12 February 2024
          
          Hyderabad        
        'Ponniyin Selvan' actor Jayam Ravi is gearing up for the release of a pakka action commercial movie 'Siren' on February 23rd. Debutant director Anthony Bhagyaraj has wielded the megaphone. The Telugu release rights have been bagged by Ganga Entertainments' Maheswara Reddy Mooli. Keerthy Suresh and Anupama Parameswaran played the female leads. The film's teaser is out & grabbed attention. 
        
        On the occasion producer Sujatha Vijayakumar said that 'Siren' has been made as a mega-budget action thriller with family elements. Actor Jayam Ravi is seen in a never-seen-before role with two different looks. Star heroine Keerthy Suresh and Anupama have teamed up with the talented actor for the first time. 
        
        Actor Samuthirakani, known for many Telugu films, said, "Jayam Ravi has a bigger space awaiting his talent. He can act in 100 more films. We shared screen space in the past already."
        
        Composer GV Prakash said, "Jayam Ravi has acted very maturely. This year has started well for me. Only a few would ask me for melodious songs like this film." 
        
        Director Anthony Bhagyaraj said, "This movie is like a dream for me. A new director's film with a big hero must become a hit. Jayam Ravi took the responsibility of making this film a hit. I love GV anna's melodies. He is the only musician I know who always inspires me. He has given 20 tunes for this film." 
        
        Actor Jayam Ravi said, "Emotion is very important in this film and it is important to bring it to the screen. We wanted GV to do it. GV is one of India's greatest Music Directors. The female lead is strong in this film. We thought Keerthy would be right and she proved it. People will see director Anthony Bhagyaraj on many more platforms in the future. They say that I am doing films for new directors. I am just a tool. The hard work of the director is the reason for the success of the film, I have played dual roles with little difficulty in this film." 
        
        Cast: Jayam Ravi, Keerthy Suresh, Anupama Parameswaran, Samuthirakani, Yogi Babu, Ajay, Azhagam Perumal and Pandian. 
        
        Crew:
          Written and Directed by Anthony Bhagyaraj
          Produced by Sujatha Vijayakumar
          Banner: Home Movie Makers
          Telugu Distribution: Ganga Entertainments
          Music Composer: GV Prakash
          Background Music: Sam CS
          Cinematography: Selvakumar S.K
          Editor: Ruben
          Production Designer: K. Kathir
          Art Director: Sakthi Venkatraj M Ch
          Choreographer: Brinda
          Fights: Dilip Subbarayan
          Sound Designer: Suren G Ajayakoothan S
          VFX : TDM Loven Kusan
          DI: Knock Studios
          Executive Producer: Omaar
        
        హీరో జయం రవి 'సైరన్' చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్న 'గంగ ఎంటర్టైన్మెంట్స్'
        'తని ఒరువన్' 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి తాజాగా 'సైరన్' అనే మాస్ ఎంటర్టైనర్ చిత్రంతో రానున్నారు. అంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'గంగ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు.
        
        కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా కనిపించనున్నఈ చిత్ర తెలుగు టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన లభించింది.
        
        చిత్ర నిర్మాత సుజాత విజయకుమార్ మాట్లాడుతూ " 'సైరన్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేలా తెరకెక్కించాం. జయం రవి గారు మునుపెన్నడూ కనిపించని లుక్ మరియు పాత్రలో కనిపించనున్నారు. కీర్తి, అనుపమ మొదటి సారి ఆయనతో కలిసి నటించారు. ఫిబ్రవరి 23న తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.
        
        నటుడు సముద్రఖని మాట్లాడుతూ "జయం రవి చాలా ప్రతిభ గల నటుడు. ఇంకో వంద చిత్రాలైన చెయ్యగల నేర్పు అతనిలో ఉంది. మేము ఇదివరకే కలిసి నటించాం. ఈ చిత్రంలో మా పాత్రలు అద్భుతంగా వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే చిత్రమిది" అన్నారు.
        
        సంగీత దర్శకుడు జివి ప్రకాష్ మాట్లాడుతూ "జయం రవి గారు ఈ చిత్రంలో చాలా పరిపక్వతతో నటించారు. ఈ చిత్రంలోని పాటలు నాకు చాలా స్పెషల్. నాకు ఈ సంవత్సరం ఈ చిత్రంతో ప్రారంభం అవ్వడం చాలా సంతోషంగా ఉంది." అన్నారు.
        
        దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ మాట్లాడుతూ " ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం, అదీ పెద్ద హీరో తో అయినప్పుడు, కచ్చితంగా హిట్ అవ్వాలనుకుంటారు.  ఆ బాధ్యత జయం రవి గారు తీసుకున్నారు. జివి గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రానికి ఆయన దాదాపు 20 ట్యూన్లు ఇచ్చి ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. చిత్రం అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అన్నారు.
        
        హీరో జయం రవి మాట్లాడుతూ "ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జి.వి తన సంగీతం తో ప్రాణం పోసాడు. ఇండియాలో ఉన్న మేటి సంగీత దర్శకుల్లో జి.వి.ప్రకాష్ అగ్ర స్థానాల్లో ఉంటాడు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రకి కీర్తి బాగుంటుంది అనుకున్నాము, మా నమ్మకాన్ని తను పూర్తిగా నిలబెట్టింది. ఆంథోనీ భాగ్యరాజ్ రానున్న కాలంలో చాలా ఎత్తుకు ఎదగడం ఖాయం. కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది మందలిస్తుంటారు కానీ ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే చిత్ర విజయం కనిపిస్తుంది నాకు. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను.  మా 'సైరన్' తమిళ - తెలుగు ప్రేక్షకులని ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం పూర్తిగా ఉంది" అన్నారు
        
        నటీనటులు: జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగి బాబు, అజయ్, అలగం పెరుమాళ్ మరియు పాండ్యన్.
        
        సాంకేతిక నిపుణులు:
          రచన, దర్శకత్వం; ఆంథోనీ భాగ్యరాజ్
          నిర్మాత: సుజాత విజయకుమార్
          బ్యానర్: హోమ్ మూవీ మేకర్స్
          తెలుగు డిస్ట్రిబ్యూషన్: గంగ ఎంటర్టైన్మెంట్స్
          సంగీత దర్శకుడు: జీవీ ప్రకాష్
          బ్యాగ్రౌండ్ స్కోర్: సామ్ సిఎస్
          సినిమాటోగ్రఫీ: సెల్వకుమార్ ఎస్.కె
          కూర్పు: రూబెన్
          ప్రొడక్షన్ డిజైనర్: కె. కథిర్
          కళా దర్శకుడు: శక్తి వెంకట్రాజ్ ఎం.సిహెచ్
          నృత్యం: బ్రిందా
          ఫైట్స్: దిలీప్ సుబ్బరాయణ్
          సౌండ్ డిజైనర్: సురేన్ జి అజయకూతన్ ఎస్
          విఎఫ్ఎక్స్: టిడిఎం లోవెన్ కుసన్
          డిఐ: నాక్ స్టూడియోస్
          ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఒమార్