pizza

Nikhil’s Swayambhu Launched Grandly, Regular Shoot Begins
నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియోస్ 'స్వయంభు' గ్రాండ్ గా ప్రారంభం, రెగ్యులర్ షూటింగ్ బిగిన్స్

You are at idlebrain.com > news today >
Follow Us

18 August 2023
Hyderabad

Hero Nikhil who gained nationwide fame with Karthikeya 2 will be joining forces with director Bharat Krishnamachari for his milestone 20th movie. Titled Swayambhu, Bhuvan and Sreekar will produce the movie under Pixel Studios with Tagore Madhu presenting it. While the title Swayambhu alone generated lots of curiosity, the title poster that showed the sacred Sengol made everyone inquisitive to know more about the project. Then, the first-look poster that presented Nikhil as a ferocious warrior received an overwhelming response.

The makers chose an auspicious occasion of Shravana Shukravaram to hold a grand launching ceremony. The opening has been organized in a majestic manner in the presence of the film’s entire team and special guests. The regular shoot of the movie also commences today. The announcement has been made through this stupefying poster where Nikhil as a warrior is seen aiming an arrow at a dragon while riding the horse. From his get-up to his costumes, this is a new Nikhil which we haven’t seen before. Like the first-look poster, this new poster too is out-of-this-world.

Samyuktha Menon is the female lead opposite Nikhil in the movie which is going to be the most expensive one in the actor’s career.

Swayambhu will be mounted with top technical standards. Manoj Paramahamsa helms the cinematography, while Ravi Basrur scores the music. M Prabhaharan is the production designer and the dialogues for the movie are provided by Vasudev Muneppagari.

Cast: Nikhil, Samyuktha Menon

Technical Crew:
Writer, Director: Bharat Krishnamachari
Producers: Bhuvan and Sreekar
Banner: Pixel Studios
Presents: Tagore Madhu
Music: Ravi Basrur
DOP: Manoj Paramahamsa
Dialogues: Vasudev Muneppagari
Production Designer: M Prabhaharan

నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియోస్ 'స్వయంభు' గ్రాండ్ గా ప్రారంభం, రెగ్యులర్ షూటింగ్ బిగిన్స్

'కార్తికేయ 2' చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేం సంపాదించిన హీరో నిఖిల్ తన మైల్ స్టోన్ 20వ సినిమా కోసం దర్శకుడు భరత్ కృష్ణమాచారితో జతకట్టారు. 'స్వయంభు' టైటిల్ తో ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్వయంభు టైటిల్ క్యూరియాసిటీని పెంచగా, పవిత్రమైనసెంగోల్‌ను చూపించే టైటిల్ పోస్టర్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి కలిగించింది. నిఖిల్‌ను ఫెరోషియస్ వారియర్ గా చూపించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా మేకర్స్ గ్రాండ్ లాంచింగ్ వేడుకను నిర్వహించారు. చిత్రబృందం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. చదలవాడ శ్రీనివాసరావు స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, సితార నాగవంశీ, దామోదర్ ప్రసాద్ హాజరయ్యారు.

సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. నిఖిల్ యోధుడిగా గుర్రపు స్వారీ చేస్తూ డ్రాగన్‌పై బాణం వేస్తున్నట్లు కనిపించిన స్టప్‌ఫైయింగ్ పోస్టర్ ద్వారా అనౌన్స్ మెంట్ చేశారు. మునుపెన్నడూ చూడని పాత్రలో నిఖిల్ కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లాగే ఈ కొత్త పోస్టర్ నెక్స్ట్ లెవల్ లో వుంది.

నటుడి కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది.

స్వయంభు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతుంది. రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.

తారాగణం: నిఖిల్, సంయుక్త మీనన్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
డీవోపీ: మనోజ్ పరమహంస
డైలాగ్స్: వాసుదేవ్ మునెప్పగారి
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved