pizza

Sri Chidambaram Garu pre streaming meet
‘శ్రీ చిదంబరం గారు’ నిజాయితీ గల మంచి సినిమా. ఈవిన్ లో చాలా పెద్ద హిట్ అవుతుంది: ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నందిని రెడ్డి

You are at idlebrain.com > news today >

26 February 2026
Hyderabad

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన బ్లాక్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమయ్యారు. చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం థియేటర్స్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 26 నుంచి ఈవిన్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు.

ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ వినయ్ ని ఇప్పుడే కలుస్తున్నాను. కానీ తన ఇంటర్వ్యూ ఒకటి చూశాను. నా జర్నీ నేను గుర్తుకొచ్చింది. 25 ఏళ్ల ఒక అబ్బాయికి ఇంత పాషన్ తో సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఖచ్చితంగా తను భవిష్యత్తులో చాలా గొప్ప కథలు చెబుతాడు. ఈటీవీ విన్ కారణంగా చాలా కొత్త కంటెంట్, కొత్త ఫిలిం మేకర్స్ ఇండస్ట్రీకి వస్తున్నారు. డైరెక్టర్ వినయ్ వాయిస్ లో నిజాయితీ ఉంది. ఈ సినిమాలో నిజాయితీ ఉంది. ఈ సినిమా మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ చిరకాలం ఉంటుంది. ఇంత మంచి సినిమాలను ప్రేమించే మన ఆడియన్స్ కోసం ఈటీవీ ఇలాంటి మంచి కథలు చెబుతున్నారు. 45 రూపాయలకి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. చాలా హార్ట్ ఫుల్ గా చెప్పిన కథ ఇది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చాలామంది ఫిలిం మేకర్స్ ఇన్స్పైర్ అవుతారు. ఈటీవీలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది.

డైరెక్టర్ వేణు ఉడుగుల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ప్రతి సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, పోతుంటాయి. కానీ అందరికీ రీచ్ అవ్వాల్సిన కొన్ని మంచి సినిమాలు మాత్రం రీచ్ అవ్వలేకపోతుంటాయి. అలా అందరికీ రీచ్ అవ్వలేకపోయిన మంచి సినిమా ఇది ఇంకా చాలామంది థియేటర్స్ లో చూడలేదని నా ఫీలింగ్. సినిమా చూస్తున్నప్పుడు ఇంత మంచి సినిమా థియేటర్స్ లో ఎలా మిస్ అయ్యాను అనే ఫీలింగ్ కలిగింది. చాలా కొత్తదనంతో ఉన్న సినిమా. చాలామంది ఆత్మనూన్యత భావంతో కాన్ఫిడెన్స్ ని కోల్పోతారు. జీవితంలో ఉన్న ఆనందాన్ని అందాన్ని ఆస్వాదించలేక చాలామంది చాలా నిస్తేజంగా బ్రతుకుతుంటారు. అలాంటి ఒక మంచి విషయాన్ని చెప్పిన ఈ సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అలాంటి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఈటీవీ అభినందిస్తున్నాను. ఎంతో మంది దర్శకులకి ఈటీవీ ఒక భరోసా. కంటెంట్ ఉన్న సినిమాలకి జన్మనివ్వడానికి ఒక మంత్రసానిలా పనిచేస్తుంది ఈ టీవీ విన్. ఇది ఇలాగే కొనసాగాలని కొనసాగుతుందని కోరుకుంటున్నాను

డైరెక్టర్ సాయిలు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు చాలాసార్లు కన్నీళ్లు వచ్చాయి. ఇంకా చాలాసార్లు మజా అనిపించిం.ది డైరెక్టర్ వినయ్ చాలా అద్భుతంగా తీశాడు. ఈటీవీ మనందరి జీవితంలో ఒక భాగం. ఒకప్పుడు అందులో వచ్చే కంటెంట్ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అదే సంస్థ మా అందరికీ జీవితాన్ని ఇస్తుంది. ఈటీవీ యాజమాన్యానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు.

ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శ్రీ చిదంబరం గారు వెరీ హానెస్ట్ మూవీ. ఇందులో ఉండే ఊరు మనుషులు అన్ని కథలో అద్భుతంగా కుదిరాయి. ఇలాంటి సినిమాలు కి ఎప్పుడు మా ప్రోత్సాహం ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఇంకా వస్తుంటాయి. 26 నుంచి ఇది ఈవిన్ లో స్ట్రీమ్ అవుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసి సినిమాని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.

హీరో వంశీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా సినిమా థియేటర్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాని థియేటర్లో బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్. ఇప్పుడు ఈటీవీ విన్ ఈ సినిమాని మీ ఇంటి వద్దకు తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈటీవి జీవితంలో భాగం. అలాంటి సంస్థలో నా తొలి సినిమా రిలీజ్ రావడం చాలా ఆనందంగా ఉంది.

డైరెక్టర్ వినయ్ రత్నం మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈటీవీ విన్ లోకి వస్తుంది. మా సినిమాని ఇంకా జనాల్లోకి రీచ్ అవుతుందని ఆనందం ఉంది. ఇంకా ఎక్కువ మంది చూడడానికి ఈ ప్లాట్ఫారం మాకు హెల్ప్ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత మళ్లీ అందరూ రివ్యూస్ రాస్తే వర్డ్ ఆఫ్ మౌత్ అందరికీ చేరుతుంది. ఎక్కువ మంది చూడాల్సిన సినిమా ఇది. నందిని రెడ్డి గారికి వేణు గారికి డైరెక్టర్ సాయి లు గారికి థాంక్యూ

హీరోయిన్ సంధ్యా వశిష్ట మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నందిని రెడ్డి గారికి వేణు గారికి డైరెక్టర్ సాయి లు గారికి థాంక్యూ. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ సినిమాని ప్రేమించారు. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఈటీవీ విన్ లో చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా ఇది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved