Dynamic director Puri Jagannadh’s pan-India action-drama Slum Dog: 33 Temple Road, featuring versatile actor Vijay Sethupathi in the lead, has completed its entire shooting schedule. The final schedule was wrapped up today in Hyderabad. Produced by Puri Jagannadh and Charmme Kaur under the banner of Puri Connects, the film has generated considerable buzz with its promotional content.
Known for his distinctive storytelling and dynamic screen presentation, Puri Jagannadh is ensuring that the film strikes the right balance of elements to appeal to audiences across all sections. The character introduction videos released so far have offered glimpses into the different facets of the movie.
The makers are now planning to ramp up promotional activities as they gear up to bring the film to theatres soon.
Samyuktha plays the female lead, while Tabu, Duniya Vijay, Zarina Wahab, Brahmaji and VTV Ganesh appear in significant roles. As evident in the previously unveiled glimpses, each character has its own importance.
Comng to the technical crew, Sam K Naidu handles the cinematography, Harshavardhan Rameshwar composes the music, and Santosh Noozilla is in charge of editing.
The film is set for a pan-India release in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi.
డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్' షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్‌లో ఈరోజు జరిగిన చివరి షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం ముగిసింది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది.
పవర్ ఫుల్ కథలు, తనదైన స్క్రీన్ ప్రజెంటేషన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటివరకు విడుదలైన పాత్రల పరిచయ వీడియోలు సినిమాలోని విభిన్న పాత్రల స్వభావాలను పరిచయం చేశాయి.
త్వరలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న మేకర్స్.. ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నారు. సినిమా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటించనున్నారు.
ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్, జరీనా వహాబ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ను బట్టి సినిమాలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలను సామ్ కె. నాయుడు నిర్వహిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ నూజిల్లా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అనిల్ పడూరి విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షిస్తున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.