pizza

Skanda Offline Promotions Kick-started
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ‘స్కంద’ ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ కిక్-స్టార్ట్

You are at idlebrain.com > news today >
Follow Us

12 August 2023
Hyderabad

Mass maker Boyapati Sreenu who delivered a massive blockbuster with his last outing Akhanda is presently making a Pan India movie Skanda- The Attacker with Ustaad Ram Pothineni playing the lead role and the most-sought-after actress Sreeleela in the female lead. The team recently completed the entire shooting part of the movie.

Promotional activities are already happening vigorously for the movie. While the title Glimpse received a thumping response, the first single scored by S Thaman is topping the music charts. Meanwhile, they kick-started offline promotions. The film’s standees are out and are placed all over. Ram appears in an action-packed avatar in one of the images of the standees, wherein the other image shows the adorable romantic chemistry of Ram and Sreeleela. While the action poster lures the masses, the romantic poster will please family audience.

Expectations are already high for the movie and the makers are planning to come up with regular updates to heighten the curiosity to watch the movie.

Santosh Detake cranks the camera for the film produced prestigiously by Srinivasaa Chitturi on a massive budget with high production values and top-notch technical standards under Srinivasaa Silver Screen banner. It is presented by Zee Studios South and Pavan Kumar. Editing is handled by Tammiraju.

Skanda is getting ready for release worldwide on September 15th in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages.

Cast: Ram Pothineni, Sreeleela

Technical Crew:
Writer, Director: Boyapati Sreenu
Producer: Srinivasaa Chitturi
Banner: Srinivasaa Silver Screen
Presents: Zee Studios South, Pavan Kumar
Music: SS Thaman
DOP: Santosh Detake
Editing: Tammiraju

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ‘స్కంద’ ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ కిక్-స్టార్ట్

మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘స్కంద- ది ఎటాకర్‌’ రూపొందిస్తున్నారు. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రం కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టైటిల్‌ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించగా, థమన్ స్కోర్ చేసిన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో ఉంది. ఈలోగ మేకర్స్ ఆఫ్‌లైన్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఈ ఫిల్మ్ స్టాండీలు విడుదలయ్యాయి, అన్ని చోట్ల ఏర్పాటు చేయబడ్డాయి. స్టాండీ ఇమేజస్ ఒకదానిలో రామ్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. మరొక ఇమేజ్ రామ్, శ్రీలీల రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రజంట్ చేస్తోంది. యాక్షన్ పోస్టర్ మాస్‌ని ఆకట్టుకుంటే, రొమాంటిక్ పోస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పిస్తుంది.

ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి, సినిమా చూడాలనే క్యూరియాసిటీని మరింత పెంచడానికి రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved