pizza

SJ Suryah’s Menacing First Look Unveiled From Karthi’s Sardar 2, Releasing Worldwide On September 10
కార్తి 'సర్దార్ 2' నుంచి ఎస్.జే. సూర్య స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్- సినిమా సెప్టెంబర్ 10న వరల్డ్ వైడ్ గ్రాండ్‌ రిలీజ్

You are at idlebrain.com > news today >

20 July 2026
Hyderabad

Starring Karthi in the lead, Sardar 2 is the sequel to the blockbuster Sardar, which became a huge success across Tamil and Telugu. The film promises to expand the franchise with a bigger canvas, international action, and high-octane thrills. Directed by PS Mithran and produced by S Lakshman Kumar under Prince Pictures, the film has music by Sam CS. Sardaar 2 is progressing with its shoot.

The makers of Sardar 2 have dropped a massive surprise on the occasion of SJ Suryah’s birthday, unveiling his striking first-look poster from the much-awaited spy action thriller. Along with introducing the versatile actor’s character, the team has also officially confirmed that the film will hit cinemas worldwide on September 10.

The birthday poster presents SJ Suryah in an ultra-stylish avatar. Dressed in a sharp navy-blue suit with tinted sunglasses, he is seen descending a spiral staircase with unmatched confidence. The dimly lit backdrop featuring a gigantic dragon mural adds mystery and power to his presence, hinting at a formidable character with global connections. The sleek design and dark aesthetics perfectly complement the espionage world created by director PS Mithran.

With Karthi and SJ Suryah sharing screen space, expectations have soared for one of the biggest action entertainers of the year.

The makers are expected to unveil more exciting updates in the coming days.

Cast: Karthi, SJ Suryah

Technical Crew:
Director: PS Mithran
Producer: S Lakshman Kumar
Banner: Prince Pictures
Co-Producer: A Venkatesh
Music: Yuvan Shankar Raja
DOP: George C Williams
Production Designer: Rajeevan Nambiar
Stunts: Dileep Subbarayan
Production Executive: A Paal Pandi

కార్తి 'సర్దార్ 2' నుంచి ఎస్.జే. సూర్య స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్- సినిమా సెప్టెంబర్ 10న వరల్డ్ వైడ్ గ్రాండ్‌ రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

నీలం రంగు సూట్‌లో స్టైలిష్ లుక్‌తో మెట్లపై నిలబడి కనిపించిన ఎస్.జే. సూర్య పోస్టర్‌లో ఎంతో క్లాసీగా, మిస్టీరియస్‌గా కనిపిస్తున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న భారీ డ్రాగన్ ఆర్ట్‌వర్క్, డార్క్ టోన్, షేడ్స్‌తో కూడిన ఆయన లుక్ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్‌ను బట్టి 'సర్దార్ 2' లో ఎస్.జే. సూర్య పాత్ర కథలో అత్యంత కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.

సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్. విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్.

ఈ చిత్రం సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు - కార్తీ, SJ సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్
దర్శకత్వం - పిఎస్ మిత్రన్
సహ నిర్మాత - ఎ. వెంకటేష్
నిర్మాతలు - ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా
సంగీతం - సామ్ సిఎస్
DOP - జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్ - విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైన్ - రాజీవ్ నంబియార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - AP పాలపాండి
ఆర్ట్ - MSP మాధవన్, B. శేఖర్
స్టంట్ - దిలీప్ సుబ్బరాయన్, చేతన్ డిసౌజా
సౌండ్ డిజైన్ - తపస్ నాయక్
రైటర్స్ - రత్న కుమార్, ఆషామీర అయ్యప్పన్, విఘ్నేష్ మునియాండి
స్క్రీన్ ప్లే - నంబి
కాస్ట్యూమ్ డిజైనర్ - పూర్ణిమా రామస్వామి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
ohsukumari-prereleaseevent s