pizza

Bobby Kolli, Kona Venkat Present- Sree Vishnu, Janaki Ram Marella, Skanda Vahana Motion Pictures LLP, Whistle Worthy Films & KFC’s Production No 1 Launched Grandly On Ugadi
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి, కోన వెంకట్ ప్రజెంట్స్- శ్రీ విష్ణు, జానకి రామ్ మారెళ్ల, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP, విజిల్ వర్తీ ఫిల్మ్స్ & కెఎఫ్‌సీ ప్రొడక్షన్ నంబర్ 1 ఉగాది సందర్భంగా గ్రాండ్ గా లాంచ్

You are at idlebrain.com > news today >

09 April 2024
Hyderabad

Hero Sree Vishnu is enjoying the best form of his career with consecutive blockbusters- Samajavaragamana and Om Bheem Bush. The talented actor who signed some exciting projects announced his 19th movie today. It will be directed by debutant Janaki Ram Marella, and produced by Anusha Dronavalli, Seetha Kumari Kotha, and Gopalam Lakshmi Deepak under the banners of Skanda Vahana Motion Pictures LLP, Whistle Worthy Films & KFC as Production No 1. Blockbuster director Bobby Kolli and ace writer Kona Venkat present the movie.

#SreeVishnu19 has been launched grandly today, on the propitious occasion of Telugu New Year, i.e. Ugadi, with many celebrities from the industry gracing it. Naveen Yerneni, Nandhini Reddy and Kishore Thirumala handed over the script to the makers. While Dil Raju sounded the clapboard, Anil Ravipudi switched on the camera. VV Vinayak did the honorary direction for the first shot. Sahu Garipati, Mythri Movie Makers Ravi Shankar, Sharrath Marar, Sithara Naga Vamsi, BVS Ravi, and a few others attended the muhurtham ceremony.

Sree Vishnu despite doing different genre movies, is making sure every film has adequate entertainment. Coming to #SreeVishnu19, it is a fun-filled adventure with another interesting theme. While Bhanu Bhogavarapu penned the story, Nandu Savirigana is the dialogue writer.

Sai Sriram will handle the cinematography, whereas Vijay Bulaganin will score the music. Chota K Prasad is the editor and Narini Srinivas is the art director. The film’s heroine and other details will be revealed soon.

Cast: Sree Vishnu

Technical Crew:
Director: Janaki Ram Marella
Producers: Anusha Dronavalli, Seetha Kumari Kotha, and Gopalam Lakshmi Deepak
Banners: Skanda Vahana Motion Pictures LLP, Whistle Worthy Films & KFC
Presents: Kona Venkat, Bobby Kolli
Writers: Bhanu Bhogavarapu and Nandu Savirigana
Music: Vijay Bulaganin
DOP: Sai Sri Ram
Editor: Chota K Prasad
Art: Narini Srinivas
Executive Producer: Nagu Y

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి, కోన వెంకట్ ప్రజెంట్స్- శ్రీ విష్ణు, జానకి రామ్ మారెళ్ల, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP, విజిల్ వర్తీ ఫిల్మ్స్ & కెఎఫ్‌సీ ప్రొడక్షన్ నంబర్ 1 ఉగాది సందర్భంగా గ్రాండ్ గా లాంచ్

హీరో శ్రీవిష్ణు సామజవరగమన, ఓం భీమ్ బుష్‌' వరుస బ్లాక్‌బస్టర్స్ తో అద్భుతమైన ఫామ్ లో వున్నారు. కొన్ని ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌లకు సైన్ చేసిన శ్రీవిష్ణు ఈ రోజు తన 19వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించనున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP, విజిల్ వర్తీ ఫిల్మ్స్ & KFC ప్రొడక్షన్ నంబర్ 1గా అనూష ద్రోణవల్లి, సీతా కుమారి కొత, గోపాలం లక్ష్మీ దీపక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి, ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

#SreeVishnu19 ఈరోజు తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా, పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో ఘనంగా ప్రారంభమైయింది. నవీన్ యెర్నేని, నందిని రెడ్డి, కిషోర్ తిరుమల స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. దిల్ రాజు క్లాప్‌ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి వివి వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తం వేడుకకు సాహు గరిపాటి, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, శరత్ మరార్, సితార నాగ వంశీ, బివిఎస్ రవి, తదితరులు హాజరయ్యారు.

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున ఈ సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది. ఫస్ట్ టైం బాబీ గారు ప్రొడక్షన్ లోకి రావడం చాలా ఆనందంగా వుంది. అలాగే కోనగారు, కృష్ణ గారికి ధన్యవాదాలు. ఇది చాలా డిఫరెంట్ స్క్రిప్ట్. డీవోపీ సాయి శ్రీరామ్, విజయ్ బులగానిన్ మ్యూజిక్. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, రైటర్స్ భాను, నందు.. టీం అంతా బాగా కుదిరింది. ఈ సినిమాతో జానకి రామ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నందు చాలా అనందంగా వుంది. చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అందరికీ కూడా ఆహ్లాదకరమైన సినిమా ఇస్తామని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ ఉగాది. ఈ సినిమాలో భాగం అవ్వడానికి కారణం.. నా టీంలో లేదా బయట.. నిర్మాతలని అప్రోచ్ అవ్వాలని చాలా మంది అడుగుతుంటారు. మనమే ధైర్యంగా ఓ అడుగువేసి ముందుకు రావాలనే ఆలోచన ఎప్పటినుంచో వుండేది. జానకి రామ్ 'పవర్' సినిమా నుంచి నా దగ్గర అసోషియేట్ గా చేస్తున్నారు. శ్రీవిష్ణు పేరు చెప్పగానే వెంటనే ఓకే అన్నాను. ఈ కథ హిలేరియస్ గా, ఎంటర్ టైనింగ్ గా వుంది. సహా నిర్మాతలందరరికీ ఆల్ ది బెస్ట్. డీవోపీ సాయి శ్రీరామ్, విజయ్ బులగానిన్ మ్యూజిక్. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, రైటర్స్ భాను, నందు అంతా బెస్ట్ టీం వున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.' తెలిపారు.

రైటర్ కోనవెంకట్ మాట్లాడుతూ.. అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నాకు, బాబీకి ప్రతి రోజు ఏవో క్రియేటివ్ ఆలోచనలు పుట్టుకోస్తుంటాయి. తన ఆలోచనలన్నీ ఛానలైజ్ చేయడానికి విజిల్ వర్తీ ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాణంలో రావడం చాలా ఆనందంగా వుంది. బాబీ మాస్ రైటర్, డైరెక్టర్. తను నిర్మించిన సినిమా కూడా ప్రేక్షకులు విజల్ వేసేలా వుండాలనే ఆలోచనతో విజిల్ వర్తీ ఫిలిమ్స్ అని పేరుపెట్టడం నాకు చాలా నచ్చింది. శ్రీవిష్ణుతో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. డీవోపీ సాయి శ్రీరామ్, విజయ్ బులగానిన్ మ్యూజిక్. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, రైటర్స్ భాను, నందు ఇలా మంచి టీంతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ వేడుక విచ్చేసిన అతిధులందరికీ ధన్యవాదాలు' తెలిపారు.

శ్రీవిష్ణు డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడంతో పాటు ప్రతి సినిమాలో తగిన వినోదం ఉండేలా చూసుకుంటున్నారు. #SreeVishnu19 మరొక ఆసక్తికరమైన థీమ్‌తో కూడిన ఫన్ ఫిల్డ్ ఎడ్వంచర్. భాను భోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాస్తున్నారు.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, విజయ్ బులగానిన్ సంగీతం అందించనున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, నారిని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.

తారాగణం: శ్రీ విష్ణు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: జానకి రామ్ మారెళ్ల
నిర్మాతలు: అనూష ద్రోణవల్లి, సీతా కుమారి కొత, గోపాలం లక్ష్మీ దీపక్
బ్యానర్లు: స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP, విజిల్ వర్తీ ఫిల్మ్స్ & KFC
సమర్పణ: కోన వెంకట్, బాబీ కొల్లి
రచయితలు: భాను భోగవరపు, నందు సవిరిగణ
సంగీతం: విజయ్ బులగానిన్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ఆర్ట్: నారిని శ్రీనివాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగు వై
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved