవ్వులు పూయిస్తూ.. మరోవైపు సమస్యను స్పృశిస్తూ.. 'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్ విడుదల..
ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో పెళ్లైన జంటలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో సంతాన లోపం సమస్య ఒకటి కీలకమనే లెక్కలు చెప్తున్నాయి. వాటికి సాక్ష్యాలే ఎటువైపు చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలు. అలాంటి సమస్యను మొదటిసారిగా తెరపై హాస్యాన్ని జోడిస్తూ తీసిన చిత్రం 'సంతాన ప్రాప్తిరస్తు'. ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది. "దేవర కథ ప్రకాష్ రాజ్ చెప్తే వినలేదా", "వినే యాంకర్ ఉంటే వేణు స్వామి కూడా ఇంత చెప్పాడంట" అంటూ అభినవ్ గోమటం చెప్తున్న డైలాగులతో ట్రైలర్ ఆద్యంతం ఓ వైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు పెళ్లైన జంటలు ఎదుర్కొంటున్న సమస్యను కూడా చర్చిస్తూ కనిపించింది.
విక్రాంత్ మరియు చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా కనిపించబోతున్న ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. వీరితో పాటూ వెన్నెల కిషోర్, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ మరియు హర్ష వర్ధన్ లు ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి మరియు నిర్వి హరి ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమా నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
The #SanthanaPrapthirasthu trailer tackles male infertility issues - such as low sperm count and erectile dysfunction - in a humorous and engaging manner.