SIGMA 1st single on 4 June
సందీప్ కిషన్, జేసన్ సంజయ్, ఎస్. తమన్, లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ ప్రజెంట్స్“సిగ్మా” ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ జూన్ 4న రిలీజ్
సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పుడు మేకర్స్ సిగ్మా మ్యూజికల్ జర్నీ మొదలుపెడుతున్నారు. ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ జూన్ 4న రిలీజ్ కానుంది.
మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమోలో తమన్ ట్యూన్, సందీప్ కిషన్ స్టయిలీష్ డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి. ఈ ప్రోమో సాంగ్ పై మరింత క్యురియాసిటీ పెంచింది.
భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. హరిహరసుతన్ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
సిగ్మా ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.