Shalini Kondepudi about Sing Geetham
'సింగ్ గీతం'లో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి జానర్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఖచ్చితంగా ఆడియన్స్ చాలా కొత్తగా ఎంటర్‌టైన్ అవుతారు: హీరోయిన్ శాలిని కొండెపుడ
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ శాలిని కొండెపుడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
సింగ్ గీతం జర్నీ ఎలా మొదలైయింది? -ఇంతకుముందు నేను జయమ్మ పంచాయితీ, శుభం, మై డియర్ దొంగ చిత్రాలు చేశాను. తెలిసిన వారి ద్వారా ఈ సినిమాలో ఒక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉందని తెలిసింది. సింగీతం గారి సినిమా అంటే ఎలాంటి పాత్ర అయినా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆడిషన్‌కి వెళ్లాను. ఆడిషన్ ఇచ్చిన నెల రోజుల తర్వాత ఓకే అయ్యింది.
-ఇలాంటి జానర్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఈ సినిమాలో ప్రతిది మ్యూజికల్ గా వుంటుంది. ప్రతి ఆర్టిస్ట్‌కి కొంచెం శృతిలో పాడటం రావాలి. ఇందుకోసం చాలా వర్క్‌షాప్స్ చేశాం.
ఈ కథ ఎలా ఉండబోతుంది? సంగీతం గారి దర్శకత్వంలో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? -ఈ కథ ఆలోచన సింగీతం గారికి చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. అయితే ఈ రోజుకీ ఎంతో రిలెవెంట్‌గా అనిపించే కథ ఇది. ఇందులో ప్రతి మాట మ్యూజికల్‌గా ఉంటుంది. సంభాషణలు కూడా పాటల్లా సాగుతాయి.
-ఇటీవల విడుదలైన పాట ద్వారా ప్రేక్షకులకు సినిమా టోన్‌పై కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. అయితే అందరూ మాటలను పాటల్లా ఎందుకు పాడుతున్నారు? దాని వెనుక కారణం ఏమిటి? అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. సింగీతం గారు ప్రతి అంశాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఆయన విజన్ ప్రకారమే సినిమా రూపొందింది. ఆయన దర్శకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఇది ఫిక్షనల్ కథనా? -ఈ కథ ‘కుబేరపురం’ అనే ఒక ఫిక్షనల్ గ్రామంలో జరుగుతుంది. ఆ ఊరిలో ఏమి జరుగుతుంది? ఎందుకు అందరూ పాటల రూపంలో మాట్లాడతారు? అనేది థియేటర్‌లో చూసి ఆస్వాదించాల్సిందే.
-ఇది పూర్తిగా ఒరిజినల్ కాన్సెప్ట్. దీనికి ఎలాంటి సినిమా రిఫరెన్స్ లేదు. మాకు ఉన్న ఏకైక రిఫరెన్స్ సింగీతం గారు , నాగ్ అశ్విన్ గారి విజనే. నాగ్ అశ్విన్ గారి విజన్, సెన్సిబిలిటీ కూడా సినిమాలో కనిపిస్తుంది.
-ఇది భారతీయ సినీ చరిత్రలోనే తొలి మ్యూజికల్ కామెడీ ఫిల్మ్. సింగీతం గారి గత చిత్రాల తరహాలోనే వినూత్నమైన అనుభూతిని ఇస్తుంది.
మీ పాత్ర గురించి చెప్పండి? -సింగీతం గారి సినిమాలో ప్రతి పాత్రకీ కథలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. నేను చేసిన విలన్ పాత్ర కూడా అంతే బలంగా ఉంటుంది. తాను అనుకున్నది సాధించాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషి. తాను నమ్మిందే నిజమని భావించే పాత్ర.
-ఈ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. కథలో చాలా కీలకమైన పాత్ర ఇది. హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు నా పాత్ర కూడా చాలా ఎంటర్టైనింగ్ గా వుంటుంది. ఇలాంటి పాత్రలు తరచూ రావు.
-ఇలాంటి కథలో నటించే అవకాశం అందరికీ రాదు. ఈ సినిమా ద్వారా మాకు అలాంటి అరుదైన అదృష్టం దక్కింది.
ఇందులో ఛాలెంజ్ గా అనిపించిన అంశం ఏమిటి ? -పాటలు పాడే నటులు చాలామంది ఉంటారు. కానీ ఇందులో మాటలనే పాటలాగా పాడాలి. అదే అసలు ఛాలెంజ్. సాధారణంగా గాయకులు పాట పాడేటప్పుడు ఒక విధంగా వాయిస్ , మాట్లాడేటప్పుడు మరో విధంగా వుంటుంది. కానీ ఇందులో మాట్లాడటమే పాటగా మారిపోతుంది. అది చాలా కష్టమైన ప్రక్రియ.
-దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మాటలను పాటలుగా అద్భుతంగా మార్చారు. ఆయన సంగీతం గొప్ప బలాన్ని ఇచ్చింది.
-ఈ సినిమా ద్వారా నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది పూర్తిగా సింగీతం గారి స్టైల్‌లో రూపొందిన చిత్రం. ఒక ప్రేక్షకురాలిగా చాలా ఎంజాయ్ చేశాను.
నిర్మాతల గురించి?
-వైజయంతి మూవీస్, స్వప్న సినిమా చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్స్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సినిమా అంటే ఇష్టం వుంటే తప్పా ఇలాంటి కొత్త తరహా చిత్రాలు చేయలేం. ఎంతో నిజాయితీతో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కొత్త తరహా సినిమాలు విజయవంతమైతే మరెందరో కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు.