pizza

Naresh look from Srinivasa Mangapuram released
అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి స్వాతంత్ర బాబు గా నవరసరాయ డా. నరేష్ వికే ఫస్ట్ లుక్ రిలీజ్

You are at idlebrain.com > news today >

01 April 2026
Hyderabad

RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి నవరసరాయ డా. నరేష్ వికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ స్వాతంత్ర బాబు పాత్ర పోషిస్తున్నారు. ఒక చేతి లో బాటిల్ మరో చేతిలో టేప్ రికార్డర్ పట్టుకొని డాన్స్ వైబ్ లో కనిపించిన నరేష్ లుక్ ఆకట్టుకుంది. ఈ పాత్ర ఆయన కెరీర్ లో మరో బెంచ్ మార్క్ క్యారెక్టర్ గా ఉండబోతుంది.

అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిర్మాత పి కిరణ్ నిర్మిస్తున్న శ్రీనివాస మంగాపురం ఇప్పటికే విడుదలైన టైటిల్ రివీల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్ల ఆసక్తిని రేకెత్తించాయి.

టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంగీతాన్ని జివి ప్రకాశ్ కుమార్ సమకూరుస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ ISC, ఎడిటింగ్ బాధ్యతలను మాధవ్ కుమార్ గుల్లపాటి నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్. హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.

నటీనటులు: జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తాడాని, మోహన్ బాబు, డా. నరేష్ వికే

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి.కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపాటి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాకమూరి నారాయణ స్వామి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved