pizza

Summer Holidays Will Not Disappoint You; We Have Made a Film That Is 200% Worth Watching: Producer Dheeraj Mogilineni at the Pre-Release Press Meet
"సమ్మర్ హాలిడేస్" సినిమా మిమ్మల్ని ఏమాత్రం నిరాశపర్చదు, 200% మంచి సినిమా చేశాం - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని

You are at idlebrain.com > news today >

05 Novembar 2026
Hyderabad

Dheeraj Mogilineni has earned a reputation as a successful producer and distributor by bringing content-driven films to audiences. Under his banner, Dheeraj Mogilineni Entertainments, he is producing a children’s film titled “Summer Holidays.” Director Srikar has crafted the film around a beautiful story that brings back cherished childhood memories. Master Rohan, Master Arun and Baby Khushi play key roles in the movie, which is set for a grand theatrical release on November 6. The film’s pre-release press meet was held in Hyderabad today.

Baby Khushi said, “Summer Holidays is a beautiful feel-good movie that will appeal to children as well as adults. Along with entertainment, our film also conveys a meaningful message. Everyone will experience a sense of nostalgia while watching it. Arun and Rohan were always so much fun on the sets, and I really enjoyed working with them. I thank our director and producer for giving me this wonderful opportunity.”

Master Rohan said, “My mother has worked extremely hard to help me pursue my career as an actor. She took care of everything, including all the travel involved during the making of this film. My mother really liked the story, and she is the reason I became part of this movie. If the film receives positive talk and becomes a success, I will gain recognition as an actor. I will feel that all my hard work has paid off.”

Master Arun said, “I really liked the story of Summer Holidays. The film beautifully highlights the value of friendship. These days, friendships sometimes break over even the smallest issues. While working on this film, I understood how close friends were during the 1990s. What impressed me most was how much one friend would go through for another. That aspect of the story really appealed to me.”

Director Srikar Nayan said, “Ever since we began working on Summer Holidays, we have maintained a positive atmosphere, and that same energy has continued right up to the release. This film began as a two-line story that I had written. It gradually developed into a story spanning several pages and eventually became a 120-minute film. We added commercial elements to the story I originally envisioned and shaped it into an entertaining movie. Watching the completed film on screen has given me immense satisfaction. I am confident that audiences will also feel happy while watching it in theatres. They will walk out with the satisfaction of having watched a good film. Films like Court, which tell compelling stories, have inspired me as a filmmaker. I believe audiences will enjoy every minute of our 115-minute film without feeling bored even once.”

Producer Dheeraj Mogilineni said, “We often feel that children have no future if they do not score good marks or secure high ranks. However, the important message our film conveys through Rohan’s character is that whatever we do in life, we must face challenges with courage and confidence.

“Arun plays a boy who grows up in the city, where studies are his entire world and his circle of friends and family is quite limited. During his summer holidays, he visits his grandmother’s village, where he meets Rohan and learns several important lessons about life. Through Rohan, Arun discovers the courage to face any situation and overcome challenges. Although Rohan’s character is playful and mischievous, he has his own struggles and pain. How he overcomes them has been portrayed in an interesting way.

“This is a film featuring children, but its story has something meaningful for adults too. There is a child within every one of us, and this film will bring back our childhood memories. It will make everyone think about their childhood friends and wish to meet them again. The film also reminds us of our grandparents and shows how happy they would be if we spent even a day or two with them.

“We do not know whether one lakh or ten lakh people will watch our film, but I can confidently say that not a single person will be disappointed. Audiences will walk out of the theatres with their hearts full of emotions and will be reminded of beautiful memories. The film will stay with them for several days after they watch it. We have made a film that is 200% worth watching. Telugu audiences have always encouraged good cinema. This Diwali, come and watch our film with your family. We will certainly entertain you.”

Cast: Rohan Roy, Arun, Khushi, Jayasudha, Rajeev Kanakala, Vasuki, Harshini, Harshavardhan and others.

Technical Team:

DOP: Sai Prakash

Music Director: Sinjith Yerramalli

Banner: Dheeraj Mogilineni Entertainments

Producer: Dheeraj Mogilineni

Story and Direction: Srikar

"సమ్మర్ హాలిడేస్" సినిమా మిమ్మల్ని ఏమాత్రం నిరాశపర్చదు, 200% మంచి సినిమా చేశాం - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

బేబి ఖుషి మాట్లాడుతూ - "సమ్మర్ హాలిడేస్" మంచి ఫీల్ గుడ్ మూవీ. పిల్లలతో పాటు పెద్దవాళ్లకు కూడా బాగా నచ్చుతుంది. ఎంటర్ టైన్ మెంట్ తో మా మూవీ సాగుతూనే మంచి మెసేజ్ కూడా అందిస్తుంది. ప్రతి ఒక్కరూ నోల్టాల్జిక్ గా ఫీలవుతారు. అరుణ్, రోహన్ సెట్ లో చాలా సరదాగా ఉండేవారు. వారితో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. అన్నారు.

మాస్టర్ రోహన్ మాట్లాడుతూ - నేను నటుడిగా కెరీర్ కొనసాగించేందుకు అమ్మ చాలా కష్టపడుతోంది. ఈ సినిమా కోసం నేను ఎక్కడికి జర్నీ చేయాలన్నా అమ్మే అన్నీ చూసుకునేది. ఈ కథ మా అమ్మకు బాగా నచ్చింది. నేను ఈ సినిమాలో నటించాను అంటే కారణం మా అమ్మే. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి మంచి విజయం సాధిస్తే నాకు నటుడిగా గుర్తింపు వస్తుంది. నా కష్టానికి తగిన ఫలితం దక్కిందని భావిస్తా. అన్నారు.

