"I hope the movie 'Santhana Prapthirasthu' captures the audience's attention and achieves great success: Ace Producer Dilraju at trailer launch event
"సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా - ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు
The movie Santhana Prapthirasthu stars Vikranth and Chandini Chowdary in the lead roles. It is produced under the banners of Madhura Entertainment and Nirvi Arts by Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy. The film is directed by Sanjeev Reddy, and the screenplay is written by Sheikh Dawood G. Santhana Prapthirasthu is set for a grand theatrical release on the 14th of this month. Today, the trailer launch event was held grandly in Hyderabad, attended by renowned producer Dil Raju and young talented hero Anand Deverakonda.
Dialogue writer Kalyan Raghav said, "The trailer is filled with entertainment, but the movie has even more fun moments. After watching the film, audiences will remember and laugh at many scenes again and again. I request everyone to watch 'Santhana Prapthirasthu' with your friends and family."
Screenplay writer Sheikh Dawood G. said, "It’s a pleasure to have Dil Raju Garu and Anand Deverakonda attend our trailer launch. I believe the film will now start reaching the audience. Kalyan and I received full support from our producers and director to create a strong script. 'Santhana Prapthirasthu' is a highly entertaining movie, and I am confident audiences will enjoy it."
Director Sanjeev Reddy said, "'Santhana Prapthirasthu' is a pure love story. Along with family emotions and entertainment, we included a small social issue in the film. When we look around, there are many fertility centers. Surveys show that India has the highest number of fertility centers in the world. We thought it would be meaningful to include such an issue in our story. Our editor Sai Krishna, writers Sheikh Dawood and Kalyan, DOP Mahireddy, music directors Sunil Kashyap and Ajay Arasada, and the entire team worked together to create a beautiful output. I request everyone to watch our film releasing on the 14th of this month."
Music director Ajay Arasada said, "I hope everyone liked the 'Santhana Prapthirasthu' trailer. I really enjoyed composing the BGM for this movie. It makes me happy that the song I composed for 'Telusa Nee Kosame' received such a good response."
Producer Nirvi Hariprasad Reddy said, "Thanks to Dil Raju Garu and Anand Garu for coming to bless our team. We hope the trailer appeals to everyone. We have taken a small issue and combined it with entertainment and family emotions to create 'Santhana Prapthirasthu'. The movie is made in a way that everyone will enjoy it. With Lord Venkateswara's blessings, our film is sure to be a success."
Producer Madhura Sreedhar Reddy said, "I have always made concept-oriented films, and this is another movie with a good concept. Audiences are responding well to content-oriented films, and we believe 'Santana Praptirastu' will also be a success. We did our best for this film. Dil Raju Garu has supported me since the beginning of my career, providing valuable suggestions for films like My Love Story and Backbench Students. We wanted the trailer of 'Santana Praptirastu' to be launched by him. Anand is our hero, and I’m happy he attended this event. The casting, including Vennela Kishore, Tarun Bhasker, Abhinav Gomatam, and Murali Goud, will entertain the audience. For a concept-driven film, we have done everything necessary. The trailer gives a clear idea of what the movie is like, and we hope audiences like it."
Heroine Chandini Chowdary said, "I play the role of Kalyani Oruganti in 'Santhana Prapthirasthu'. I am grateful to the producers and director for trusting me with this role. Fertility issues are very common in our society, but people hesitate to talk about them. We have addressed the issue of male fertility in a sensible way, blending it with entertainment and family emotions so that everyone can enjoy the film. I request you to share the trailer and come to theaters with your family and friends on the 14th."
Hero Vikranth said, "For Telugu cinema to gain global recognition, it takes the efforts of several pillars behind the industry. Producer Dil Raju is one such pillar. I am happy he attended our event. Anand and I came here from the U.S., leaving our jobs, driven by our passion for cinema. Anand had success with Baby. I previously did a film that didn’t do well, and during my disappointment, Madhura Sreedhar garu supported me by saying he wanted to work with me. Later, Hariprasad G. joined the project. In this film, I play Chaitanya, a software employee. The director transformed me for the role, and I felt renewed when I stepped on set. The movie addresses male fertility, contains plenty of entertainment, and delivers emotions in the climax. It also carries a positive message. All these elements will attract audiences to theaters, and I believe 'Santhana Prapthirasthu' will be well-received."
Hero Anand Deverakonda said, "'Santhana Prapthirasthu' trailer looks very promising and engaging. My favorite actors, Vennela Kishore and Tharun Bhascker, are featured in the trailer. I want to hear the song 'Telusa Nee Kosame' again. I started my career with Director Sanjeev, and I hope this film will be a super hit for him. Vikrant and Chandini look great together in the trailer. The film releases on the 14th, and I wish the team all the best. Madhura Sreedhar Garu is like family to me, and that’s why I came for this event. Many successful people in the industry, including Tarun Bhasker, Vivek Athreya, and my brother Vijay, have supported me. Madhura Sreedhar Garu has always believed in bringing unique films to theaters, which is why I could do Baby after Dorasani. I wish him a great blockbuster, and I hope everyone blesses 'Santhana Prapthirasthu'."
Producer Dil Raju said, "People used to hear ‘Kalyana Prapthirasthu,’ and now it’s ‘Santhana Prapthirasthu.’ Live-in relationships and marriages have become easier, but having children has become a challenge. That’s why the movie has this title. I wish all the best to the heroes Vikranth, Chandini, producers Madhura Sreedhar and Hariprasad, and director Sanjeev Reddy. I also want to emphasize that the real achievement is not just making the movie or launching the trailer but attracting audiences for morning shows. If you excite the audience with your content, get good media reviews, and see increased collections in theaters, that is true success. I wish 'Santhana Prapthirasthu' appeals to both audiences and media and achieves great success."
Director – Sanjeev Reddy
Producers – Madhura Sreedhar Reddy, Nirvi Hariprasad Reddy
Story, Screenplay – Sanjeev Reddy, Sheikh Dawood G.
Cinematography – Mahireddy Pandugula
Music Director – Sunil Kashyap
Dialogues – Kalyan Raghav
Editor – Sai Krishna Ganal
Production Designer – Shivakumar Machha
Costume Designers – Ashwath Bhairi, K. Pratibha Reddy
Choreographer – Laxman Kalahasti
Executive Producer – E. Madhusudhan Reddy
Marketing & Promotions Consultant – Vishnu Komalla
Lyrical Videos – Right Click Studio
Digital – House Full Digital
"సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా - ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డైలాగ్ రైటర్ కల్యాణ్ రాఘవ్ మాట్లాడుతూ - ట్రైలర్ లో ఎంత ఎంటర్ టైన్ మెంట్ ఉందో అంతకు రెట్టింపు వినోదాన్ని సినిమాలో చూస్తారు. సినిమా చూసిన తర్వాత మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుని నవ్వుకునేలా సన్నివేశాలు ఉంటాయి. మా "సంతాన ప్రాప్తిరస్తు" చిత్రాన్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుతున్నా. అన్నారు.
స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్.జి. మాట్లాడుతూ - దిల్ రాజు గారు, ఆనంద్ దేవరకొండ గారు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు రావడం హ్యాపీగా ఉంది. ఈ రోజు నుంచే మా మూవీ ప్రేక్షకుల్లోకి వెళ్లడం మొదలవుతుందని భావిస్తున్నా. నేను, కల్యాణ్ ఈ మూవీకి బాగా స్క్రిప్ట్ చేసేలా కావాల్సినంత సపోర్ట్ మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఇచ్చారు. "సంతాన ప్రాప్తిరస్తు" ఒక మంచి ఎంటర్ టైనింగ్ మూవీ. మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - "సంతాన ప్రాప్తిరస్తు" ఒక ఫ్యూర్ లవ్ స్టోరీ. ఈ కథకు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఒక చిన్న సోషల్ ఇష్యూను కూడా జతచేసి రూపొందించాం. మనం బయటకు వెళ్లి చూస్తే చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తున్నాయి. ప్రపంచంలో చూస్తే మన దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మా కథకు ఇలాంటి ఒక ఇష్యూను కలిపితే బాగుంటుంది అనిపించింది. మా ఎడిటర్ సాయికృష్ణ, మా రైటర్స్ షేక్ దావూద్, కల్యాణ్, డీవోపీ మహిరెడ్డి, మ్యూజిక్ ఇచ్చిన సునీల్ కశ్యప్, అజయ్ అరసాడ..ఇలా టీమ్ అంతా కలిసి ఒక బ్యూటిఫుల్ ఔట్ పుట్ మూవీకి తీసుకొచ్చారు. ఈ నెల 14న రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుతున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ - "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ మూవీకి బీజీఎం చేసేప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నేను కంపోజ్ చేసిన తెలుసా నీకోసమే పాటకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.
ప్రొడ్యూసర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ - మా టీమ్ ను బ్లెస్ చేసేందుకు వచ్చిన దిల్ రాజు గారికి, ఆనంద్ గారికి థ్యాంక్స్. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. ఒక చిన్న సమస్యను తీసుకుని దానికి ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి "సంతాన ప్రాప్తిరస్తు" చిత్రాన్ని రూపొందించాం. మీ అందరికీ నచ్చేలా మూవీ ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - నేను మొదటి నుంచీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటాను. ఈ సినిమా కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న క్యూట్ మూవీ. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను కూడా ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం. ఈ సినిమా కోసం మేము మా బెస్ట్ చేశాం. దిల్ రాజు గారు నా కెరీర్ ప్రారంభం నుంచీ సపోర్ట్ చేస్తున్నారు. నా స్నేహ గీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ సినిమాలకు దిల్ రాజు గారు తన వ్యాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ట్రైలర్ ను రాజు గారి చేతుల మీదుగానే రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఆనంద్ మా హీరో. తను ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్..ఇలా మంచి కాస్టింగ్ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నారు. ఒక కాన్సెప్ట్ మూవీకి ఏం కావాలో అవన్నీ చేశాం. ట్రైలర్ తో మా సినిమా ఎలా ఉండబోతుందో మీకు తెలిసే ఉంటుంది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని నమ్ముతున్నాం. నా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ - "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాలో నేను కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో నటించాను. ఈ పాత్రకు నేను న్యాయం చేయగలను అని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థ్యాంక్స్. మన సొసైటీలో ఫెర్టిలిటీ ఇష్యూ చాలా ఉంది. అయితే దాని గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదొక మాట్లాడకూడని విషయమని అనుకుంటున్నారు. మేల్ ఫెర్టిలిటీ అనే ఇష్యూను తీసుకుని ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కడా హద్దు దాటకుండా సెన్సబుల్ గా ప్రేక్షకులంతా కలిసి చూసేలా మా చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ట్రైలర్ ను అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ , ఫ్రెండ్స్ తో ఈ నెల 14న థియేటర్స్ కు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ - తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది అంటే దాని వెనక పిల్లర్స్ లా నిలబడిన కొందరి కృషి ఉంది. అలా మన టాలీవుడ్ కు పిల్లర్ లా నిలబడిన నిర్మాత దిల్ రాజు గారు. ఆయన మా ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. ఆనంద్, నేను యూఎస్ లో ఉద్యోగాలు చేసి సినిమా మీద ప్యాషన్ తో ఇక్కడికి వచ్చాం. ఆనంద్ బేబి మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. నేను గతంలో ఒక సినిమా చేశాను. ఆ మూవీ సరిగ్గా ఆదరణ పొందలేదు. నిరాశలో ఉన్న ఆ టైమ్ లో మధుర శ్రీధర్ గారు నీతో సినిమా చేస్తాను అని సపోర్ట్ గా నిలబడ్డారు. ఆ తర్వాత హరి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో చైతన్య అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ క్యారెక్టర్ లో నటించాను. ఆ పాత్రకు తగినట్లు నన్ను దర్శకుడు సంజీవ్ గారు మార్చేశారు. సెట్ లోకి వెళ్లాక నన్ను నేను చూసుకుంటే కొత్తగా అనిపించింది. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా స్క్రిప్ట్ విన్నాక ఇందులో మేల్ ఫెర్టిలిటీ అనే కొత్త విషయం ఉంది, కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్, సినిమా చివరలో ఎమోషన్స్ ఉన్నాయి. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడున్న ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించే ఎలిమెంట్స్. కాబట్టి "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా తప్పకుండా మీ ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను. అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. మంచి ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుంది. ట్రైలర్ లో నా ఫేవరేట్ యాక్టర్స్ వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్..లాంటి వాళ్లు కనిపించారు. ఈ చిత్రంలోని తెలుసా నీ కోసమే పాటను మరోసారి వినాలనుకుంటున్నాను. డైరెక్టర్ సంజీవ్ నేను ఒకేసారి కెరీర్ బిగిన్ చేశాం. ఈ చిత్రంతో ఆయనకు మంచి సూపర్ హిట్ దక్కుతుందని ఆశిస్తున్నా. ట్రైలర్ లో విక్రాంత్, చాందినీ జంట చాలా బాగున్నారు. ఈ నెల 14న సినిమా రిలీజ్ అవుతోంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మధుర శ్రీధర్ గారు నా ఫ్యామిలీ లాంటివారు. ఆయన కోసమే ఈ ఈవెంట్ కు వచ్చాను. శ్రీధర్ గారు ఇండస్ట్రీలో తరుణ్ భాస్కర్, వివేక్ ఆత్రేయ, నా బ్రదర్ విజయ్..ఇలా ఎంతోమంది విజయం వెనక ఉన్నారు. పెళ్లిచూపులు సినిమా థియేటర్స్ లో వర్కవుట్ కాదు అని చాలా మంది ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు శ్రీధర్ సార్ ధైర్యం చేసి ముందుకు తీసుకెళ్లారు. ఇండస్ట్రీలోకి నేను రావాలనుకున్నప్పుడు శ్రీధర్ గారు అవకాశం ఇచ్చారు. నేను శ్రీధర్ గారి దొరసాని సినిమా చేయడం వల్లే బేబి సినిమా చేయగలిగాను. అలా బేబి మూవీ సక్సెస్ నాకు రావడానికి శ్రీధర్ గారే కారణం. శ్రీధర్ గారు ఊరికే ఏ సినిమా చేయరు. చాలా పట్టుదలగా ఆ మూవీపై వర్క్ చేస్తారు. ఆయనకు మంచి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నా. మీరంతా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ - కల్యాణ్ ప్రాప్తిరస్తు అని వినేవాళ్లం, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని వింటున్నాం. లివ్ ఇన్ రిలేషన్, పెళ్లి సులువు అయ్యింది. కానీ పిల్లలు పుట్టడమే సమస్యగా మారుతోంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టుకున్నారు. హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ, ప్రొడ్యూసర్స్ మధుర శ్రీధర్, హరి ప్రసాద్, డైరెక్టర్ సంజీవ్ రెడ్డికి ఆల్ ది బెస్ట్. ఇందాక ఈ టీమ్ తో చెబుతున్నా, సినిమా తీయడం, ట్రైలర్ లాంఛ్ చేసుకోవడం కంటే మార్నింగ్ షోస్ కు ప్రేక్షకుల్ని రప్పించి సినిమా సక్సెస్ అనిపించుకోవడం గొప్ప విషయం. దాని కోసం ఈ రోజు నుంచి మీరు సినిమా చేసినదానికంటే ఎక్కువ శ్రమ పెట్టాలి. మీ మూవీ కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసి వాళ్లు థియేటర్స్ కు వచ్చాక ఎంగేజ్ చేస్తే, మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తే థియేటర్స్ లో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ప్రేక్షకులకు, మీడియాకు నచ్చి మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
డైరెక్టర్ - సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ - మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే - సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్.జి
సినిమాటోగ్రఫీ - మహిరెడ్డి పండుగుల
మ్యూజిక్ డైరెక్టర్ - సునీల్ కశ్యప్
డైలాగ్స్ - కల్యాణ్ రాఘవ్
ఎడిటర్ - సాయికృష్ణ గనల
ప్రొడక్షన్ డిజైనర్ - శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్స్ - అశ్వత్ భైరి, కె.ప్రతిభ రెడ్డి
కొరియోగ్రాఫర్ - లక్ష్మణ్ కాళహస్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎ మధుసూధన్ రెడ్డి
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ - విష్ణు కోమల్ల
లిరికల్ కంపోజిషన్ - రైట్ క్లిక్ స్టూడియో
డిజిటల్ - హౌస్ ఫుల్ డిజిటల్