మాస్టర్ అరుణ్ మాట్లాడుతూ - "సమ్మర్ హాలిడేస్" స్టోరీ నాకు బాగా నచ్చింది. ఇందులో ఫ్రెండ్షిప్ వ్యాల్యూస్ గురించి బాగా చెప్పారు. ఇప్పుడు చిన్నచిన్న విషయాలకే స్నేహితులు విడిపోతున్నారు. 90's స్నేహితులు ఎంత బాగా కలిసి ఉండేవారు అనేది ఈ సినిమాలో నటించేప్పుడు తెలుసుకున్నాను. ఒక ఫ్రెండ్ కోసం మరో ఫ్రెండ్ ఎంత కష్టపడేవాడు అనేది ఈ కథలో నన్ను ఆకట్టుకుంది. అన్నారు.

డైరెక్టర్ శ్రీకర్ నయన్ మాట్లాడుతూ - మా సమ్మర్ హాలిడేస్ సినిమా బిగిన్ చేసినప్పటి నుంచి పాజిటివ్ వైబ్ తోనే వర్క్ చేస్తున్నాం. రిలీజ్ వరకు కూడా అదే పాజిటివ్ వైబ్ మా అందరిలో ఉంది. ఫస్ట్ నేను రాసుకున్న రెండు లైన్ల స్టోరీ ఇది. అది కొన్ని పేజీల కథగా మారి, 120 నిమిషాల సినిమాగా మీ ముందుకు వస్తోంది. నేను అనుకున్న కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఎంటర్ టైనింగ్ మూవీ చేశాము. స్క్రీన్ మీద మా మూవీ కాపీ చూస్తుంటే చాలా సంతృప్తిగా అనిపించింది. మీరు కూడా మా సినిమాను థియేటర్ లో చూస్తున్నప్పుడు హ్యాపీగా ఫీలవుతారు. సినిమా కంప్లీట్ అయి బయటకు వస్తున్నప్పుడు మంచి సినిమా చూశామనే సంతృప్తి మీలో కలుగుతుంది. కోర్ట్ లాంటి సినిమాను కథగా చెప్పి ఒప్పించడం కష్టం. అలాంటి సినిమాలు దర్శకుడిగా నాకు స్ఫూర్తినిచ్చాయి. మా సినిమాలోని 115 నిమిషాల్లో ప్రతి నిమిషాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక్క నిమిషం కూడా బోర్ ఫీల్ అవ్వరు. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - పిల్లలకు మార్కులు, ర్యాంకులు రాకపోతే లైఫ్ లేదు అనుకుంటున్నాం. కానీ జీవితంలో మనం ఏం చేసినా ధైర్యంగా నిలబడాలి, కాన్ఫిడెంట్ గా చేయాలని మంచి విషయాన్ని ఈ సినిమాలోని రోహన్ పాత్ర ద్వారా చెబుతున్నాం. నగరంలో పెరిగే అరుణ్ అనే అబ్బాయికి చదువే లోకం, తన ఫ్రెండ్స్, కుటుంబం చాలా చిన్నది. అలాంటి అబ్బాయి సమ్మర్ హాలీడేస్ కు అమ్మమ్మ ఊరికి వెళ్తాడు. అక్కడ రోహన్ పరిచయంతో అరుణ్ తన లైఫ్ లో ఎన్నో విషయాలు తెలుకుంటాడు. లైఫ్ లో ఎలాంటి సందర్భం వచ్చినా నిలబడి గెలవొచ్చు అనే ధైర్యాన్ని రోహన్ ను చూసి నేర్చుకుంటాడు అరుణ్. రోహన్ క్యారెక్టర్ ఎంత అల్లరిగా ఉన్నా, అతని లైఫ్ లో ఒక స్ట్రగుల్ ఉంటుంది, ఒక పెయిన్ ఉంటుంది. ఇవన్నీ తను ఎలా ఓవర్ కమ్ అయ్యాడు అనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా. మనలో ఒక చైల్డ్ ఉంటాడు. ఈ సినిమా చూశాక మన చైల్డ్ హుడ్ ను గుర్తుకుతెచ్చుకుంటాం. ప్రతి ఒక్కరూ తన చిన్ననాటి స్నేహితుల్ని కలవాలని అనుకుంటారు. మనకు మన గ్రాండ్ పేరెంట్స్ ను గుర్తుచేస్తుందీ సినిమా. ఒకట్రెండు రోజులు వారితో గడిపితే ఎంత సంతోషంగా ఉంటారు అనేది ఈ మూవీ తెలియజేస్తుంది. మా సినిమా లక్షమంది చూస్తారో, పది లక్షల మంది చూస్తారో తెలియదు. కానీ ఒక్కరు కూడా డిజప్పాయింట్ కారు అని చెప్పగలను. మా సినిమా చూసి బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. మంచి మెమొరీస్ రీకాల్ చేసుకుంటారు. సినిమా చూసిన తర్వాత కొన్ని రోజుల పాటు మీ మెమొరీస్ లోనే మా మూవీ ఉండిపోతుంది. 200 పర్సెంట్ మంచి సినిమా చేశాం. మంచి సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ దీపావళికి ఫ్యామిలీతో మా సినిమాకు రండి మిమ్మల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తాం. అన్నారు.

నటీనటులు - రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు

టెక్నికల్ టీమ్
డీవోపీ - సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ - సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ - ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ - సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ - శ్రీకర్



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved